బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్.. అదే జరిగితే చరిత్ర సృష్టించినట్టే!
వినోదానికి లేదు ఫుల్‌స్టాప్ అంటూ తెలుగు బిగ్ బాస్ ఓటీటీ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతొ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. హౌస్‌లో 24 గంటలు ఏం జరిగిందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడమని ముందు ప్రేక్షకులను ఊరించించారు కానీ అది సాధ్యం కాలేదు. అందుకే ఒక రోజు గ్యాప్ తో దాన్ని ప్రసారం చేస్తున్నారు.
రోజంతా షో చూడటం సాధ్యపడనివాళ్ల కోసం ప్రతిరోజు ఒక గంటపాటు ఎపిసోడ్ ప్రసారం చేస్తున్నారు. ఇప్పటికే షో ప్రారంభమై రెండు వారాలు పూర్తవగా ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఎలిమినేట్ కూడా అయ్యారు. ఇంకా హౌస్ లో 15 మంది ఉండగా వీరిలో ఎవరు గెలుస్తారు అనే విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ వివరాలు

భారీ ఎత్తున విమర్శలు
బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ సోషల్ మీడియాలో ఎంతగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ ఆడిన ఆటకు ఎంతో మంది అభిమానులున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ట్రోలింగ్ జరిగింది. బయటకు వచ్చాక కూడా ఆయన మీద భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ కౌశల్‌కు బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు.

కౌశల్‌కు ఎదురుదెబ్బ
సినిమా అవకాశాలు కూడా అంతగా రాలేదు. కెరీర్ కూడా అంతగా ఊపందుకోలేదు. నిజానికి బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచే కౌశల్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్, దాని ఫండ్స్, డాక్టరేట్ అంశం, ప్రధాని ఆఫీస్ నుంచి ఫోన్ ఇలా ప్రతీ ఒక్క అంశంలో కౌశల్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

బిందుమాధవి
ఇలా అన్నింటిలోనూ కౌశల్ పరువు తీసుకున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోపై ఆసక్తికర కామెంట్లు చేశాడు బిగ్‌బాస్ మాజీ విన్నర్ కౌశల్. 'బిగ్‌బాస్ షోలో ఎవరు గెలుస్తారన్నదానిపై నా అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. ఈసారి బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌లో బిందుమాధవి గెలుస్తుంది. కొన్ని ప్రోమోలు చూశాను.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో
అందులో బిందు మాధవి యాటిట్యూడ్, ఆమె సామర్థ్యాలు ఆవిడే గెలుస్తాయని చెప్తున్నాయి. రీ ఎంట్రీ ఇచ్చిన కొందరు కంటెస్టెంట్లు బిగ్‌బాస్ గేమ్‌ను అర్థం చేసుకోవడంలో ఇప్పటికీ తడబడటం చూస్తుంటే నవ్వొస్తోంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.

చూడాలి మరి
అయితే ఒకరకంగా కౌశల్ చెప్పినట్లు బిందు మాధవి ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా నిలిస్తే మాత్రం తెలుగు బిగ్ బాస్ హిస్టరీ క్రియేట్ చేసినట్టే. ఎందుకంటే బిగ్‌బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్స్ పూర్తయ్యాయి. అందులో ఐదుసార్లు మగవాళ్లే విజేతలుగా నిలిచారు. ఒక లేడీ కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్‌లో గెలవలేదు. అదే జరిగితే నిజంగానే రికార్డు బ్రేక్ అయి చరిత్ర సృష్టించినట్లే. కౌశల్ అన్నాడని కాదు కానీ బిందు మాధవి కూడా కూల్‌గా తన పని తాను చేసుకుంటూ టైటిల్ రేస్‌లో ముందంజలో ఉంది. మరి చూడాలి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











