తప్పుడు ప్రచారం ఆపండి.. ఆశలు తలకిందులు.. నా తల్లి రుణం తీర్చుకొనే సమయం.. కౌశల్ ఎమోషనల్

By Rajababu

బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా సెలబ్రిటీ కౌశల్‌ విశేష ఆదరణను సంపాదించుకొంటున్నాడు. ఇంటిలో సభ్యులందరూ ఒక జట్టుగా, కౌశల్ ఒక్కడు మరో జట్టుగా తనదైన శైలిలో ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. గత మూడు నెలల్లో కౌశల్‌కు భారీ సంఖ్యలో అభిమానులుగా మారారు. ఇటీవల కౌశల్ ఆర్మీ నిర్వహించిన 2కే రన్‌కు విశేష ఆదరణ లభించింది. అలాగే దాదాపు ప్రతీవారం నామినేట్ అవుతూ ఎలిమినేషన్‌ను ధీటుగా ఎదుర్కొంటున్న కౌశల్ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో తీవ్రంగా ఉద్వేగానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..

కృషితో నాస్తి దుర్బిక్షం

కృషితో నాస్తి దుర్బిక్షం

కౌశల్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకొన్న తర్వాత ఉద్వేగానికి గురయ్యాడు. అనంతరం నాని అనుమతితో మాట్లాడుతూ.. కృషితో నాస్తి దుర్బిక్షం అన్నారు పెద్దలు. కృషితో ఎలాంటి కార్యాన్నైనా సాధించవచ్చు అంటారు. కృషితో దేన్నైనా సాధించాలనుకునే వ్యక్తి నేను. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న నాకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఓటు చేసినందుకు ధన్యవాధాలు అన్నారు.

ఫేక్ అకౌంట్లతో ప్రచారం చేయొద్ద కౌశల్

ఫేక్ అకౌంట్లతో ప్రచారం చేయొద్ద కౌశల్

గతంలో ఓ ఫోన్ కాల్ సందర్భంగా కౌశల్ ఆర్మీ పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించి నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నట్టు శేఖర్ అనే బ్రదర్ చెప్పాడు. నా పేరుతో ఎవరైనా అలాంటి పనులు చేస్తే దయచేసి ఆపండి. మీరు చేసే పనులు వల్ల మా ఊహలు తలకిందులవుతాయి. మీరెవరూ కూడా అలా తప్పుదోవ పట్టించే పనులు చేయవద్దు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 91 Highlights
నా తల్లికి మాటిచ్చానని కౌశల్..

నా తల్లికి మాటిచ్చానని కౌశల్..

నా తల్లి బతికి ఉన్నప్పుడు ఓ ప్రామిస్ చేశాను. నీవు ఇచ్చిన రూపానికి, టాలెంట్‌కు, తెలివి తేటలకు ఎప్పుడైనా ఏదో సాధిస్తానని, నీ రుణం తీర్చుకొంటానని మాటిచ్చాను. బిగ్‌బాస్ ద్వారా నా తల్లి రుణం తీర్చుకొనే సమయం వచ్చింది అని ఉద్వేగంగా కౌశల్ మాట్లాడాడు.

క్యాన్సర్‌తో కౌశల్ తల్లి మరణం

క్యాన్సర్‌తో కౌశల్ తల్లి మరణం

కౌశల్ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు అతడి తల్లి క్యాన్సర్ వ్యాధికి లోనైంది. చివరి రోజుల్లో ఆమెతో గడపడానికి సమయం చిక్కలేదని ఈ షోలో కౌశల్ ఆవేదనకు గురయ్యాడు. అలాగే తన తల్లి మరణించినప్పుడు ఆమె కాలి మెట్టను తీసుకొని తన ఉంగరంగా మలచుకొన్నాను అని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన తల్లిని తలుచుకొని కౌశల్ ఎమోషనల్ అయ్యాడు.

శ్యామల రెండోసారి అవుట్

శ్యామల రెండోసారి అవుట్

ఇదిలా ఉండగా, ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్‌లో యాంకర్ శ్యామల ఇంటి నుంచి నిష్క్రమించింది. శ్యామల ఇంటి నుంచి అవుట్ కావడం ఇది రెండోసారి. ఎందుకంటే గతంలో ఎలిమినేట్ అయిన శ్యామల మళ్లీ ఓటింగ్ ద్వారా ఇంటిలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X