Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నేను, అమిత్ ఇద్దరమే.. కౌశల్ సతీమణి ఎదుర్కొన్న ఇబ్బందులు, డబ్బులిస్తే ఓట్లేస్తారు కానీ!
బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిపోయారు. కౌశల్ గురించే ప్రస్తుతం హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ మొత్తం కౌశల్ కేంద్రంగానే జరిగిందని చెప్పొచ్చు. హౌస్ లో దాదాపుగా ప్రతి రోజు కౌశల్ గురించి చర్చ జరిగేది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో గీత మాధురిపై విజయం సాధించిన కౌశల్ బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ప్రస్తుతం కౌశల్ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు.
బాబు గోగినేని సర్వజ్ఞాని
ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కౌశల్ బాబు గోగినేనిపై సెటైర్లు వేశాడు. కౌశల్ ఆర్మీకి డబ్బులిచ్చి ఓట్లేయించుకున్నారనే ఆరోపణలపై కౌశల్ స్పందించాడు. ఆయన సర్వజ్ఞాని.. ఆయన గురించి మాట్లాడేదేముంది. డబ్బు లిస్తే వచ్చే పాపులారిటీ నాకు వద్దు. అలా వచ్చిన పాపులారిటీ ఎప్పటికి నిలవదు కూడా అని కౌశల్ అభిప్రాయపడ్డారు.
నా ప్రపంచం ఇదే
నా ఇల్లు, వ్యాపారం ఇవే నా ప్రపంచం. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తరువాత గేమ్ పై ఫోకస్ చేశా. కౌశల్ ఆర్మీ అనేది నాపై ప్రేమతో ఏర్పడినది. డబ్బులిస్తే ఓట్లేస్తారేమో కానీ ప్రేమించరు అని కౌశల్ అభిప్రాయ పడ్డారు.
అది కోపం కాదు
నేను కోపంగా ఉన్నట్లు కనిపిస్తా. కానీ అది కోపం కాదని కౌశల్ తెలిపాడు. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ పై ఎక్కువగా ఫోకస్ చేశా అందుకే అలా అనిపించి ఉండవచ్చు అని కౌశల్ తెలిపాడు. బయట నా వర్క్ విషయంలో కూడా అలాగే ఉంటానని కౌశల్ తెలిపాడు.
నా గురించి కూడా
సినిమాల్లో నటించే విషయమై మాట్లాడుతూ.. టాలీవడ్ తన గురించి కూడా ఆలోచించాలని కౌశల్ అప్పీల్ చేశాడు. గతంలో కౌశల్ మోడల్‌గా రాణిస్తూనే కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్‌తో కౌశల్‌కు మరింతగా క్రేజ్ పెరిగింది.
చాలా భాదపడ్డా
కౌశల్ సతీమణి నీలిమ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కౌశల్ బిగ్ బాస్ లోకి వెళ్లిన తరువాత బయట తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిపారు. హౌస్ లో ఆయనకు మొదటి రెండు వారాలు అంతా వ్యతిరేకంగా జరిగింది. చాలా భాదపడ్డా అని తెలిపారు. కొన్ని ట్రోలింగ్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని నీలిమ తెలిపారు.
రక్తం కూడా వచ్చింది
బిగ్ బాస్ లో తాను ఎక్కువ కష్టంగా భావించిన టాస్క్ చేరుకురసం టాస్క్. మా టీం లో నేను, అమిత్ తప్ప మిగిలిన వారంతా అమ్మాయిలే. చెరుకు గుచ్చుకుని రక్తం కూడా వచ్చింది. నేను , అమిత్ కలసి 250 బాటిల్స్ చెరకు రసం పిండాం అని కౌశల్ తెలిపాడు.
నా కష్టం వృధా అయింది
సర్వైవర్స్ టాస్క్ లో పూజ వలన నా కష్టం వృధా అయిందని కౌశల్ తెలిపాడు. ఇక తాను బాగా క్రియేటివిటీ ఉపయోగించిన టాస్క్ కారు టాస్క్ అని తెలిపాడు. కారు టాస్క్ లో నేను సంచాలకుడిని మాత్రమే. ఆ టాస్క్ లో ఎవరినీ గెలవనీయకుండా చేయడంలో నా ప్లాన్ వర్కౌట్ అయిందని కౌశల్ తెలిపాడు.