కౌశల్, గీతా మాధురి ఫైట్.. బిగ్‌బాస్ కఠిన నిర్ణయం.. నూతన్‌కు షాక్!
Recommended Video

బిగ్‌బాస్‌లో 81, 82 రోజు కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించిన కొన్ని గొడవలు, బ్యూటీ కాంటెస్ట్ మధ్య గడిచిపోయింది. ఇంటి సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడంతో బిగ్‌బాస్ ఓ కఠిన నిర్ణయం తీసుకొన్నాడు. శనివారం, ఆదివారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియల గురించి ఇంటి సభ్యులు చర్చించుకోవడం కనిపించింది. కెప్టెన్సీ కావాలనుకొంటున్న నూతన్ నాయుడు ఆశలపై గీతా మాధురి నీళ్లు చల్లింది. ఇంకా ఏం జరిగిందంటే..

టాస్క్ నుంచి తప్పుకొన్న తనీష్
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నూతన్, తనీష్, రోల్ రైడా సైకిల్ తొక్కారు. నూతన్ తొక్కుతున్న సైకిల్ పదే పదే పడిపోయింది. దాంతో నూతన్ మధ్యలో ఆపాల్సి వచ్చింది. అది చూసి చిరాకు పడిన తనీష్ పోటీ నుంచి తప్పుకొన్నాడు.

నూతన్ రిక్వెస్ట్‌కు గీతా
రోల్ రైడా ఇప్పటికే కెప్టెన్సీ చేసినందుకు తను ఓ అవకాశం ఇవ్వాలని నూతన్ చేసిన రిక్వెస్ట్‌ను గీతా గ్రూప్ నిరాకరించింది. చివరి వరకు రోల్, నూతన్ సైకిల్‌పైనే ఉండటంతో ఈ వారం ఇంటికి కెప్టెన్ లేడు అని బిగ్‌బాస్ కఠిన నిర్ణయం తీసుకొన్నారు.

గొడవ పడిన కౌశల్, గీతా
కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా మరోసారి గీతా మాధురి, కౌశల్ మధ్య గొడవ జరిగింది. కెప్టెన్సీ టాస్క్ రూల్స్‌పై కౌశల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. ఆట రూల్స్ గురించి చెప్పే అధికారం, హక్కు నీకు లేదు అని విషయంపై గీతా మాధురి, కౌశల్ మధ్య గొడవ జరిగింది.

నీవు కెప్టెన్ కావడం ఇష్టం లేదు
కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా నూతన్ గురించి గీతా మాధురి చేసిన వ్యాఖ్యలు కౌశల్‌కు అసహనం తెప్పించాయి. నూతన్ కెప్టెన్ కావడం నాతోపాటు ఇంటి సభ్యులకు ఇష్టం లేదు. రోల్ రైడా కెప్టెన్ అయితే మాకు ఇష్టం. అందుకే పోటీ నుంచి తప్పుకో అని గీతా కామెంట్ చేసింది.

బ్యూటీ కాంటెస్ట్‌లో శ్యామల
ఇక హెయిర్ టానిక్ బ్యూటీ కాంటెస్ట్‌లో శ్యామల, దీప్తి, గీతా మాధురి పాల్గొన్నారు. శ్యామలకు రోల్, తనీష్, దీప్తికి నూతన్, గణేష్, గీతాకు సమ్రాట్, అమిత్ అలంకరించారు. కౌశల్ సంచాలకులుగా వ్యవహరించారు. ఈ పోటీలో శ్యామల బ్యూటిగా గెలిచింది.

వీకెండ్
వీకెండ్‌లో నాని వేదికపైకి రానున్నందున్న శనివారం గేమ్ ఆసక్తిగా మారే అవకాశం ఉంది. ఎలిమినేషన్ ప్రక్రియలో టాప్ కంటెస్టెంట్స్ ఉండటంతో ఎవరు బయటకు వెళ్తారనే విషయంపై ఆసక్తిని కలిగిస్తున్నది.


Click it and Unblock the Notifications











