Brahmamudi November 4th: తాతాయ్యకు అసలు విషయం చెప్పిన కావ్య... మరి సీతారామాయ్య నిర్ణయం ఏంటో?
బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్ చేసిన మోసం గురించి కనీసం రాజ్ కు అయినా చెప్పాలి కదా అని అపర్ణ.. సుభాష్ తో ఫైర్ అవుతుంది. నా కొడుకు భార్య చేతిలో మోస పోయాడు.. అందరి ముందు తలదించుకున్నాడు... ఇప్పుడు రాజ్ మనసు బాధపడుతుందో.. అంటూ చెప్తుంది. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా.. కనీసం మీకైనా చెప్పిందా అంటూ సుభాష్ తో చెప్పుకుంటూ అపర్ణ ఆవేదన చెందింది. నిజం ఎందుకు చెప్పలేదు అంటూ ఆవేశపడిపోయింది. ఎందుకంటే ఆమెకు కృతజ్ఞత అంటే తెలియదు.. మోసం చేయడం మాత్రమే తెలుసు.. ఇప్పుటికైనా కళ్లు తెరుచుకోండి అంటూ అపర్ణ.. సుభాష్ తో చెప్పి వెళ్లిపోతుంది.
ఇక మరోగదిలో రాహుల్, రుద్రాణి.. స్వప్న చేసిన హంగామా గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక డమ్మి అనుకున్న స్వప్న అలా రెచ్చిపోయిందేంటి అని రాహుల్.. రుద్రాణితో అంటుంది. తింగరిది అనుకున్నాం.. కానీ మనల్ని తింగరాళ్లోని చేసింది. అది ఇల్లు వదిలిపోయేట్టు లేదు... అంటూ రాహుల్ అంటాడు. ఇక స్వప్న అలా అరవడం వల్ల అందరిముందు అరిచి అది అందరి ముందు బ్యాడ్ అయిపోయిందని రుద్రాణి అంటుంది.

ఇక మరోవైపు సీతారామయ్య, ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు గొడవ ఆపలేదని ఇందిరాదేవి అడుగుతుంది. అక్కడ ఎవరు వినేట్టు ఉన్నారు అంటాడు సీతారామయ్య. ఇక కావ్య తప్పు చేసి ఉండదు అనేది నా నమ్మకం అని సీతారామయ్య అంటాడు. ఇక రేపు పెద్దరికం పేరుతో ఎవరికి అన్యాయం చేయాల్సి వస్తుందో అని భయం వేస్తుందని సీతారామయ్య్... ఇందిరాదేవితో అంటాడు.
ఉదయం కాగానే అపర్ణ కోసం.. కావ్య కాఫీ తీసుకువస్తుంది. అది తీసుకుని నేలకేసి కొడుతుంది అపర్ణ. ఇంత జరిగిన తర్వాత కూడా మొహనికి వేసుకున్న ముసుగు తీయవా.. ఇంకా మంచితనం అనే ముసుగులో నటిస్తావ్.. అంటూ అపర్ణ అంటుంది. చేసిన నాటాకాలు ఆడిన డ్రామాలు.. చాలు. నీ తట్ట బుట్ట తీసుకుని మీ అక్కను తీసుకుని ఇంటినుంచి వెళ్తే మంచిది అంటూ కావ్యకు వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా... నేను అన్నా.. నా మాటాలు అన్నా నచ్చదు అంటూ కావ్య అంటుంది. ముందు ఆలోచించి ఏం జరిగిందో తెలుసుకోండి అంటుంది.
ఇక కావ్యపై మరింత రెచ్చిపోయి మాట్లాడుతుంది అపర్ణ. ఇప్పుడు నా కొడుకు కూడా నువ్వు ఇంట్లో నుంచి పోవాలని కోరుకుంటున్నాడు అంటూ అపర్ణ చెప్పి వెళ్తుంది. సుభాష్ కూడా నేనేం చేయలేను అంటూ చేతులెత్తేస్తాడు. ఆరోజే నిజం తెలిసిన నాడు చెప్పి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్తాడు. చాలా పెద్ద తప్పు చేశావ్ అంటూ చెప్పి వెళ్లిపోతాడు.

ఇక సీతారామయ్య దగ్గరకు కావ్య వెళ్తుంది. ఈ ఇంట్లో ఎవరు ఏం అనుకున్నా.. మీరు నన్ను అర్థం చేసుకుంటూ వచ్చారు. అండగా నిలబడ్డారు. కానీ నిన్న జరిగిన సంఘటనతో మీకు కూడా కోపం వచ్చి ఉంటుంది కదా.. నాకు తెలుసు తాతాయ్య.. నా మీద మీకు కూడా కోపం ఉంటుందని. నేను మోసం చేయలేదు తాతయ్య. మా అక్క అబద్ధం చెప్తుంది.. స్వప్న రాహుల్ పెళ్లి తర్వాతే తెలిసింది ఈ విషయం. అక్కకు చాలా సార్లు చెప్తూనే వచ్చాను కానీ... స్వప్న చచ్చిపోతాను అంటూ బెదిరిందని కావ్య చెప్పుకుని బాధపడుతుంది.
నేను తప్పు చేయలేదని చెప్పడానికి రాలేదు తాతాయ్య. తప్పు చేశాను... అంటూ ఆవేదన చెందుతుంది కావ్య. ఇక గదిలో స్వప్న కూర్చొని ఉంటుంది అప్పుడు రాహుల్ వస్తాడు. నువ్వు తప్పు చేశావ్ మా అందరికి దొరికిపోయావ్ అంటూ రాహుల్ రెచ్చిపోతాడు. ఇక ఈ మాట అనకూడదు రాహుల్.. తప్పు అనే పదానికి మోసానికి కేరాఫ్ అడ్రస్ నువ్వు. రాజ్ ను పెళ్లి చేసుకోడానికి వచ్చి.. నాతో వచ్చావ్ కదా.. అంటాడు రాహుల్. షర్ట్ ప్ అంటూ స్వప్న రెచ్చిపోతుంది.
ఇక స్వప్న అంటే ఏం అనుకుంటున్నావ్... స్వప్న అంటే బ్రాండ్. నేను ఏ రోజు రాజ్ ను ప్రేమించలేదు.. డబ్బు కోసమే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ నీతో వచ్చాక ప్రేమలో పడిపోయాను. ఇప్పటివరకు నేను వేరు.. ఇప్పుడు నా రెండో మొహాన్ని చూస్తారు అంటూ రాహుల్ కు స్వప్న వార్నింగ్ ఇస్తుంది. నేను అందరి లాంటి దాన్ని కాదు.. నేను సాధించే వరకు వదిలిపెట్టను. ఈ ఇంటి నుంచి ఎప్పటికీ వెళ్లను... ఈ జీవితానికి నేనే పెళ్లాం అని ఫిక్స్ అయిపో.. కాదు కూడదు అని మీ అమ్మ కొంగు పట్టుకుని తిరిగితే అందరితో పాటు నీక్కూడా నేనేంటో చూపించాల్సి వస్తుందని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న.
మరోవైపు కృష్ణుడితో కావ్య తన బాధను చెప్పుకుని భాదపడుతూ ఉంటుంది. ఆయన కళ్లలో ప్రేమను చూశాను.. ఈరోజు మొత్తం చెరపేశావ్. ఇది నీకు న్యాయామా.. ఈ ఇంట్లో అందరు నన్ను అర్ధం చేసుకునే విధంగా చేయ్ అన్నాను.. మా అక్క నా ఇంట్లోనే శత్రువుగా మారి నా కాపురాన్ని నాశనం చేసింది.. ఎందుకు చెప్పలేదు.. తను మోసం చేస్తే నేనేం చేయగలను.. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి... నువ్వే ఈ సమస్య నుంచి బయటపడేలా చేయ్.. కనీసం భర్తైనా అర్థం చేసుకునేలా చేయ్... అంటూ కృష్ణుడిని వేడుకుంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక తదుపరి ఎపిసోడ్ లో ఇందిరాదేవి.. అపర్ణతో మాట్లాడుతుంది. ఇక ఆలోచించడానికి ఏమిలేదు.. మావయ్యగారితో మాట్లాడి ఏదో ఒకటి తేల్చండి అంటూ అపర్ణ అంటుంది. మరోవైపు కావ్య ఫోటోను రాజ్ కాల్చేస్తాడు. మీరు చాలా దూరం వెళ్తున్నారు అని కావ్య అంటుంది. రేపు ఉదయం నీ విషయం తాతాయ్య తేల్చేస్తే.. ఈ బంధం దూరం అవుతుందని రాజ్ అంటాడు.


Click it and Unblock the Notifications











