తనీష్‌ను కొట్టాలంటున్న అభిమానులు.... కౌశల్ ఎలా రియాక్ట్ అయ్యారంటే?
బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన కౌశల్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు. కౌశల్ ఎక్కడికి వెళ్లినా ఆర్మీగా ఏర్పడిన ఫ్యాన్స్ భారీ స్వాగతాలు పలుకుతున్నారు. కొందరైతే స్వయంగా కౌశల్ ఇంటికి వచ్చి విష్ చేస్తున్నారు. అభిమానులు ఉన్నారని తెలుసు కానీ, ఈ స్థాయిలో ఉంటారని ఊహించలేదని కౌశల్ ఆశ్చర్య పోతున్నారు. అదే సమయంలో బిగ్‌బాస్ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల విషయంలో ప్రతీకారం తీర్చుకోవాలని కొందరు ఫ్యాన్స్ సూచిస్తుండటంపై ఈ విన్నర్ తనదైన రీతిలో స్పందించారు.

ఆర్మీ ఇంత ఉంటుందనుకోలేదు
నేను బిగ్‌బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు నాకోసం ఆర్మీ ఉందని అస్సలు తెలియదు. 7వ వారంలో పూజా ఇంట్లోకి వచ్చినపుడు మీకేదో ఆర్మీ ఉందని చెప్పారు. ఆర్మీ అంటే ఒక వెయ్యి నుంచి ఐదువేల మంది ఉంటారనుకున్నాను కానీ ఈ ప్రపంచమంత ఉంటుందనుకోలేదు. ఆర్మీలో ఉన్న ప్రతి మెంబర్‌కు పేరు పేరున నా ధన్యవాదాలు... అని అభిమానులతో నిర్వహించిన లైవ్ చాట్‌లో కౌశల్ వ్యాఖ్యానించారు.

మీ యుద్ధం వల్లే కసి పెరిగింది
ఈ రోజు బయట మీరు అంత యుద్ధం చేయక పోతే లోపల నాకు యుద్ధం చేసే కసి వచ్చేది కాదు. మిమ్మల్నే నేను ఇన్స్ స్పిరేషన్ గా తీసుకుని లోపల ఫైట్ చేశాను. నేను చేసిన ప్రతి ఫైట్‌కు మీకు మంగళహారతి పలికారు బయటకు రావడానికి, థాంక్యూ సోమచ్....అంటూ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు.

నా సొంతూరొస్తాను.. కుమ్మేద్దాం
త్వరలో వైజాగ్ వస్తాను, అది నా సొంతూరు తప్పకుండా వస్తాను... అక్కడ కూడా కుమ్మేద్దాం. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు ప్లాన్ చేసుకుని వస్తాను. ఈ విక్టరీని మనమందరం కలిసి మరింత పెద్దగా సెలబ్రేట్ చేసుకుందామని కౌశల్ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

హీరోగా డెబ్యూ ఎప్పుడంటే...
హీరోగా డెబ్యూ ఎప్పుడు బ్రో అని ఓ అభిమాని అడగ్గా.... మనం ఇంట్లో ఉండి గేమ్ అనేది ఆడాం. ఆ గేమ్ కేవలం 20శాతం మాత్రమే. ఆ గేమ్ ద్వారా వచ్చిన గెలుపుతో బయకు వచ్చి ఆడే గేమే అసలైన గేమ్. అది లైఫ్ అంతా సెటిలయ్యే గేమ్. ఆ గేమ్ కన్నా ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్. లోపల ఉన్నపుడు నా గేమ్ మీద ఎంత ఫోకస్ పెట్టానో... బయటకు వచ్చిన తర్వాత ఆడే రియల్ లైఫ్ గేమ్ మీద కూడా అంతే ఫోకస్ పెడతాను... అని కౌశల్ వ్యాఖ్యానించారు.

తనీష్‌ను కొట్టాలి బ్రో...
బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నపుడు తనీష్, కౌశల్ మధ్య చాలా గొడవలు జరిగాయి. బయటకు వెళ్లాక నువ్వో నేనో చూసుకుందాం అంటూ ఒకరినొకరు సవాల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని తనీష్‌ను కొట్టాలని బ్రో అని అడగ్గా... ఎందుకు వద్దులే వదిలేయండి, అది కేవలం గేమ్ మాత్రమే. గేమ్ అయిపోయింది కాబట్టి టేక్ ఇట్ ఈజీ అంటూ సమాధానం ఇచ్చాడు కౌశల్.


Click it and Unblock the Notifications











