twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుమ కాపురంలో చిచ్చు పెట్టిన కౌశల్: షో మధ్యలోనే భర్తపై కోప్పడిన టాప్ యాంకర్

    |

    తెలుగు బుల్లితెరపై తన హవాను చూపిస్తూ.. దాదాపు రెండు దశాబ్దాలుగా నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది సుమ కనకాల. గ్లామర్‌ షో ప్రధాన భూమిక పోషిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుర్ర యాంకర్లకు పోటీగా నిలుస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకుంటూ అదరగొడుతోంది. ఓ వైపు షోలు చేసుకుంటూనే.. మరోవైపు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్.. సుమ కాపురంలో చిచ్చు పెట్టాడు. అసలేం జరిగింది.? పూర్తి వివరాలు మీకోసం!

    వరుస షోలతో యాంకర్ దూకుడు

    వరుస షోలతో యాంకర్ దూకుడు

    తెలుగులో ప్రస్తుతం ఉన్న యాంకర్లలో టాప్ ప్లేస్‌లో ఉంది సుమ కనకాల. చాలా కాలంగా బుల్లితెరపై సత్తా చాటుతోన్న ఆమె.. సినిమా అవకాశాలను సైతం వదులుకుని మరీ షోలు చేస్తోంది. ఈ క్రమంలోనే వరుస షోలతో దూకుడు ప్రదర్శిస్తోంది. సుమ షో అంటే వందకు వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది అనేలా ఆమె పేరొందింది. అందుకే ప్రతి షోకూ మంచి రెస్పాన్స్ వస్తోంది.

    వాళ్లకు ఏదీ వదిలి పెట్టడం లేదు

    వాళ్లకు ఏదీ వదిలి పెట్టడం లేదు

    అప్పటి తరం యాంకర్లలో సుమ మాత్రమే ఇంకా హోస్టింగ్ చేస్తోంది. ఆ తర్వాత వచ్చిన రష్మీ గౌతమ్, అనసూయ, శ్యామల, లాస్య, శ్రీముఖి వంటి వాళ్లు తమ మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ సుమ ముందు రాణించలేకపోతున్నారు. అందుకే ప్రతి సినిమా ఫంక్షన్‌లోనూ ఆమె కనిపిస్తుంది. అలాగే, వాళ్ల కంటే ఎక్కువ షోలు హోస్ట్ చేస్తోంది.

    సుమ షోలలో ఇది చాలా స్పెషల్

    సుమ షోలలో ఇది చాలా స్పెషల్

    ఇప్పటి వరకు సుమ ఎన్నో షోలు హోస్ట్ చేసింది. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె చేస్తున్న షోలలో ‘క్యాష్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి శనివారం రాత్రి ప్రసారం అయ్యే ఈ షోకు సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు వస్తుంటారు. వాళ్లతో సుమ చేసే కామెడీ అదిరిపోతోంది. అందుకే దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి.

    సుమ కాపురంలో చిచ్చు పెట్టాడు

    సుమ కాపురంలో చిచ్చు పెట్టాడు

    క్యాష్ షోలో భాగంగా వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్లు కౌశల్ మండా, అమిత్, పూజా రామచంద్రన్, యాంకర్ శ్యామలలు గెస్టులుగా విచ్చేశారు. వీళ్లతో సుమ ఓ ఆట ఆడుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో ఆమె కాపురంలో చిచ్చు పెట్టాడు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    భర్తపై కోప్పడిన యాంకర్ సుమ

    భర్తపై కోప్పడిన యాంకర్ సుమ

    ఈ షోలో కౌశల్ మాట్లాడుతూ.. ‘నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మీరూ రాజీవ్ గారూ బైక్‌పై వెళ్లడం చూశాను' అని చెప్పాడు. దీనిపై స్పందించిన సుమ ‘మేమిద్దరం బైక్‌పైన ఎప్పుడూ తిరగలేదే. ఒకవేళ రాజీవ్ ఎవరినైనా ఎక్కించుకుని వెళ్లాడా.! రాజా... నువ్వు బైక్ మీద తీసుకెళ్లింది ఎవరిని చెప్పు' అంటూ కోప్పడినట్లు యాక్టింగ్ చేసింది. దీంతో అందరూ పగలబడి నవ్వుకున్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
    ప్రేమ వివాహం... ఆనంద జీవితం

    ప్రేమ వివాహం... ఆనంద జీవితం

    సుమ.. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారీ ఇద్దరు. వివాహం తర్వాత ఎవరి కెరీర్‌ను వాళ్లు చక్కగా నడుపుకుంటున్నారు. అలాగే ఈ మధ్య ఓ కొత్త దర్శకుడితో వాళ్ల కొడుకు రోషన్‌ సినిమాను లాంచ్ చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఆ మూవీపైనే ఫోకస్ చేస్తున్నారు.

    English summary
    Small screen Big anchor Suma kanakala rejects an Offer. Star Maa offered to Suma. But she is Not interested. This News goes viral in Social Media. Suma Fans Upset and Unhappy For Her decision. This is Hot Topic in Telugu TV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X