Brahmamudi November 30th: ఫుడ్ కోసం ఇంట్లో పంచాయితీ.. రాజ్‌కు శృతికి లింక్ పెట్టిన కావ్య

స్వప్న నిజంగానే తల్లి కాబోతుందని కనకానికి కావ్య చెప్తుంది. ఆ విషయం తెలుసుకుని కనకం అస్సలు నమ్మనని చెప్తుంది. అది మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టినట్టుందని కనకం.. కావ్యతో అంటుంది. దీంతో కావ్య తర్వాత ఫోన్‌ చేస్తానని కట్‌ చేస్తుంది. రాజ్‌ నవ్వుతూ సరేలే కానీ ఎక్కడికి వెళ్లాలో చెప్పు అంటాడు. హాస్పిటల్‌కి అని కావ్య చెప్పగా.. రాజ్‌ దేనికి అని అంటాడు. ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ చేసుకోవడానికి అని కావ్య అంటుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు.

కొంపతీసి నీకు... అని అడగగానే అంతసీన్‌ లేదు. ఆ అరుణ్‌ పని చేస్తున్న హాస్పిటల్‌ కు వెళ్లి వాణ్ని పట్టుకొద్దామని చెప్తుంది కావ్య. మరోవైపు కనకం వాళ్ల అక్కకు స్వప్న నిజంగానే కడుపుతో ఉందని చెప్తుంది. కల్యాణ్ అప్పులను ఒక్కటి చేయడానికి.. నేను ఆ ఇంటికి వెళ్లడానికి దేవుడే నాకు ఒక అవకాశం ఇచ్చాడని సంతోషపడుతుంది. హాస్పిటల్‌కు వెళ్లిన రాహుల్‌, కావ్య నీకొసం వెతుక్కుంటూ వస్తుందని అరుణ్ కు చెప్తుంది. జాగ్రత్తగా ఉండమని అరుణ్‌ ను హెచ్చరిస్తాడు రాహుల్.

Kavya Doubt on Raj in November 30th 2023 Episode number 267 in Brahmamudi Telugu Serial

నిన్ననే జాబ్‌ కు రిజైన్‌ చేశానని.. నా అడ్రస్‌ కూడా ఎవ్వరికి తెలియనివ్వకుండా ఉంటానని అరుణ్‌ రాహుల్ కు చెప్తాడు. కావ్య, రాజ్‌ హాస్పిటల్‌కు వచ్చి అరుణ్‌ గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. ఇంతలో ఓ నర్స్ ఆయన నిన్ననే రిజైన్‌ చేశారని అడ్రస్‌ కూడా తెలియదని చెప్తుంది. దీంతో కావ్య కోపంగా అంతా మీ వల్లే జరిగింది. నేను అనుకున్న ప్లాన్‌ మొత్తం ఫెయిల్‌ అయిందని రాజ్ పై విరుచుకుపడుతుంది.

వాడు జాబ్‌ మానేసి వెళ్లిపోతే మధ్యలో నేను ఏం చేశానని రాజ్ అంటాడు. మీరు నేను చెప్పినప్పుడే ఆలస్యం చేయకుండా వచ్చి ఉంటే ఇప్పుడు మనకు వాడు తప్పకుండా దొరికి ఉండేవాడని కావ్య అంటుంది. వాడి మీద కోపం నామీద చూపిస్తున్నావా? అంటూ రాజ్‌ అనడంతో.. కావ్య సినిమా డైలాగులు చెప్తుంది. దీంతో రాజ్‌ షాకింగ్‌ గా చూస్తూ ఇప్పుడున్న సిచ్యుయేషన్‌ ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటూ వెళ్దాం పద అని ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.

మరోవైపు అనామిక కోపంగా ఉంటుంది. కల్యాణ్ రాగానే వెటకారంగా మాట్లాడుతుంది. ఏంటి సార్‌.. అప్పుడే వచ్చేశారు. మీరింకా ఈ రోజంతా అక్కడే ఉండి మీ ఫ్రెండ్‌ను ఓదారుస్తారనుకున్నాను. ఇంకా కోపం తగ్గలేదా అని కల్యాణ్ అడుగుతాడు. కోపం కాదు బాధ నీ ఫ్రెండ్‌తో నువ్వు ఎలాగైనా ఉండు అది నీ ఇష్టం. కానీ నేను నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు నాకే ఇంపార్టెంట్‌ ఇవ్వాలని నేను కోరుకుంటాను అని అనామిక చెప్తుంది.

అర్థం చేసుకో అనామిక పాపం అప్పును అలా చూస్తే.. నీకు బాధగా లేదా అంటూ అనామికను కన్వీన్స్‌ చేస్తాడు కళ్యాణ్‌. త్వరలోనే మన పెళ్లి గురించి మాట్లాడతాను. త్వరలోనే ముహూర్తం కూడా ఫిక్స్‌ చేయండని చెప్తాను అనడంతో అనామిక సంతోషంగా కళ్యాణ్‌ను హగ్‌ చేసుకుంటుంది.

హాల్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. స్వప్న వంటమనిషిని పిలిచి తనకోసం స్పెషల్‌ వంటకాలు చేయాలని ఆర్డర్‌ వేస్తుంది. అది గమనించిన రుద్రాణి కోపంగా స్వప్నను తిడుతుంది. ఏ హక్కుతో ఆర్డర్‌ వేస్తున్నావని అడుగుతంది. మీరు ఏ హక్కుతో ఇక్కడ ఉన్నారో నేను అదే హక్కుతో ఆర్డర్‌ వేస్తున్నానని స్వప్న బదులిస్తుంది. ఇలాంటి పొగరున్నదాన్ని ఇంకా ఇంట్లో ఉండనివ్వడం ఏంటని రుద్రాణి వాళ్ల అమ్మనాన్నకు చెప్తుంది.

నువ్వు స్వప్నని బయటికి పంపాలంటే దానికి తగిన సాక్ష్యాలు కావాలని రాజ్ అంటాడు. సాక్ష్యాలు కావాలంటే ఎక్కడికెళ్లి తేవాలి. ఉన్నవన్నీ వాడు మీ అందరి ముందు బయటపెట్టిన ఇంకా బిడ్డకు తండ్రి ఎవరో తేలిపోవాల్సిందే అంటే ఎలా? ఇలాంటి మోసగత్తేను.. ఇలాంటి పొగరుబోతు ఆడదాన్ని ఇంట్లో పెట్టుకుని అనుక్షణం నా కొడుకు కుమిలిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా అంటూ స్వప్నను ఇంట్లోంచి గెంటివేయబోతుంటే స్వప్న నిజం నిరూపించి నన్ను గెంటివేయండి అంటూ బదులిస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో కావ్య రివర్స్ గేమ్ ఆడుతుంది. శృతికి రాజ్ కు లింక్ పెట్టి కావ్య మాట్లాడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X