twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్నారి హత్యకేసు.. బిగ్ బాస్ కౌశల్ షాకింగ్ డిసీజన్

    |

    Recommended Video

    Bigg Boss Fame Kaushal Manda On Srihitha Incident || Filmibeat Telugu

    మూడు రోజుల క్రితం హన్మకొండలో 9 నెలల చిన్నారిపై జరిగిన దారుణమైన ఘటన యావత్ భారత దేశాన్ని కలిచివేసింది. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున నిరసన జ్వాలలు రగులుతున్నాయి. చిన్నారి శ్రీహితపై హత్యాచారం చేసిన నిందితుడిని నరికి పారేయాలంటూ దేశంలోని ప్రజలంతా ఏకధాటిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేం కౌశల్ షాకింగ్ డిసీజన్ తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

    సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం

    సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం

    చిన్నారి శ్రీహితపై హత్యాచారానికి ఒడిగట్టిన ప్రవీణ్ అనే కామాంధుడిని అడ్డంగా నరికిపారేయాలని సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం డిమాండ్ చేస్తున్నారు. దీనిపై 'జస్టిస్ ఫర్ శ్రీహిత' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం లేవనెత్తారు. మానవ మృగంగా మారిన నిందితుడికి తగిన శిక్ష పడాలని బిగ్ బాస్ కౌశల్ రంగంలోకి దిగాడు.

     కౌశల్ ఆమరణ నిరాహార దీక్ష

    కౌశల్ ఆమరణ నిరాహార దీక్ష

    శ్రీహిత మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కౌశల్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. శ్రీహితపై అతి క్రూరమైన హత్యాచారం జరిగి రెండు మూడు రోజులైనా ఇటు పోలీసుల నుండి గానీ, అటు ప్రభుత్వం నుండి గానీ సరైన స్పందన లేకపోవడం దురదృష్టకరమని భావించిన కౌశల్.. ఈ ఉదంతంపై తాను ఆమరణ దీక్ష చేయబోతున్నానని ప్రకటించాడు.

    ఎవరైతే ఇలాంటి దారుణ సంఘటనలను ఖండిస్తారో..

    ఎవరైతే ఇలాంటి దారుణ సంఘటనలను ఖండిస్తారో..

    ఎవరైతే శ్రీహితకి, ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటారో, ఇలాంటి దారుణ సంఘటనలను ఖండిస్తూ.. ఇక ముందు ఇలాంటివి జరగ కూడదని కోరుకుంటారో వారంతా తనతో పాటు ఈ నిరాహారదీక్షలో పాల్గొనాలని సోషల్ మీడియాలో వీడియో ద్వారా పిలుపునిచ్చాడు కౌశల్. ఈ మేరకు హన్మకొండ లోని మెజిస్ట్రేట్ ఎదురుగా తన ఆమరణదీక్ష మొదలు కానుందని తెలిపాడు.

    పోలీసులు భగ్నం చేశారు.. ఈ ఒక్క రోజు ఓపిక పడతాం

    పోలీసులు భగ్నం చేశారు.. ఈ ఒక్క రోజు ఓపిక పడతాం

    అయితే ఈ తర్వాత కొద్దిసేపటికి మరో వీడియో పోస్ట్ చేసిన కౌశల్.. శ్రీహిత హత్యకు నిరసనగా తాను చేస్తున్న నిసననను పోలీసులు భగ్నం చేశారని, సోమవారం వరకు సమయం ఇమ్మని కోరారని అందులో పేర్కొన్నాడు. తాము హన్మకొండ వెళ్లి శ్రీహిత తల్లితండ్రులను కలిశామని, అయితే 11 రోజుల లోపే నిందితుడికి తగిన శిక్ష వేస్తామని ప్రభుత్వం చెప్పిందని, శ్రీహిత తండ్రి ఈ విషయం తనతో చెప్పాడని కౌశల్ పేర్కొన్నాడు.

    కౌశల్ డిసీజన్ పై పాసిటివ్ రెస్పాన్స్

    కౌశల్ డిసీజన్ పై పాసిటివ్ రెస్పాన్స్

    చిన్నారి హత్య విషయం తెలిసి రగిలిపోతున్న జనం.. కౌశల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తామంతా చిన్నారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు. మహిళా సంఘాలు, విద్యార్ధి సంఘాలు తమ తమ మద్దతు తెలుపుతున్నాయి.

    English summary
    BigBoss Feam Kaushal Manda Going Fight On SriHitha Sexual harassment. He posted a video in social media regarding this issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X