ఆ వెధవలకు జవాబు చెప్పే అవసరం లేదు..ఆర్మీకి కౌశల్ కౌంటర్.. తనీష్‌కు షాక్

సినిమా రంగంలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ.. యాక్టర్ కౌశల్‌ను బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఓవర్‌నైట్ స్టార్‌గా చేసింది. బిగ్‌బాస్‌లో చేరిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో కౌశల్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. బిగ్‌బాస్ కార్యక్రమం తుది దశకు చేరుకొనే సమయానికి కౌశల్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో కౌశల్ పెర్ఫార్మెన్స్‌కు అశేషంగా ఆడియెన్స్ స్పందించడంతో బిగ్‌బాగ్ విన్నర్‌గా నిలిపింది. విజేతగా నిలువడంలో కౌశల్ ఆర్మీ చేసిన కృషి అమూల్యమైనదనే చెప్పాలి. అయితే అలాంటి కౌశల్ ఆర్మీ ప్రస్తుతం కౌశల్‌పై విమర్శలతో దాడి చేస్తున్నది. ఏం జరిగిందంటే..

కౌశల్ నిజస్వరూపం అంటూ

కౌశల్ నిజస్వరూపం అంటూ

బిగ్‌బాస్‌లో చూసిన కౌశల్‌‌కు ప్రస్తుతం కనిపించే వ్యక్తికి చాలా తేడా ఉంది. అతను తన కౌశల్ ఆర్మీ సభ్యులను రకరకాలుగా వేధిస్తున్నాడు. డబ్బులు లాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఫ్యాన్స్‌తో డబ్బులు ఖర్చు చేయిస్తున్నాడు అని రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో కౌశల్ ఫాలోయింగ్‌పై దెబ్బ పడే పరిస్థితి ఏర్పడింది.

 ఇబ్బందుల్లో కౌశల్, ఫ్యాన్స్

ఇబ్బందుల్లో కౌశల్, ఫ్యాన్స్

తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో స్వయంగా కౌశల్‌తోపాటు ఫ్యాన్స్ కొంత మేరకు ఇబ్బందుల్లో పడిపోయారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు. కౌశల్‌పై కొందరు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? ఎందుకు కౌశల్‌ను కౌశల్ ఆర్మీ టార్గెట్ చేస్తున్నది అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.

 వాళ్లకు హ్యాపీ అయితే నాకు ఒకే

వాళ్లకు హ్యాపీ అయితే నాకు ఒకే

అయితే, తాజాగా తనపై వస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియాలో కౌశల్ స్పందించారు. ఒకవేళ నన్ను టార్గెట్ చేసుకోవాలంటే ఇబ్బంది లేదు. నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే వారికి ఏదైనా సంతృప్తి దొరికితే.. వారు అలాగే చేసుకోవచ్చు అని కౌశల్ ట్విట్టర్‌లో అన్నారు.

ఆ వెధవలకు సమాధానం చెప్పను

ఆ వెధవలకు సమాధానం చెప్పను

ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేస్తున్న వెధవలకు నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారికి జవాబు చెప్పే సమయం లేదు. శక్తిలేదు. నేను ఎలాగ ఉన్నానో అలాగే ఉంటాను. ఒకరి కోసం నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు అని కౌశల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

హీరో తనీష్‌కు కౌశల్ షాక్

హీరో తనీష్‌కు కౌశల్ షాక్

తనపై వస్తున్న ఆరోపణలకు ట్విట్టర్‌లో స్పందించిన కౌశల్‌.. హీరో తనీష్‌ను టార్గెట్ చేసినట్టు స్పష్టమైంది. తనీష్‌తో కొందరు సభ్యులు దిగిన ఫొటోను కౌశల్ షేర్ చేశాడు. అయితే తనీష్‌తో ఉన్న వ్యక్తులు ఎవరు అనేది ప్రశ్నగా మారింది. కౌశల్ ఆర్మీ సభ్యులు తనీష్‌ను కలిశారా అనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X