Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరోసారి బిల్డప్ ఇచ్చి బుక్కైన కౌశల్.. బిగ్‌బాస్‌లో వచ్చిన ఫోన్ పగలగొట్టి..
బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ మండా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను బిగ్ బాస్ ద్వారా ఎంత స్పీడ్ గా క్రేజ్ అందుకున్నాడో అంతే స్పీడ్ గా డౌన్ అయ్యాడు. రియాలిటీ షో ఉన్నన్ని రోజులు ఒక విధంగా మనోడు సపరేట్ గా ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం అతని ఓవరాక్షన్ కారణంగా ఉన్న ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసుకున్నాడు అనే విధంగా ట్రోల్స్ వచ్చయి.
Recommended Video
మరోసారి ట్రోలింగ్..
ఇప్పుడు మరోసారి కౌశల్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. ప్రస్తుతం చైనా ఇండియా మధ్య నెలకొన్న పరిస్థితులపై ప్రతి ఒక్క సెలబ్రెటీ చాలా వినూత్నంగా స్పందిస్తున్నారు. అయితే ఆ విషయంపై కౌశల్ కూడా స్పందించాడు. చైనా ప్రాడక్ట్స్ ని ఇక ఏ మాత్రం కొనకూడదని తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.
ఫోన్ పగలగొట్టి..
అంతా బాగానే చెప్పాడు గాని చివరికి అతను చేసిన పనికి ట్రోలింగ్ కి గురి కావాల్సి వచ్చింది. బిగ్ బాస్ లో గెలిచిన మొబైల్ ఫోన్ ని కూడా ఈ యాక్టర్ పగలగొట్టి మరి చైనా వస్తువులను బ్యాన్ చేయాలని వీడియో రిలీజ్ చేశాడు. దీంతో నెటీజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
|
కౌషల్ చేసిన పనికి..కౌంటర్స్
ఒకప్పుడు కౌశల్ ఆర్మీ అంటూ సపోర్ట్ చేసిన వారు కూడా బిగ్ బాస్ విన్నర్ పై ఊహించని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. చైనా వస్తువులను బ్యాన్ చేయడం అంటే.. ఉన్నవి పగలగొట్టడం కాదు అంటూ.. కొత్తవి కొనకూడదని కౌశల్ చేసిన పనికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు విమర్శలకు గురైన కౌశల్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు.
నెక్స్ట్ సినిమాలో పోలీస్..
కౌశల్ చాలా కాలం తరువాత ఒక మాంచి క్యారెక్టర్ అందుకున్నట్లు తెలుస్తోంది. సాయి కుమార్ తనయుడు ఆది నెక్స్ట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. మొత్తానికి ఒక సినిమాలో అయితే ముఖ్యమైన పాత్రను అందుకున్నాడు గాని.. ఇంతకంటే హై రేంజ్ లో స్టార్ హీరోలతో నటిస్తాడు అనుకున్న కౌశల్ ఆడియెన్స్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు.