Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కౌశల్ ఆర్మీ మరో సంచలనం: బల నిరూపణ కోసం 2కె రన్!
Recommended Video
'బిగ్‌బాస్ 2 తెలుగు' కంటెస్టెంట్ కౌశల్‌కు మద్దతుగా కౌశల్ ఆర్మీ పేరుతో అభిమాన సంఘం సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా విస్తరించిన ఈ ఆర్మీ ఓటింగ్ వల్లనే కౌశల్ బలమైన కంటెస్టెంటుగా హౌస్‌లో కొనసాగుతున్నాడనేది కాదనలేని వాస్తవం. అయితే కొందరు కౌశల్ ఆర్మీపై విమర్శలు సైతం చేస్తున్నారు. ఇది అభిమానంతో ఏర్పడింది కాదని, బిగ్ బాస్‌లోకి వచ్చే ముందే తన మనుషులతో కౌశల్ ఈ ఆర్మీని క్రియేట్ చేశాడనే ఆరోపణలున్నాయి. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా కౌశల్ ఆర్మీ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. తాజాగా మరో భారీ కార్యక్రమానికి తెరలేపింది.
బల నిరూపణ కోసం
కౌశల్ ఆర్మీ హైదరాబాద్ ఫ్యాన్స్ తమ అభిమాన కంటెస్టెంటుకు మద్దతుగా, తమ బలం ఏమిటో చూపించడానికి 2కె రన్ ప్లాన్ చేశారు. ఇందులో భారీగా కౌశల్ అభిమానులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
|
ఎక్కడ జరుగబోతోంది?
ముందుగా ఈ 2కె రన్ సెప్టెంబర్ 9న టీవీ 9 ఆఫీసు నుండి అన్నపూర్ణ స్టూడియో వరకు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రాంతంలో లీగల్ పర్మిషన్, పోలీస్ అనుమతి లభించక పోవడంతో మాదాపూర్ ప్రాంతంలో ప్లాన్ చేసినట్లు కౌశల్ ఆర్మీ సభ్యులు తెలిపారు. పోలీసుల అనుమతి వచ్చిన తర్వాత మాదాపూర్‌లో ఎక్కవడ నుండి ఎక్కడి వరకు ఈ 2కె రన్ జరుగుతుంది అనే విషయాలు వెల్లడిస్తామన్నారు.
యాక్టివిటీ మరింత ముమ్మరం
బిగ్ బాస్2 గ్రాండ్ ఫినాలె దగ్గర పడుతున్న నేపథ్యంలో కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీని మరింత ముమ్మరం చేసింది. కౌశల్‌కు మద్దతుగా ట్వీట్లు, పోస్టులతో సంచలనం క్రియేట్ చేస్తోంది. కౌశల్‌కు వ్యతిరేకంగా ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు.
నాని, మాటీవీని శాసించే స్థాయికి
కౌశల్ ఆర్మీ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లిందంటే.... ఇటీవల కౌశల్ ఫ్రెండ్ నూతన్ నాయుడు బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ కావడంతో షో హోస్ట్ నాని, స్టార్ మాటీవీ వారిని సైతం విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తమ బలంతో బిగ్ బాస్ షోను శాసించే స్థాయికి వెళ్లారు.
కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అంటున్న ఫ్యాన్స్
ఈ సారి బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మాత్రమే అని.... ఆయనకు ఉన్నంత మద్దతు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంట్లో ఎవరికీ లేదని, ఫైనల్ సమయానికి భారీగా ఓటింగ్ నిర్వహించి అతడిని విజేతగా నిలుపుతామని కౌశల్ ఆర్మీ తేల్చి చెబుతోంది.