‘బిగ్ బాస్’ వివాదం: సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పిన కౌశల్.. వాళ్లకు గుడ్ లక్ అంటూ...
'బిగ్ బాస్' సీజన్ - 2 ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యాడు ప్రముఖ నటుడు కౌశల్. ఈ సీజన్‌లో సాధారణ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన అతడు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అంతేకాదు, కౌశల్ పేరిట ఆర్మీ కూడా తయారయింది. దీంతో అతడు ఈ రియాలిటీ షో విన్నర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఎన్నో వివాదాలు.. మరెన్నో గొడవలతో సతమతమైన కౌశల్.. తాజాగా కలకలం రేపుతున్న 'బిగ్ బాస్' వివాదంలోకి తలదూర్చాడు.

‘బిగ్ బాస్' షోపై స్పందన
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ వ్యయంతో వచ్చిన ‘బిగ్ బాస్' షోపై వచ్చిన వివాదంతో చాలా మంది దీన్ని నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు హైకోర్టులో పిల్ సైతం వేశారు. దీనిపై ఈ షో సీజన్ - 2 విన్నర్ కౌశల్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ‘‘బిగ్ బాస్ విన్నర్‌గా, సామాన్య సిటిజన్‌గా ఈ షోపై చాలా గౌరవం ఉంది'' అంటూ పోస్ట్ చేశాడు.

కంటెస్టెంట్ల ఎంపికపై...
ప్రస్తుతం ‘బిగ్ బాస్' సెలెక్షన్ ప్రాసెస్‌పై ఎంతో రాద్దాంతం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘ఈ షోలోకి రావాలంటే బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తావు' అన్నారని ఒకరు.. ‘వంద రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా..? నీ సెక్స్ లైఫ్‌ను ఎలా మేనేజ్ చేసుకోగలవు..?' అన్నారని మరొకరు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ‘బిగ్ బాస్' ప్రాసెస్‌పై అందరిలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌశల్ ఈ రియాలిటీ షోలో సెలెక్షన్ ప్రాసెస్ జెన్యూన్‌గా ఉంటుందని పేర్కొనడం విశేషం.

వాళ్లకు గుడ్ లక్ చెబుతూ..
ఈ వివాదం జరుగుతున్నా ‘బిగ్ బాస్' ప్రారంభం కావడం పక్కా అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి షోలో పాల్గొనే కంటెస్టెంట్‌లు అందరికీ కౌశల్ శుభాకాంక్షలు తెలియ జేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ‘‘సీజన్ -3లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లందరికీ గుడ్ లక్ చెబుతున్నా. మీరంతా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు'' అంటూ ట్వీట్ చేశాడు.

కౌశల్‌పై ట్రోలింగ్
భారీ రియాలిటీ షో ‘బిగ్ బాస్'కు అనుకూలంగా కౌశల్ ట్వీట్ చేయడంతో ఆయన వ్యతిరేకులు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ఆడవాళ్లు బయటకు వచ్చి ఆరోపణలు చేస్తుంటే.. నువ్వు సెలెక్షన్ ప్రాసెస్ మంచిగానే ఉంటుందని చెప్పడమేంటి..?' అంటూ అతడిని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, కొందరు సోషల్ మీడియా వేదికగా కౌశల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

జూలై 21 నుంచి ప్రారంభం
ఎన్నో అంచనాలు.. మరెన్నో వివాదాల నడుమ ‘బిగ్ బాస్' సీజన్ - 3 ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. గత రెండు సీజన్లను జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా, ఈ సారి మాత్రం అక్కినేని నాగార్జున ఆ బాధ్యతలను తీసుకున్నారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లతో ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











