Brahmamudi August 7th: రాజ్ ఆఫర్​ను కావ్య రిజెక్ట్.. కళావతి చేసిన పనికి రగిలిపోతున్న దుగ్గిరాల కుటుంబం

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు కూడా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో తన పని వదిలేసుకొని వచ్చినందుకు చిరాకు పడుతుంది అప్పు. దాంతో కల్యాణ్ అలా వెళ్ళిపోకు.. నాకు సహాయం చేయటానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారంటూ.. పేరు కనుక్కోమని సవాల్ విసిరిన ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవడానికి నువ్వే సహాయం చేయాలి అని తనను అడుగుతాడు. మరోవైపు కావ్య తండ్రి అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పూర్తి ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...

రాజ్ వచ్చి గుడ్ న్యూస్ చెప్పాలి అని కావ్య అనడంతో.. నాకు గుడ్ న్యూస్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారా అని కాస్త నిరాశ పడుతూ మాట్లాడుతుంది. దాంతో రాజ్ నిన్ను డిజైనర్ పోస్ట్ కి తీసుకోవటానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇదే అని అనగా ఆ జాబ్ చేయలేను అని అంటుంది. వెంటనే రాజ్ కోపంతో.. కంపెనీకి నీ అవసరం ఉందని తెలిసి అలా కావాలని చేస్తున్నావా అని అంటాడు.

Kavya Denies Raj Designer Post in August 7th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

ఇక దానితో కావ్య కావాలంటే డిజైన్ చేసి ఇస్తాను కానీ డబ్బులు తీసుకోలేను అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ ధాన్య లక్ష్మీ వింటుంది. ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి రాజ్ వచ్చి కావ్య గురించి చెబుతాడు. దాంతో ధాన్య లక్ష్మి కూడా జరిగిన విషయం చెబుతుంది. ఆ తర్వాత కావ్య వినాయకుడికి దండం పెట్టుకుంటూ వెంటనే మట్టి బొమ్మల ఆర్డర్ కోసం అందరికీ ఫోన్ చేస్తుంది. కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వరు. అప్పటికే కాంట్రాక్ట్ ఇచ్చేశాం అని చెబుతుంది.

Kavya Denies Raj Designer Post in August 7th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

మరోవైపు రాజ్ తన తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఊరికే ఏమి ఇవ్వలేదు.. తన కష్టానికి ప్రతిఫలం ఇచ్చాను అని అంటాడు. అంతేకాకుండా కావ్య ఉద్యోగం చేయడానికి తన తల్లిని ఒప్పిస్తాడు. ఇక ఈ విషయం కావ్య దగ్గరికి వెళ్లి చెప్పిన కూడా తను అస్సలు ఒప్పుకోదు. ఇక మీ వల్లే మా కుటుంబం బ్రతికిందన్న మాటలు భరించలేను అని కావ్య అనటంతో తనకు ఒళ్లంతా పొగరే అని కోపంతో తిట్టుకుంటాడు.

Kavya Denies Raj Designer Post in August 7th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

ఆ తర్వాత కావ్యకి విగ్రహాల ఆర్డర్ వస్తుంది. ఇక స్వప్న తన ప్రెగ్నెంట్ విషయంలో అనుమానం వస్తుంది అని రాహుల్తో కమిట్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే రాహుల్ తాగి రావటంతో.. తిట్టించినందుకు ఆనందంగా ఉంది అని అంటాడు. ఇక రాహుల్ తన ప్రెగ్నెన్సీ మాటలు వినలేదని ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత మత్తులో ఉన్న రాహుల్ ని లొంగ తీసుకోవాలని చూస్తుంది.

Kavya Denies Raj Designer Post in August 7th 2023 Episode number 166 in Brahmamudi Telugu Serial

ఇక తరువాయి భాగంలో పుట్టింటికి వెళ్ళిన కావ్య అవసరం కోసం బొమ్మలు చేయటానికి మట్టిని కలుపుతూ బొమ్మలు చేస్తూ ఉండగా దుగ్గిరాల కుటుంబం కావ్య బొమ్మలు తయారు చేస్తున్న దృశ్యం మీడియా కంట్ల పడటంతో అందులో చూసి దుగ్గిరాల కుటుంబం ఒకేసారి షాక్ అవుతారు. పైగా వార్తలలో డబ్బుల కోసం దుగ్గిరాల కోడలు రోజువారి కూలీగా చేస్తుందని.. ఆ ఇంట్లో వాళ్లకి అసలు మనసే లేదా అంటూ వార్తలు రావడంతో.. ఆ మాటలు విని రాజ్ షాక్ అయ్యి బాగా కోపంతో రగిలిపోతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X