twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ గారు భుజం మీద చేయి వేసి.. అందరికీ స్పాట్ పెట్టా.. బిగ్ బాస్ విజేత కౌశల్!

    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Koushal Talks About The Show

    113 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. అందరూ ఊహించని విధంగానే కౌశల్ విజేతగా నిలిచాడు. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్ ని కౌశల్ అందుకున్నాడు. ఈ సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా అదరగొట్టాడు. గీత మాధురి రన్నరప్ గా నిలిచింది. కౌశల్ ఆర్మీ నుంచి కౌశల్ కు పెద్ద ఎత్తున స్పందన లభించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తరువాత కౌశల్ ఆర్మీ నిర్వహించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ లో కౌశల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో కౌశల్ పలు ఆసక్తికర విశేషాలు బిగ్ బాస్ గురించి తెలియజేశాడు.

    <strong>మహేష్‌, పవన్ కల్యాణ్ లేకపోతే.. మూట, ముళ్లే సర్దుకొనేవాడిని.. కౌశల్ కంటతడి </strong>మహేష్‌, పవన్ కల్యాణ్ లేకపోతే.. మూట, ముళ్లే సర్దుకొనేవాడిని.. కౌశల్ కంటతడి

     అంత ఈజీగా జరగలేదు

    అంత ఈజీగా జరగలేదు

    బిగ్ బాస్ హౌస్ లోకి నా ఎంట్రీ అంతా ఈజీగా జరగలేదని కౌశల్ తెలిపాడు. కాస్తో కూస్తో తెలిసిన సెలబ్రిటీనే అయినప్పటికీ చాలా పెద్ద తతంగం జరిగిందని వివరించాడు. నన్ను ఎంపిక చేయడానికి 6 ఇంటర్వ్యూలు చేశారు. నా మల్టీ టాస్కింగ్ టాలెంట్ చూసి చివరకు ఎంపిక చేశారని కౌశల్ అభిప్రాయపడ్డారు.

     వారం పట్టింది

    వారం పట్టింది

    హౌస్ మేట్స్ ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ మైండ్ సెట్ తెలుసులోవడానికి నాకు వారం పట్టింది. రెండవ వారం నుంచి అసలైన గేమ్ మొదలు పెట్టానని కౌశల్ తెలిపాడు. బిగ్ బాస్ లో జరిగిన సంగతులన్నీ గుర్తు చేసుకున్నాడు.

    తేజస్వితో గొడవ గురించి

    తేజస్వితో గొడవ గురించి

    తొలివారంలో డైనింగ్ టేబుల్ వద్ద తేజస్వీతో జరిగిన గొడవ గురించి కౌశల్ ప్రస్తావించాడు. హౌస్ లో అంతమంది ఉండగా సోఫాలో కూర్చుని తినడం ఏంటని ప్రశ్నించాను. ఆ గొడవలో తేజస్వి చాలా మాటలు అన్నారు. ఆ గొడవతో తప్పు చేస్తే ప్రశ్నించాలి అనే నా జర్నీ ప్రారంభమైంది అని కౌశల్ తెలిపాడు.

    బాబుగారు ఆ మాట అన్నారు

    బాబుగారు ఆ మాట అన్నారు

    బాబు గోగినేని గురించి కూడా కౌశల్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తాను అక్కడ ఎవరిని ప్లాన్ చేసి నామినేషన్స్ లో పెడితే మీరు ఇక్కడ వాళ్ళని సాగనంపారని కౌశల్ తెలిపాడు. నేను లేనప్పుడు బాబు గోగినేని గారు ఒక మాట అన్నారు. మిగిలిన హౌస్ మేట్స్ తో ఆయన మాట్లాడుతూ మనం కౌశల్ ని బయటకు పంపడానికి పనిచేయాలి అని అన్నారు.

    గార్డెన్‌లో నడుస్తూనే

    గార్డెన్‌లో నడుస్తూనే


    ఆయన ఎంత వర్క్ చేసారో తెలిపాడు కానీ.. బాబుగారిని బయటకు పంపడానికి తాను చాలా తక్కువ వర్క్ చేశానని కౌశల్ అభిప్రాయపడ్డాడు. తాను అందరికి హౌస్ లో ఒంటరిగా ఉన్నట్లు కనిపించా. కానీ గార్డెన్ లో, వరండాలో నడుస్తూనే అందరికి స్పాట్ పెట్టానని కౌశల్ అభిమానుల ముందు ప్రస్తావించాడు.

    మోడలింగ్ అకాడమీ

    మోడలింగ్ అకాడమీ

    హైదరాబాద్ లో తాను తొలిసారి మోడలింగ్ అకాడమీ ప్రారంభించానని, తన మోడలింగ్ అకాడమిని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రారంభించాడని కౌశల్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆ సమయంలోనే పరిచయం ఏర్పడిందని కౌశల్ తెలిపాడు. తమ్ముడు చిత్రానికి కౌశల్ మోడలింగ్ కో ఆర్డినేటర్ గా పనిచేశాడు.

    పవన్ కళ్యాణ్ గారు

    పవన్ కళ్యాణ్ గారు

    పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేయి వేసి ఓ విషయం చెప్పారు. రాత్రంతా మోడల్స్ ని కోఆర్డినేట్ చేస్తూ మళ్ళీ ఉదయం షూటింగ్ కు హాజరు కావడం ఆయన గమనించారు. పవన్ కళ్యాణ్ గారు నా తో చెబుతూ.. నీ హార్డ్ వర్క్ చూస్తుంటే ముచ్చటేస్తోంది కౌశల్. మనం ఎంతలా కష్టపడుతున్నామో ఆ కష్టాన్ని పది కాలాలపాటు నిలబెట్టుకోవడం కూడా అంటే కష్టం అని అన్నారు.

    భవిష్యత్తులో

    భవిష్యత్తులో

    బిగ్ బాస్ హౌస్ లో తాను పడ్డ ఈ కష్టం విలువ భవిష్యత్తులో కొన్ని రోజుల తరువాత తెలుస్తుందని అని కౌశల్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచి కౌశల్ పెద్ద సెలేబ్రిటిగా మారిపోయాడు.

    English summary
    Kaushal Sensational Comments on Housemates at Winning Celebrations. Kaushal talks about Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X