twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వాతి దీక్షిత్‌ ఎలిమినేషన్ అలా జరిగింది.. అసలు విషయం బయటపెట్టిన కౌశల్

    |

    బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 4 బ్రహ్మండంగా సాగిపోతున్నది. వివాదాలు, వినోదాల మేలవింపుతో ఐదోవారానికి చేరుకొన్నది. అయితే నాలుగో వారంలో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కావడం ఇంటి సభ్యులను, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. వైల్డ్ కార్డుగా వచ్చిన స్వాతి పట్టుమని రెండు వారాలు ఉండకుండానే ఇంటి బయటకు వెళ్లిపోవడం కొంత నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు 2 విజేత కౌశల్ మండా చేసిన ఆసక్తికరమైన కామెంట్స్ ఏమిటంటే..

     వైల్డ్ కార్డుగా ప్రవేశించి త్వరగా ఎలిమినేషన్

    వైల్డ్ కార్డుగా ప్రవేశించి త్వరగా ఎలిమినేషన్

    బిగ్‌బాస్ హౌస్‌లోకి హీరోయిన్ స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డు ఎంట్రీగా ఇంట్లోకి వచ్చింది. ఇంటి సభ్యులతో కలిసి పోతున్నారనే ఫీలింగ్ కలుగుతున్న సమయంలో అనూహ్యంగా ఇంటి నుంచి నిష్క్రమించింది. అయితే స్వాతి దీక్షిత్‌ మాత్రమే కాకుండా మూడో వారం దేవీ నాగవల్లి కూడా బయటకు వెళ్లడం కూడా కొంత వివాదంగా మారింది.

    స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్‌కు మీరే కారణం

    స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్‌కు మీరే కారణం

    ఇక స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కావడానికి కారణం మీరే మాస్టారూ అంటూ అమ్మా రాజశేఖర్‌పై కంటెస్టెంట్ నోయల్ సీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కగా ఉండగానే ఆమెను తుంచి వేసి ఇంటి నుంచి బయటకు పంపించావు. ఏ కారణం లేకుండా నామినేట్ చేయడం దారుణం అంటూ అమ్మా రాజశేఖర్‌ను నోయల్ ఐదోవారానికి నామినేట్ చేశారు.

    స్వాతి దీక్షిత్ గురించి కౌశల్ మండా

    స్వాతి దీక్షిత్ గురించి కౌశల్ మండా

    ఇక బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ గురించి కౌశల్ మండా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్‌గా రాణించాలనే కోరికతో ఉన్న స్వాతి దీక్షిత్ తొలినాళ్లలో నా వద్ద మోడలింగ్‌లో ఏబీసీడీలు నేర్చుకొన్నారు. అలాంటి స్వాతి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా కనిపించడం హ్యాపీగా అనిపించింది. కానీ చాలా త్వరగా ఇంటి నుంచి రావడం బాధ కలిగించింది అని కౌశల్ మండా ట్వీట్ చేశారు.

    Recommended Video

    Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
     బిగ్‌బాస్‌ తెలుగు 4లో ఆ రూల్ లేదు

    బిగ్‌బాస్‌ తెలుగు 4లో ఆ రూల్ లేదు

    బిగ్‌బాస్ గేమ్ నియమాలను కౌశల్ మండా వెల్లడిస్తూ.. సాధారణంగా, వైల్డ్ కార్డు ఎంట్రీగా ప్రవేశించే కంటెస్టెంట్లకు రెండు వారాల మినహాయింపు ఈ రియాలిటీ షో ఉంటుంది. కానీ, అలాంటి మినహాయింపు ఈ సీజన్‌లో లేదు. అయినా ఫర్వాలేదు. భవిష్యత్‌లో స్వాతి మరింత రాణించాలని కోరుకొంటున్నాను. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆమెతో నా ఇంటర్వ్యూ గురువారం ప్రసారం అవుతుంది అని కౌశల్ చెప్పారు.

    English summary
    Kaushal Manda about Swathi Deekshith's elimination from Bigg Boss Telugu 4. Kaushal tweeted that, Usually, #BiggBoss will give 14days exemption to all the wildcard contestants. But, this season we saw there's no exemption. And, happy to see her and all the best for her future.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X