twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌశల్ సతీమణి ఎమోషనల్‌గా.. ఇక ఆపండి.. ఇంట్లోకి వెళ్లి నేనేం చెప్పలేదు!

    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Kaushal Wife Posted Emotional Video About Kaushal Army

    బిగ్ బాస్ సీజన్ 2 సమరం మరికొద్ది రోజుల్లో ముగియయబోతోంది. దాదాపు 100 రోజులుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్స్ కి చేరుకునే సభ్యులు ఎవరో ఈ ఆదివారం తేలిపోనుంది. ఈ సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు. సీజన్ మొత్తం ఆడియన్స్ నుంచి అతడికి అద్భుతమైన సపోర్ట్ లభించింది. గీత, కౌశల్, దీప్తి కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సామ్రాట్ అందరికంటే ముందుగా ఫైనల్ కు చేరిపోయాడు. సోషల్ మీడియా ద్వారా కౌశల్ సతీమణి నీలిమ కౌశల్ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.

     ఎంతగా భాదపడుతున్నానో

    ఎంతగా భాదపడుతున్నానో

    గత కొన్ని రోజులుగా హౌస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను చాలా బాధపడుతున్నానని నీలిమ అన్నారు. అలాగే హౌస్ లో సంతోషకరమైన విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. మా సంతోషాన్ని, భాదని మీరంతా పంచుకుంటున్నారు అని ఆడియన్స్ ని, కౌశల్ ఆర్మీని ఉద్దేశించి నీలిమ అన్నారు.

     చాలా చిన్న మాట

    చాలా చిన్న మాట

    కౌశల్ ని మీ తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా భావించి ఇంతలా ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పడం, రుణపడి ఉంటాం అని చెప్పడం చాలా చిన్న మాట అవుతుందని నీలిమ ఎమోషనల్ గా మాట్లాడారు.

     కొంతమంది అడుగుతున్నారు

    కొంతమంది అడుగుతున్నారు

    నన్ను కొంతమంది అడుగుతున్నారు. ఇటీవల పిల్లలతో హౌస్ లోకి వెళ్లిన సమయంలో కౌశల్ కి బయట విషయాలు చెప్పారా అని అంటున్నారు. నేనేం చెప్పలేదు. అప్పుడే చెప్పి ఉంటే ఆయన సంతోషం నేను మాత్రమే చూడగలను. కానీ మీఅందరి సమక్షంలో చెబితే.. ఆయన సంతోషాన్ని అందరూ చూస్తారని నీలిమ అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయనకు చాలా తక్కువ విషయాలు చెప్పానని నీలిమ అన్నారు.

     ఎంతో ఓపికతో

    ఎంతో ఓపికతో

    ఆయన హౌస్ లో ఎంతో ఓపికతో గేమ్ ఆడుతున్నారు. కౌశల్ చాలా ఓపికతో ఉంటున్నాడు. కౌశల్ ని చూసి చాలా నేర్చుకోవాలి అని ఫోన్ చేసి చాలా మంది చెబుతున్నారని నీలిమ అన్నారు. ఇక ఓటింగ్ విషయానికి వస్తే.. ఇన్నిరోజులు మీరందించిన ప్రేమని మాటల్లో చెప్పలేను. ఇక మిగిలిన రోజులు కూడా చాలా కీలకం. ఇదేవిధంగా కౌశల్ కు మద్దతుగా ఓటింగ్ చేయాలని నీలిమ కోరారు.

    ట్రోలింగ్ ఆపండి

    ట్రోలింగ్ ఆపండి

    అదే సమయంలో ఇతర కంటెస్టెంట్స్ పై దయచేసి ట్రోలింగ్ చేయవద్దని నీలిమ అన్నారు. వారికి కూడా కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఎవరిపై ఉంటే వారికీ ఓట్ చేయండి. కానీ మరొకరిని తిట్టడం, ట్రోల్ చేయడం చేయవద్దని నీలిమ కోరింది.

    English summary
    Kaushal Wife Emotional About Kaushal Army
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X