Brahmamudi October 12th: రాత్రాంత కావ్య మిస్సింగ్.. అనుమానించిన అత్త... రాజ్ సమాధానం ఏంటంటే?

బ్రహ్మముడి సీరియల్ ప్రారంభంలో రాజ్ వచ్చి కావ్యను ప్రశ్నిస్తాడు. నన్ను ప్రేమగా చూసుకోవడం నిజం కాదా అంటూ కావ్య అడుగుతుంది. నిజమే అని అంటాడు రాజ్. ఇక అదే ప్రేమతో ఇంటికి తీసుకువెళ్లమని సీతారామయ్య అంటాడు. అయితే అసలు ఈ కళావతి ఇక్కడ ఉందని మీకెవ్వరూ చెప్పారు అని రాజ్ అడుగుతాడు. మీకెవ్వరూ చెప్పారు అని అడిగితే.. ఇంట్లో ఉండలేక వెతుక్కుంటూ వచ్చాను అని రాజ్ చెప్తాడు. ఇక మాకు పూజారి గారు చెప్పారు అని సీతారామయ్య చెప్తాడు.

ఇక కావ్యను పదా వెళ్దాం అంటే... కోపంగా అంటే రాను అని చెప్తుంది. ప్రసాదం తిని ఇక్కడే కూర్చుంటావా అని రాజ్.. కావ్యను తీసుకువెళ్తాడు. ఇది చూసిన ఇందిరాదేవి.. ఇది కూడా నటనే అంటావా బావా అని అడుగుతుంది. కాదు.. వాడిని ఏదో మాయ కమ్మేసింది.. చూద్దాం పదా అని వెళ్తారు. ఇక ఇంట్లో అందరూ సిరియస్ గా కూర్చొంటారు. కనకం ఏడుస్తూ ఉంటుంది. ఇక అపర్ణ కనకం వాళ్లపై సీరియస్ అవుతుంది. ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. మధ్యలో రుద్రాణి కూడా పుల్ల వేసే ప్రయత్నం చేస్తుంది.

Kavya Fires on Kanakam Murthy in October 12th 2023 Episode number 225 in Brahmamudi Telugu Serial

ఇక కనకం అపర్ణను ప్రశ్నిస్తుండగా... కావ్య వస్తుంది. ఇక అందరూ వెళ్లి ఏమైంది ఎటు వెళ్లావ్ అని అడుగుతారు. తర్వాత చెప్తాను అని చెప్తుంది కావ్య. ఇక్కడ జరుగుతుంది ఏంటమ్మా అని అడుగుతుంది కావ్య. దానికి వెటకారంగా రుద్రాణి... చెప్తుంది. మమ్మల్ని హంతకులుగా.. దోషులుగా మీ వాళ్లు చేశారు. మీ ఆయన్ని అయితే.. ఏం చేశావ్ నా కుతుర్ని అంటూ నిలదీశారు.. మీ కుటుంబం ఈ స్థాయికి దిగజారి... మాట్లాడారు అంటూ రుద్రాణి రెచ్చిపోతుంది.

ఇక కావ్య తన తల్లిదండ్రులపై సీరియస్ అవుతుంది. మీ వల్ల నేను కూడా దోషిని అయ్యాను. ఎందుకు అలా మాట్లాడారు అంటూ కావ్య నిలదీస్తుంది. నా కుటుంబాన్ని నిలదీయడానికి మీరెవరు అంటూ కావ్య సీరియస్ అవుతుంది. అత్తగారింట్లో ఆడపిల్ల అదృశ్యం అయితే అంతేనా... అందరినీ దోషుల్ని చేస్తారా అంటూ ఫైర్ అవుతుంది. దానికి రుద్రాణి.. బాగా నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేస్తుంది. ఇదంతా జరగడానికి కారణం నువ్వు అంటూ రెచ్చిపోతుంది.

Kavya Fires on Kanakam Murthy in October 12th 2023 Episode number 225 in Brahmamudi Telugu Serial

కావ్యను ఎక్కడికి వెళ్లావ్... అని అపర్ణ ప్రశ్నిస్తుంది. ఇక సీతారామయ్య కావ్యకు ఓ మొక్కు ఉందని సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది నమ్మేలా ఉందా అంటూ అపర్ణ అంటుంది. రాజ్ బాగుంటే.. రాత్రంతా గుళ్లో పడుకుంటానని మొక్కుఉంది.. అందుకే వెళ్లింది అంటూ చెప్తారు. ఇక అపర్ణ నమ్మదు.. ఇందిరా దేవి కూడా మీరు నమ్మక పోతే.. మీ ఇష్టం అంటూ చెప్పుకు వస్తుంది. నా మనవరాలు ఏ తప్పు చేయలేదు.. ఏ పొరపాటు చేయలేదు.. అంటూ చెప్తుంది.

ఇక ధాన్యలక్ష్మి కలగజేసుకుని... కావ్య ఏ తప్పు చేయలేదని రాజ్ నువ్వు నమ్ముతున్నవా అంటూ అడుగుతుంది. నమ్ముతున్నాను అంటూ రాజ్ సమాధానం చెబుతాడు. ఇక ఈ చర్చ ఎందుకు.. అని అడిగితే... ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక ఇలా నిలబడి ఉన్నాను అంటూ చెప్తాడు రాజ్. ఇక కనకం మూర్తి... వారికి క్షమాపణలు చెప్పి.. వెళ్తారు. కావ్య కూడా ఈ సంఘటనను మర్చిపోండి అంటూ కావ్య చెప్తుంది. క్షమించండి అంటూ బతిమిలాడుతుంది కావ్య. ఇక సీతారామయ్య అందరికీ సర్ది చెప్తాడు. ఇందిరాదేవి కావ్యను లోపలికి పోమ్మని చెప్తుంది.

Kavya Fires on Kanakam Murthy in October 12th 2023 Episode number 225 in Brahmamudi Telugu Serial

అందరి చెవుల్లో పువ్వులు పెట్టింది రా.. కేవలం మొక్కు కోసమే వెళ్లింది అంటే నమ్మబుద్ది కావడం లేదని రుద్రాణి.. రాహుల్ తో అంటుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో అపర్ణ నిద్ర లేస్తుంది. తలంతా పట్టేసిందని అని అపర్ణ అనుకుంటుంది. రాత్రంతా ఏడవడం ఎందుకు.. ఇప్పుడు తల పట్టుకోవడం ఎందుకు అని అనుకుంటుంది. ఇదంతా ఆ చోర్ సాలే గాడి వల్లే.. అని నిద్ర లేచి హాల్ లోకి వచ్చి కూర్చుంటుంది. ఇక టీ తీసుకుని అన్నపూర్ణ వస్తుంది. ఇక ఇక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో... స్వప్న మెట్లపై నుంచి కింద పడిబోతుంది.. కావ్య పట్టుకుంటుంది. ఇక కావ్య కాలు బెనికడంతో.. రాజ్ సేవలు చేస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X