బిగ్‌బాస్‌లో ‘రాజమౌళి’ కలకలం.. బాబు గోగినేని దుమ్ము దులిపిన కౌశల్!.. అలానే చస్తాను!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 44 Highlights

బిగ్‌బాస్‌ కార్యక్రమం ముందుకు సాగుతున్న కొద్ది రసకందాయంలో పడుతున్నది. ఒకర్ని మరొకరు టార్గెట్ చేయడం దండిగానే కనిపిస్తున్నది. ప్రతీ సోమవారం మాదిరిగానే ఇంట్లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా ఒకర్నొకరు గట్టిగానే వాయించుకొన్నారు. రాజమౌళిపై కామెంట్లు చేసిన బాబు గోగినేనికి కౌశల్ భారీగా క్లాస్ పీకడం చర్చనీయాంశమైంది.

కౌశల్‌తో పెట్టుకొంటే ఎవరైనా

కౌశల్‌తో పెట్టుకొంటే ఎవరైనా

బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రదీప్ వచ్చినప్పుడు ఆయనతో నాకు గురించి చెబుతూ కౌశల్‌తో ఎవరు గొడవ పడితే వాళ్లు హౌస్‌ నుంచి వెళ్లిపోతారు అని తనీష్ చెప్పాడు. కానీ అది సిల్లీ, సరదాగా చెప్పిన మాట. ఆ తర్వాత తేజస్వి మదివాడ కూడా అదే మాట చెప్పింది.

నాతో గొడవ పడటం చాలా సిల్లీ

నాతో గొడవ పడటం చాలా సిల్లీ

నాతో గొడవ పడితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతారనేది చాలా సిల్లీగా అనిపిస్తున్నది. కౌశల్ ప్లేస్‌లో ఎవరు ఉన్నా అదే జరుగుతుంది. తప్పు చేసిన వారికి, అకారణంగా గొడవపడిన వారికి శిక్ష పడటం సహజమే.

గేమ్ ఆడటానికే వచ్చా

గేమ్ ఆడటానికే వచ్చా

బిగ్‌బాస్‌లో గేమ్ ఆడటానికి వచ్చారని నా మీద కామెంట్లు చేస్తున్నారు. యస్. నేను గేమ్ ఆడటానికే వచ్చాను. అంతేకాని రిలేషన్స్, బంధాలు పెట్టుకోవడానికి రాలేదు. గేమ్‌ ఆడటానికే ప్రయత్నిస్తా. చిన్నప్పటి నుంచి అలానే ఉన్నాను. అలానే చస్తాను అని ఆవేశంగా కౌశల్ అన్నాడు.

 నా ఫోకస్ అంతా గేమ్‌పైనే

నా ఫోకస్ అంతా గేమ్‌పైనే

బిగ్‌బాస్‌లోకి ఓ లక్ష్యంతో వచ్చాను. దాని కోసం గేమ్ ఆడుతాను. ఆ గేమ్‌పై 24 గంటలు దృష్టి ఉంటుంది. దానిపైనే ఫోకస్ ఉంటుంది. దానిని గేమ్‌ మాదిరిగానే చూడాలి. ఒక్కొక్కరు ఏవో ఉద్దేశాలు పెట్టుకొని వచ్చారు. నా గేమ్ మాత్రం గెలువడానికే అని కౌశల్ స్పష్టం చేశారు.

 బాబు గోగినేనిపై కౌశల్ ఫైర్

బాబు గోగినేనిపై కౌశల్ ఫైర్

ఈ రోజు బాబు గోగినేనిని నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే.. మీరు నాస్తికుడు కావొచ్చు దేవుడ్ని నమ్మకపోవచ్చు. మా సినిమా పరిశ్రమకు దేవుడు రాజమౌళి, మా మ్యూజిక్ దేవుడు కీరవాణి అని భావిస్తాం. బిగ్‌బాస్‌కు వచ్చిన తర్వాత వారిని కూడా విమర్శించడం మొదలుపెట్టారు. అది తప్పు అని కౌశల్ సీరియస్ అయ్యారు.

రాజమౌళిని విమర్శిస్తారా?

రాజమౌళిని విమర్శిస్తారా?

రాజమౌళి నాస్తికుడు అయి ఉండి మంత్రాలయానికి వెళ్లాడని బాబు గోగినేని అన్నారు. ఆయన వెళ్తారు. ఆయన ఇష్టం అది. అతనిని విమర్శించే హక్కులేదు. అలాంటి వాటిని సహించం అని కౌశల్ అన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో అలాంటి విమర్శలను ఒప్పుకోం. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు రాజమౌళిని అంటే యాక్టర్‌గా ఊరుకోం. మీరు అది చేసినందుకు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని కౌశల్ అన్నారు.

నందినికి షాకిచ్చిన కౌశల్

నందినికి షాకిచ్చిన కౌశల్

మనుషుల్ని చీట్ చేయవచ్చు. ఫ్రెండ్ షిప్‌ను మోసం చేయవద్దు. బిగ్‌బాస్ హౌస్ నుంచి నిన్ను కాపాడి తప్పు చేశాను అనిపిస్తున్నది. అదే శ్యామలను కాపాడితే బాగుండేదనిపిస్తుంది. రోజు నువ్వ పడే బాధను చూసి, తపనను చూసి నిన్ను కాపాడాను. అది ఈ రోజు తప్పనిపిస్తున్నది అని కౌశల్ పేర్కొన్నారు.

నీ బిహేవియర్ కరెక్ట్‌గా లేదు

నీ బిహేవియర్ కరెక్ట్‌గా లేదు

నాని నిన్ను ఫర్నిచర్ అని చెప్పాక నీ ప్రవర్తన మారిపోయింది. ఒకప్పుడు నేను ఇచ్చే సలహాలు, సూచనలకు పాజిటివ్‌గా ఉండేదానివి. గత కొద్దిరోజులుగా నేను ఏదైనా సలహా ఇస్తే నీవు అదోలా బిహేవ్ చేస్తున్నావు అని కౌశల్ ఉద్వేగంతో ఊగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X