ఆ ఇద్దరే ఫైనలిస్టులు.. బిగ్‌బాస్ విజేత ఎవరంటే.. జోస్యం చెప్పిన కౌశల్ మండా

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ సీజన్ 4‌ ఫైనల్‌కు కొద్ది వారాలే ఉండటంతో ఎవరు టాప్ 5 లిస్టులో ఉంటారు? ఎవరు టాప్ 2లో ఉంటారు అనే విషయాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. రకరకాల వాదనలతో తమ అభిప్రాయాలను, అంచనాలను, విశ్లేషణలు చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ సీజన్‌ 2 విజేత తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఊహించిన విధంగా వారు ఎలిమినేట్

ఊహించిన విధంగా వారు ఎలిమినేట్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను ఫాలో అవుతున్న నోయల్ సీన్, అమ్మా రాజశేఖర్, మెహబూబ్ దేత్తడి లాంటి వాళ్లు టాప్ 5లో ఉంటారనుకుంటే అనూహ్య పరిస్థితుల్లో వారు బయటకు వెళ్లిపోవడం, అలాగే ఊహించని విధంగా కొందరు సెలబ్రిటీలు అనూహ్యంగా రాణించడంతో ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి అని కౌశల్ మండా అభిప్రాయపడ్డారు.

అభిజిత్ కుండ బద్దలు కొట్టినట్టు

అభిజిత్ కుండ బద్దలు కొట్టినట్టు

నా అభిప్రాయం ప్రకారం.. అభిజిత్ మైండ్ గేమర్. అతను అంతగా ఫిజికల్‌గా యాక్టివ్ కాకపోయినప్పటికి.. ఇంటి సభ్యులకు మాత్రం ఏదైనా విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు, క్షణ్ణంగా చెబుతుంటారు. తాను అనుకొన్నది అనుకొన్నట్టు చెబుతుంటాడు. అది తన ప్లస్ పాయింట్. తాను స్మూత్‌గా గేమ్‌ ఆడుతున్నాడు. ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకొంటూ జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నాడు అని కౌశల్ చెప్పారు.

సోహెల్‌కు బలం అదే

సోహెల్‌కు బలం అదే

ఇక ఇంటి సభ్యుల్లో అభిజిత్ తర్వాత సయ్యద్ సోహైల్ ర్యాన్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అన్ని సీజన్లతో పోల్చితే బిగ్ బాస్ తెలుగు 4లో చాలా మంది యాక్టర్లు ఉన్నారు. ఈ సీజన్‌లో సోహెల్ గుడ్ ప్లేయర్. తనలోని ఆవేశం తనకు బలం, బలహీనతగా మారింది. ఆయనది డిఫరెంట్ మైండ్ సెట్. ఆవేశంతో కామెడీ కూడా ఆకట్టుకొంటున్నది అని తెలిపారు.

టాప్ 2లో అభిజిత్, సోహెల్

టాప్ 2లో అభిజిత్, సోహెల్

ఇలాంటి అంశాలను బేరీజు వేసిన తర్వాత నా అభిప్రాయం ప్రకారం అభిజిత్, సోహెల్ ఇద్దరు టాప్ 2లో ఉంటారు. రానున్న ఐదు వారాల్లో ఏదైనా అనుకొని.. ఊహించని సంఘటనలు జరిగితే తప్ప వీరి ర్యాంకుల్లో ఎలాంటి తేడాలు ఉండవు. అనుకొన్నది అనుకొన్నట్టుగా సాగితే అభిజిత్, సోహెల్ ఇద్దరు పొజిషిన్లకు ఢోకా ఉండదు అని కౌశల్ చెప్పాడు.

 అఖిల్‌కు ఉన్న మైనస్‌ ఆమె

అఖిల్‌కు ఉన్న మైనస్‌ ఆమె

ఇక అఖిల్ కూడా మంచి ప్లేయరే కాకపోతే.. అతను ఒకే ఫ్లోలోనే వెళ్తున్నాడు. మోనాల్‌తో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. రోజులు తగ్గడంతో ఇంటి సభ్యులపై ఒత్తిడి పెరుగుతుంది. వాళ్లు ఏదైనా తప్పు జరిగితే తప్ప అఖిల్ ర్యాంక్ మారే అవకాశం ఉంటుంది. సీక్రెట్ రూం నుంచి వచ్చిన తర్వాత రియాక్షన్ బట్టి అఖిల్ తన రేంజ్‌ను పెంచుకొంటాడా అనేది ఆసక్తిని రేపుతున్నదని కౌశల్ మండా వెల్లడించారు.

Recommended Video

Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
అవినాష్, అరియానాల గురించి

అవినాష్, అరియానాల గురించి

ఇక అవినాష్, అరియానా, హారిక కూడా మంచి గేమ్‌ను ప్రదర్శిస్తున్నారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. అరియానా మంచి పోటీ ఇస్తున్నారు. టాస్కుల్లో 100 శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే వీరంతా టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. హారిక కేవలం ముగ్గురితోనే కనిపిస్తున్నారు. అందరితో కలిసి తన అభిప్రాయాలను ధైర్యంగా పంచుకొంటే తప్ప ఆమెకు మంచి జరుగుతుంది అని కౌశల్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X