నా భార్యకు క్యాన్సర్... ఆమెను చిత్రహింసలు పెడుతున్నారు, చంపేస్తామని వార్నింగ్: కౌశల్

Recommended Video

Bigg Boss 2 Winner Koushal Press Meet | Filmibeat Telugu

బిగ్‌బాస్ విజేత కౌశల్ నిధుల దుర్వినియోగం ఆరోపణల వివాదంలో చిక్కకున్నారు. కౌశల్ ఆర్మీకి చెందిన కొందరు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్‌ పేరుతో నిధులు దుర్వినయోగం చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై కౌశల్, ఆయన భార్య వివరణ ఇచ్చారు. తనను, తన భార్యను అనేక రకాలుగా దెబ్బ తీయడానికి కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు తప్పని చెప్పడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఆయన ఏమన్నారంటే..

కొందరు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు

కొందరు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు

కౌశల్ ఆర్మీ నుంచి వెలివేసిన వాళ్లు మమల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో వన్ కే రన్ నిర్వహిస్తే చంపేస్తామని బెదిరించారు. సైనికులకు నివాళులర్పించడం కూడా వాళ్లకు నచ్చడం లేదు. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

చంపేస్తామని, నరికేస్తామని వార్నింగ్

చంపేస్తామని, నరికేస్తామని వార్నింగ్

కర్నూలులో పర్యటించిన సమయంలో నా భార్యను వేధించారు. చంపేస్తామని, నరికేస్తామని బెదిరిస్తే బయటకు వచ్చారు. దాంతో మనకెందుకు అని వెళ్లి పోతుంటే రాత్రి మూడునర్న గంటలకు కారుకు అడ్డంగా పడుకొని చిత్రహింసలు పెట్టారు. మా ప్రైవసీని భంగం చేశారు. మాకు తెలియకుండా బట్టల చాటున సీసీ కెమెరాలు పెట్టి నా వ్యక్తిగత జీవితానికి భంగం చేశారు.

నాకు ఎలాంటి సంబంధం లేదు

నాకు ఎలాంటి సంబంధం లేదు

కౌశల్ ఆర్మీలో కొందరి మధ్య విభేదాలను నాకు అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు జరిగిన విషయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆధారాలు లేకుండా ఓ టీవీలో వచ్చిన చర్చలో పాల్గొనలేదు. ఇప్పుడు నా వద్ద ఆధారాలు ఉన్నందున మీడియా సమావేశం పెట్టి నేను నాపై వస్తున్న ఆరోపణలకు సమధానం చెబుతున్నాను.

నా భార్య క్యానర్ వ్యాధితో

నా భార్య క్యానర్ వ్యాధితో

నా భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడతున్నది. ఆమె భయంకరమైన వ్యాధితో బాధపడుతూ కూడా కౌశల్ ఆర్మీతో సంబంధం లేని వ్యక్తులు పెట్టే చిత్రహింసలను భరిస్తున్నది. కడుపులో పెరుగుతున్న 7 సెంటీమీటర్ల క్యాన్సర్ గడ్డ నొప్పిని భరిస్తూ కూడా నాపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తున్నది.

నాభార్య కోరిక ఏమిటంటే

నాభార్య కోరిక ఏమిటంటే

నేను సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలన్నది నా భార్య కోరిక. నన్ను హీరోగా చూడాలనే ఉద్దేశంతో క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ను కూడా వాయిదా వేసుకొన్నది. అలాంటి వ్యక్తిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నా భార్య వాటన్నిటిని భరిస్తున్నది.

బిగ్‌బాస్ ప్రైజ్ మనీతో క్యాన్సర్ పేషంట్లకు

బిగ్‌బాస్ ప్రైజ్ మనీతో క్యాన్సర్ పేషంట్లకు

బిగ్‌బాస్‌ విజేతగా నిలిచిన తర్వాత వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం చేస్తున్నాను. వైజాగ్‌లో ఓ పేషెంట్‌కు సహాయం అందిస్తున్నది. క్యాన్సర్ వ్యాధితో బాధపడిన నా తల్లిని డబ్బులేక కాపాడుకోలేకపోయాను. అలాంటి వ్యాధితో బాధేపడే వ్యక్తులకు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ సహాయం చేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X