దీప్తి సునైనాపై కౌశల్ షాకింగ్ కామెంట్స్: వయసు లేకున్నా అలా అంటూ ఘాటుగా!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా హిందీలో మొదలైంది బిగ్ బాస్. పదిహేనేళ్ల క్రితమే ఆ భాషలోకి వచ్చిన ఇది.. సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దేశంలోని మిగిలిన భాషల్లోకి సైతం ఈ షోను తీసుకుని వచ్చారు. ఇలా తెలుగులో ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి వచ్చిన అనూహ్య మద్దతుతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది.

దీంతో ఏకంగా ఐదు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఈ షో ద్వారా చాలా మంది హీరోలుగా మారిపోయారు. అలాంటి వారిలో బిగ్ బాస్ రెండో సీజన్‌లో విజేతగా నిలిచిన కౌశల్ మండా ఒకడు. తాజాగా అతడు ప్రముఖ నటి దీప్తి సునైనాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మారుమ్రోగిపోయిన కౌశల్ పేరు

మారుమ్రోగిపోయిన కౌశల్ పేరు

సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన బిగ్ బాస్ రెండో సీజన్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో అతడి పేరు మారుమ్రోగింది.

ఆఫర్లు దక్కడం లేదని ట్రోల్స్

ఆఫర్లు దక్కడం లేదని ట్రోల్స్

కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అయినప్పటికీ ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే బుల్లితెరపైనా కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో కౌశల్ ఫ్యాన్స్‌ కూడా సినిమా ఎందుకు తీయడం లేదంటూ అతడిని ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయనే చెప్పాలి.

 సినిమాలు.. షోలు.. వీడియోలు

సినిమాలు.. షోలు.. వీడియోలు

పలు కారణాల వల్ల బిగ్ బాస్ తర్వాత చాలా కాలం పాటు కామ్‌గానే ఉండిపోయిన కౌశల్ మండా.. ఈ మధ్యన మాత్రం వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో నటించడంతో పాటు 'ఇస్మార్ట్ జోడీ 2' సహా పలు షోలలో కనిపిస్తున్నాడు. అంతేకాదు, యూట్యూబ్‌లో వీడియోలు సైతం చేస్తూ తన ఫ్యాన్స్‌ను విశేషంగా అలరిస్తున్నాడు.

బిగ్ బాస్ సీక్రెట్స్ లీక్ చేశాడు

బిగ్ బాస్ సీక్రెట్స్ లీక్ చేశాడు

కొంత కాలంగా తనపై వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండానే కౌశల్ మండా ముందుకు సాగుతున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే బిగ్ బాస్ లీగ్ అంటూ ఓ కాంపిటీషన్‌ను కూడా నిర్వహించాడు. అలాగే, బుల్లితెరపై, వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో బిగ్ బాస్ సీక్రెట్లు అన్నీ లీక్ చేసేశాడతను.

అందుకే సినిమాలు చేయలేదు

అందుకే సినిమాలు చేయలేదు

తాజా ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ గెలిచిన తర్వాత ఎవరూ చేయని విధంగా కష్టపడిన వారందరిని కలిసిశా. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్లు నా కోసం నిలబడ్డారు. అందుకే అక్కడికి వెళ్లి మరీ కలిశా. కొన్ని కథలు తనకు నచ్చకపోవడం వల్ల వదులుకుంటే.. కొన్ని రెమ్యునరేషన్‌ ఎక్కువ డిమాండ్‌ చేయడం వల్ల ఆఫర్లు రాలేదు' అని చెప్పాడు.

నాకు రెమ్యూనరేషన్ తక్కువగా

నాకు రెమ్యూనరేషన్ తక్కువగా

బిగ్ బాస్ రెండో సీజన్‌లో అందరి కంటే తనకే తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని కౌశల్ మండా వెల్లడించాడు. 'రెండో సీజన్‌లో మిగిలిన వాళ్లతో పోలిస్తే నాకు తక్కువ రెమ్యునరేషనే ఇచ్చారు. నాకింత గుర్తింపు వస్తుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. అసలు టీవీ నుంచి తీసుకున్న కంటెస్టెంట్లలో నేనే మొదటి వ్యక్తిని. టీవీ వాళ్లకు నావల్లే ఛాన్స్‌లు వస్తున్నాయి' అని తెలిపాడు.

దీప్తి సునైనాపై షాకింగ్ కామెంట్

దీప్తి సునైనాపై షాకింగ్ కామెంట్

రెండో సీజన్‌లో కౌశల్‌ను వ్యతిరేకించిన వారిలో దీప్తి సునైనా ఒకరు. తాజాగా ఆమె గురించి అతడు మాట్లాడుతూ.. 'నా అనుభవం అంత వయసు కూడా లేని దీప్తి సునైనా నేను రెండు వారాల్లో వెళ్లిపోతానని చెప్పింది. అప్పుడే కౌశల్‌ అంటే ఏంటో నిరూపించాలనుకున్నా. అందుకే ఎంతగానో కష్టపడి టైటిల్‌ గెలిచాను. వాళ్లందరికీ ఇలా సమాధానం చెప్పా' అని వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X