దివి వద్యాను అందుకే బయటకు పంపిచారు.. సీక్రెట్ బయటపెట్టిన కౌశల్ మండా..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 షో 50 రోజు పూర్తి చేసుకొని ముందుకెళ్తున్నది. అయితే గతవారం దివి ఎలిమినేషన్ గురించి కౌశల్ మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అంతేకాకుండా కంటెస్టెంట్ల గురించి, గేమ్ ఫార్మాట్ గురించి కీలక విషయాలను జాతీయ పత్రికకు సంబంధించిన వెబ్‌సైట్‌కు కౌశల్ వెల్లడిస్తూ..

కరోనా భయంతో ఆసక్తి చూపలేదు
కరోనావైరస్ భయం కారణంగా బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుచేత కంటెస్టెంట్ల ఎంపిక కష్టంగా మారింది. అందుబాటులో ఉన్న యూట్యూబ్ స్టార్స్‌ను తీసుకోవాల్సి వచ్చింది. కాకపోతే యూట్యూబ్ స్టార్స్‌ను ఎంపిక చేయడం వల్ల షో ఫ్రెష్‌గా కనిపిస్తున్నది. హారిక, అరియానా, మెహబూబ్ లాంటి మంచి ప్రతిభను చాటుకొంటున్నారు అని కౌశల్ చెప్పారు.

పాత టాస్కులనే ఆడించడం
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో పాత టాస్కులనే ఆడిస్తున్నారు. గత సీజన్లలో చూసిన టాస్కేలే ఆడించడం వల్ల ప్రేక్షకులకు సీజన్ చూడాలనే ఆసక్తి తగ్గిపోతున్నది. పాత టాస్కుల స్థానంలో కొత్త టాస్కులను పెడితే షో మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండే అవకాశం ఉండేది. టాస్కుల ఆడించే విషయంపై నిర్వాహకులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది అని కౌశల్ అభిప్రాయపడ్డారు.

ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారు
బిగ్‌బాస్ షో ఎనిమిదో వారానికి చేరుకొన్న తర్వాత కూడా ఫార్మాట్‌ను, గేమ్‌ను కంటెస్టెంట్లు అర్ధం చేసుకోవడం లేదు. అందరూ సేఫ్ గేమ్ ఆడతున్నారు. మెహబూబ్ ఒక్కడే ఆశ్చర్యకరమైన రీతిలో దూసుకొచ్చాడు. ఇంటి సభ్యులందరూ సేఫ్ గేమ్ నుంచి బయటపడితే.. కంటెస్టెంట్లకు ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ లభించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కౌశల్ వ్యక్తం చేశారు.
Recommended Video

దివి వద్యా ఎలిమినేషన్‌పై కామెంట్
దివి వద్యా ఎలిమినేషన్‌పై కౌశల్ స్పందిస్తూ.. ఊహించనిదే. కానీ ఎలిమినేషన్‌పై నేను కామెంట్ చేయలేను. దివి విషయానికి వస్తే.. ఆరంభంలో అగ్రెసివ్‌గా ఆడారు. ఆ తర్వాత ఎందుకో టాస్క్‌ల విషయంలో, పెర్ఫార్మెన్స్ విషయంలో వెనుకపడ్డారు. అయితే ఆమెకు ఇవ్వాల్సినంత స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. దివికి సంబంధించిన కంటెంట్‌ను సరిగా చూపించలేదు. ప్రేక్షకుల దృష్టిలో ఆమె రిజిస్టర్ కాలేకపోయింది. అందుకే బయటకు వెళ్లాల్సి వచ్చింది అని కౌశల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











