టాప్ 5లో ఎవరుంటారంటే.. జోస్యం చెప్పిన బిగ్‌బాస్ మాజీ విజేత కౌశల్
బిగ్‌బాస్ తెలుగు 4 షోలో యువ కంటెస్టెంట్లు విజృంభిస్తున్నారు. వివాదాలు, విభేదాలను కలిపి ఆటను రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అఫైర్లు, సున్నితమైన రొమాన్స్‌తో అలరిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు 2 విజేత బిగ్‌బాస్ షోను రివ్యూ చేశాడు. ఆ క్రమంలో తుది జాబితాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
ఇక ప్రస్తుతం కంటెస్టెంట్లు ఆడుతున్న గేమ్ ప్రకారం తుది 5 గురిలో ఎవరు ఉంటారనే విషయం చెప్పడం కష్టం. కాకపోతే నా లెక్క ప్రకారం అభిజిత్, నోయల్, లాస్య, అవినాష్, అఖిల్ లేదా సోహైల్ ఉంటారు. రానున్న రోజుల్లో గేమ్ ఆడే తీరు మారితే ఒకరిద్దరు ఈ లిస్టులో నుంచి మారిపోయి మరో ఇద్దరు పైకి రావొచ్చు అని కౌశల్ చెప్పారు.

ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ తెలుగు విజేతలు ఇలా ఉన్నారు. తొలి తెలుగు బిగ్‌బాస్ విజేతగా శివబాలాజీ ట్రోఫి గెలుచుకోగా, రెండో సీజన్‌లో సంచలన రీతిలో కౌశల్ మండా కిరిటాన్ని దక్కించుకొన్నారు. మూడో తెలుగు బిగ్‌బాస్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు. ఇక నాలుగో సీజన్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











