twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గంగవ్వపై జోరుగా రూమర్లు.. బిగ్‌బాస్‌ నిర్ణయంపై షాకింగ్‌గా కౌశల్ కామెంట్!

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో మొదటి దశను పూర్తి చేసుకొని రెండో అంకంలోకి చేరుకొన్నది. దాదాపు 50 రోజులుగా ఒడిదుడుకులతో రియాలిటీ షో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కౌశల్ మండా స్పందించారు. ఆయన షో గురించి అనేక విషయాలను వెల్లడిస్తూ తన అనుభవాలను, అభిప్రాయలను పంచుకొన్నారు. కౌశల్ మండా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..

     బిగ్‌బాస్‌లో బలమైన కంటెస్టెంట్లు కనిపించడం లేదు

    బిగ్‌బాస్‌లో బలమైన కంటెస్టెంట్లు కనిపించడం లేదు

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలిచే అవకాశమే లేదు. ఎందుకంటే అంత సత్తా ఉన్న లేడి కంటెస్టెంట్ కనిపించడం లేదు. గత సీజన్లలో హరితేజ, అర్చన, గీతా మాధురి, శ్రీముఖి బలమైన కంటెస్టెంట్లు కనిపించడం లేదు. అందుకే ఈ సారి కూడా లేడి కంటెస్టెంట్ విజేతగా నిలిచే అవకాశం లేదనేది నా అభిప్రాయం అని కౌశల్ మండా అన్నారు.

    లాస్య బలం, బలహీనతలు

    లాస్య బలం, బలహీనతలు

    ఇంటిలోని మహిళా కంటెస్టెంట్లపై కౌశల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. లాస్య విషయానికి వస్తే.. ఆమె నవ్వు, ఇంటిలోని సభ్యులకు వంట చేసి పెట్టడం, ఇంటి సభ్యులకు సంబంధించిన ఫుడ్‌ను అందించడం ఆమెకు బలంగా మారాయి. తనపై వచ్చే విమర్శలు, ఆరోపణలను తిప్పి కొట్టడంలోనూ.. ఇతరులపై కామెంట్ చేయడంలోను విఫలవుతున్నారు. ఇదే ఆమె బలహీనత అంటూ కౌశల్ మండా పేర్కొన్నారు.

    హారిక ప్లస్, మైనస్ పాయింట్స్

    హారిక ప్లస్, మైనస్ పాయింట్స్

    ఇక హారిక విషయానికి వస్తే.. ఉత్సాహం, ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించడం, అలాగే ప్రేక్షకులు వినోదాన్ని అందించే విషయాలు ఆమె బలంగా మారాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్లను ధీటుగా ఎదుర్కొనకపోవడం, కొంత అమాయకత్వం, ఎమోషనల్‌గా ఉండటం ఆమెకు బలహీనతగా మారాయి అని కౌశల్ తెలిపారు.

    అరియానా గ్లోరి బలం అదే

    అరియానా గ్లోరి బలం అదే

    అరియానా గ్లోరి విషయానికి వస్తే.. లేడి కంటెస్టెంట్లలో చాలా చురుకుగా ఆడుతున్నది. ఆమె వినిపించే వాయిస్, చొరవ తీసుకోవడం, టాస్క్‌లను ఎఫెక్టివ్‌గా ఆడటం ఆమెకు బలంగా మారాయి. ఆమెకు ఓపిక, సహనం తక్కువ. అందుకే వాదనలు వచ్చినప్పుడు ఆమె తన సత్తాను చాటుకోలేకపోతున్నది అని కౌశల్ అన్నారు.

     గంగవ్వను బిగ్‌బాస్‌లోకి తీసుకు రావడంపై

    గంగవ్వను బిగ్‌బాస్‌లోకి తీసుకు రావడంపై

    గంగవ్వను బిగ్‌బాస్‌లోకి తీసుకురావడం నిర్వాహకులు తీసుకొన్న తెలివైన నిర్ణయమని చెప్పవచ్చు. గ్రామీణ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అవకాశం దక్కింది. అయితే ఆమెను బిగ్‌బాస్ కోసం ట్రైనింగ్ చేశారంటే అది తప్పు. బిగ్‌బాస్ కోసం ఎవరినైనా ట్రైనింగ్ ఇచ్చి పంపితే వర్కువట్ కాదు. గంగవ్వపై వచ్చిన రూమర్లలో వాస్తవం లేదని కౌశల్ మండా తెలిపారు.

    English summary
    Former Bigg Boss winner Kaushal manda expressed his views on Bigg Boss Telugu 4. He condemn rumours on Gangavva. Kaushal said, Gangavva selection make to attract the rural audience towards show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X