twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ విన్నర్‌ పేరు ముందే లీక్ చేసిన కౌశల్.. ఆ కంటెస్టెంట్‌కు కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్

    |

    ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి వచ్చిన అనూహ్య మద్దతుతో సూపర్ డూపర్ హిట్ అయింది బిగ్ బాస్ షో. ఈ కారణంగానే తెలుగులో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నాలుగో సీజన్ కూడా మొదలై.. ఫినాలే స్టేజ్‌కు వచ్చేసింది. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతోన్న గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో షో పూర్తవకముందే బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ పేరును లీక్ చేశాడు కౌశల్ మండా. ఇంతకీ మాజీ విన్నర్ ఎవరి పేరును లీక్ చేశాడు? ఆ వివరాలు మీకోసం!

    ప్రారంభమైన గ్రాండ్ ఫినాలే.. అన్నీ ఫిక్స్

    ప్రారంభమైన గ్రాండ్ ఫినాలే.. అన్నీ ఫిక్స్

    బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం ప్రారంభం అయింది. అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ ఎపిసోడ్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. సినీ తారల ఆటపాటలతో స్టేజ్ ఊగిపోతోంది. టాప్ -5లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లు ట్రోఫీ కోసం పోరాడుతున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నారని తెలుస్తోంది.

    ఓటింగ్‌లో చివరి స్థానం.. ఆమె అవుట్

    ఓటింగ్‌లో చివరి స్థానం.. ఆమె అవుట్

    గ్రాండ్ ఫినాలే గెస్టుగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, మోహ్రీన్ హౌస్‌లోకి ప్రవేశించారు. కంటెస్టెంట్లు అందరితో ఆటలు ఆడించిన ఆయన.. చివర్లలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను తీసుకున్నారు. ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న దేత్తడి హారికను ఎలిమినేట్ చేశారు. క్రెయిన్ ద్వారా ఆమెను హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో షోలో నలుగురు మిగిలారు.

    విన్నర్ డిసైడ్... కానీ అనుమానాలు

    విన్నర్ డిసైడ్... కానీ అనుమానాలు

    ఈ సీజన్ మధ్యలో నుంచే అభిజీత్ విన్నర్ అవుతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు తగినట్లుగానే అతడు ఏకంగా 11 సార్లు నామినేట్ అయినా ఎలిమినేషన్ తప్పించుకున్నాడు. టాప్‌-5లోకి చేరిన తర్వాత విన్నర్ అతడే అన్న వార్తలకు బలం చేకూరినట్లైంది. అయితే, బిగ్ బాస్‌లో ఏదైనా జరిగే అవకాశం ఉండడంతో ఫలితం మారొచ్చేమోనన్న సందేహాలు కూడా మొదలయ్యాయి.

     విన్నర్‌ పేరు ముందే లీక్ చేసిన కౌశల్

    విన్నర్‌ పేరు ముందే లీక్ చేసిన కౌశల్

    ప్రస్తుతం బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ జరుగుతోంది. ఇది పూర్తయ్యే ముందు విన్నర్ పేరు రివీల్ అవుతుంది. ఇంతలో సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా ఫినాలే ఫలితాన్ని ముందే లీక్ చేసేలా పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘కంగ్రాట్స్ అభిజీత్' అని పోస్ట్ పెట్టుకున్నాడతను. దీంతో అతడే విజేత అని అంతా డిసైడ్ అయిపోయారు.

    English summary
    ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి వచ్చిన అనూహ్య మద్దతుతో సూపర్ డూపర్ హిట్ అయింది బిగ్ బాస్ షో. ఈ కారణంగానే తెలుగులో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నాలుగో సీజన్ కూడా మొదలై.. ఫినాలే స్టేజ్‌కు వచ్చేసింది. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతోన్న గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో షో పూర్తవకముందే బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ పేరును లీక్ చేశాడు కౌశల్ మండా. ఇంతకీ మాజీ విన్నర్ ఎవరి పేరును లీక్ చేశాడు? ఆ వివరాలు మీకోసం!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X