బిగ్ బాస్2: కౌశల్ సంచలనం .. గణేష్ లాంటి సోమరిపోతుకు ఇక్కడ స్థానం లేదు!
Recommended Video

బిగ్ బాస్ 2 సీజన్ రోజు రోజుకు ఉత్కంఠగా మారుతోంది. హౌస్ లో సభ్యుల మధ్య మాటల తీవ్రత పెరుగుతోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. టైటిల్ వేటలో ఎవరికి వారు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో గమనిస్తే రాబోవు రోజుల్లో బిగ్ బాస్ 2 ఎంత తీవ్రంగా మారబోతుందో అర్థం అవుతుంది.

నామినేషన్ రౌండ్
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన పూజ కూడా నిన్న ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్ లో పోటీ ప్రధాన సభ్యుల మధ్యే అని తేలిపోయింది. నేడు ఈ వారానికి సంబందించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.

మాటల మంటలు
ఇంటిలోని ప్రతి సభ్యుడు కొందరిని సేవ్ చేసి ఒకరిని నామినేషన్ కు ప్రతిపాదించే విధంగా ఈ టాస్క్ రూపొందించారు. ఈ నేపథ్యంలో ఇంటి సభ్యుల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నట్లు ప్రోమో ద్వారా అర్థం అవుతోంది.

గణేష్ సోమరిపోతు
ఈ టాస్క్ లో భాగంగా గణేష్ ని ఉద్దేశించి కౌశల్ సంచలన వ్యాఖ్య చేశాడు. గణేష్ సోమరిపోతు అంటూ అభివర్ణించారు. ఏ విషయంలో కౌశల్, గణేష్ మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గణేష్ లాంటి సోమరిపోతులకు బిగ్ బాస్ హౌస్ లో స్థానం లేదు అని కౌశల్ అంటాడు. అది చెప్పడానికి మీరు బిగ్ బాసా అంటూ గణేష్ కౌంటర్ ఇస్తున్నాడు.

ఉత్కంఠ
ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికైతే కౌశల్, గీత మాధురి, తనీష్ మధ్య టైటిల్ కోసం తీవ్రమైన పోటీ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











