twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గంగవ్వ జాతకాన్ని చెప్పేసిన కౌశల్.. గీతా మాధురి ఫైనల్‌కు వచ్చినప్పుడు అంటూ

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో పెదవి విరిచిన దాఖలాలు తక్కువే. కానీ బిగ్‌బాస్ తెలుగు 4 షోలో ఎంపిక చేసిన వారిపై సర్వత్రా నిరసన, అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో తాజా సెలబ్రిటీల ఎంపికపై బిగ్‌బాస్ తెలుగు షో 2 విజేత కౌశల్ మండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ..

    అంచనాలకు భిన్నంగా సెలక్షన్

    అంచనాలకు భిన్నంగా సెలక్షన్

    బిగ్‌బాస్ తెలుగు 4 కోసం సెలబ్రిటీల ఎంపిక అంచనాలకు తగినట్టు లేదు. బహుశా కరోనావైరస్ కారణం అయి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సెలబ్రిటీలు ముందుకు రాకపోవడం వల్ల అందుబాటులో ఉన్నవారిని తీసుకొని ఉండవచ్చు అంటూ కౌశల్ అభిప్రాయపడ్డారు. అయితే గత సీజన్లకు, షో ప్రమాణాలకు తగినట్టుగా సభ్యుల ఎంపిక లేకపోవడంపై పెదవి విరిచారు.

    గంగవ్వ సెలక్షన్ సూపర్

    గంగవ్వ సెలక్షన్ సూపర్

    బిగ్‌బాస్‌లో నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన సెలక్షన్ గంగవ్వదే. బిగ్‌బాస్ నిర్వాహకులు తీసుకొన్న నిర్ణయంతో నేను ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాను. ఎవరైనా రిటైర్మ్ వయసు తర్వాత ప్రశాంతంగా ఉండాలని కోరుకొంటారు. కానీ వారందరికి భిన్నంగా గంగవ్వ ఉండటం నాకు స్ఫూర్తిగా అనిపిస్తున్నది. గంగవ్వ ఎంపిక గ్రామీణ వీక్షకులు సంఖ్యను పెంచడమేకాకుండా షోకు ఓటు బ్యాంక్ తెచ్చిపెడుతుంది అని కౌశల్ మండా పేర్కొన్నారు.

    గంగవ్వను చూస్తే ముచ్చటేస్తున్నది

    గంగవ్వను చూస్తే ముచ్చటేస్తున్నది

    అత్యంత సామాన్య కుటుంబం, గ్రామీణ నేపథ్యం ఉన్న గంగవ్వ ధైర్యాన్ని, ఆమె ప్రవర్తనను చూస్తే ముచ్చటేస్తున్నది. వయసును అధిగమించి ఆమె చూపిస్తున్న ఉత్సాహాన్ని అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. ఎంటర్‌టైన్ ఇండస్ట్రీ సంప్రదాయాలను బ్రేక్ చేసి అందరికీ ఓ స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని గంగవ్వపై కౌశల్ ప్రశంసల వర్షం కురిపించారు.

    గీతా మాధురి ఫైనల్‌కు వచ్చినప్పుడు..

    గీతా మాధురి ఫైనల్‌కు వచ్చినప్పుడు..

    బిగ్‌బాస్‌లో ఫిజికల్ టాస్క్‌లు సెలబ్రిటీ ప్రతిభను శాసించవు. గంగవ్వకు ఫిజికల్ టాస్క్‌లు ఓ సమస్య కాదు. మా సమయంలో గీతామాధురీ ఎలాంటి టాస్కులు చేయకుండా ఫైనల్‌కు వచ్చినప్పుడు గంగవ్వకు ఆ విషయం సమస్యే కాదు. నా అంచనా ప్రకారం గంగవ్వ 10 వారాలపాటు ఇంట్లో ఉంటుంది అని గంగవ్వ జాతకాన్ని కౌశల్ చెప్పేశారు.

    Recommended Video

    Amaram Akhilam Prema Would Be Released On September 18 In Aha
    గంగవ్వపైనే అందరి చూపు

    గంగవ్వపైనే అందరి చూపు

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4‌లోని సెలబ్రిటీల అందరిలోనూ అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న వ్యక్తిగా గంగవ్వ ఎదుగుతున్నారు. ప్రస్తుతం ఆమె ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న గంగవ్వ ఎలిమినేషన్ తప్పించుకోవడం పెద్ద సమస్య కాదు అనే అభిప్రాయం ఇంటి సభ్యుల్లోనూ, బుల్లితెర ప్రేక్షకుల్లోనూ ఉంది. గంగవ్వ టాలెంట్ ఆమెను ఎంత వరకు తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. The show started with electrifying start with introducing contestants of the show along with The promotional songs. Gangavva Selection is surprised every one. In this occassion, Kashal Manda of Bigg Boss 3 winner giver his opinion on the show and Gangavva.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X