కౌశల్ మరో సంచలనం: డాక్టరేట్ అందుకోబోతున్నాడు... ఏందుకంటే?
బిగ్ బాస్ తెలుగు 2 టైటిల్ విన్నర్ కౌశల్ సంచలనాల మీద సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధికంగా 39.5 కోట్ల ఓట్లు సంపాదించుకుని అందరినీ ఆశ్చర్య పరిచిన ఈ తెలుగు యాక్టర్ త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకబోతున్న సంగతి తెలిసిందే. కౌశల్ ప్రభంజనం ఇంతటితో ఆగుతుందనుకుంటే పొరపాటే. త్వరలో ఆయన ఓ విదేశీ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నాడు. ఈ విషయాన్ని కౌశల్ స్వయంగా తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు.

సస్పెన్స్‌లో పెట్టిన కౌశల్
తనకు డాక్టరేట్ రాబోతున్న విషయాన్ని కౌశల్ వెల్లడిస్తూ.... ‘అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్. మీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్‌కు తొందరలో డాక్టరేట్ రాబోతోంది. ఎందుకు రాబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ విషయం నేను కొన్ని రోజుల తర్వాత చెబుతాను' అన్నారు.
Recommended Video


ఎవరు ఇస్తున్నారు?
నాకు హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకు రాబోతోందనే విషయాన్ని త్వరలోనే మరో వీడియా ద్వారా తెలియజేస్తాను అన్నారు. హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఉంది.

కౌశల్ ఫాలోయింగ్ చూసి అంతా షాక్
బిగ్ బాస్ 2 షో నుండి విజేతగా బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్య పోతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగుకు వచ్చిన కౌశల్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం చూసి అంతా షాకయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో విజయ యాత్రలు, సేవా కార్యక్రమాలు
ఇక బిగ్ బాస్ 2 టైటిల్‌తో కౌశల్ తెలుగు రాష్ట్రాల్లో తన అభిమానుల కోరిక మేరకు విజయ యాత్రలు నిర్వహించబోతున్నారు. ఈ విజయ యాత్రలు నిర్వహిస్తూ క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించనున్నాడు. తనకు వచ్చిన రూ. 50 లక్షల బిగ్ బాస్ ఫ్రైజ్ మనీని కౌశల్ క్యాన్సర్ బాధితుల కోసం వినియోగిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

సినిమాలు, రాజకీయాలపై దృష్టి
బిగ్ బాస్ విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్న కౌశల్ అభిమానుల కోరిక మేరకు సినిమా హీరో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమానులు కోరుకుంటే రాజకీయాల వైపు కూడా వచ్చేందుకు తాను సిద్ధమే అని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











