Brahmamudi July 6th Episode: రాజ్ ట్రీట్మెంట్పై షాకిచ్చిన డాక్టర్.. అత్త ముందు దోషిగా నిలబడ్డ కావ్య..
మా టీవీలో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ కు మంచి ఆదరణ వస్తోంది. అంతే కాదు ఈ సీరియల్స్ కు మంచి టీఆర్పీ కూడా వస్తోంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్‌కు ప్రాణాపాయ స్థితి వస్తుంది. దీంతో కావ్య వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. అక్కడ డాక్టర్ కావ్యకు షాక్ ఇస్తాడు. మరోవైపు అప్పు కోసం కనకం, కృష్ణమూర్తి పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాస్తూనే ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే....
ఐస్ క్రీం తిన్న రాజ్:కావ్య మీద కోపంతో అన్నం తినకుండా ఉంటాడు. ఐస్ క్రీమ్ తింటుంటే శుభ్రంగా నేను చేసిన వంట తింటే ఈ చెత్త తినే పని ఉండేది కాదు కదా అంటుంది కావ్య. ఆ తర్వాత శృతి వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయని తెగ మెచ్చుకుంటాడు రాజ్. అవి కావ్య డిజైన్స్ కనుక మనసులోనే పొంగిపోతుంది. నా ప్రేమని గుర్తించలేదు కనీసం నాలోని టాలెంట్ ని గుర్తించారని మురిసిపోతుంది. కట్ చేస్తే... కృష్ణమూర్తి వాళ్ళు పోలీస్ స్టేషన్ బయటే ఉంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళని అప్పు చూసి ఒకసారి నాన్నని పిలవమని కానిస్టేబుల్ ని అడుగుతుంది.

ఏ మాత్రం తేడా జరిగినా..:మరోవైపు రాజ్ గదిలో ఒక్కడినే ఉన్నాను ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. ఏ మాత్రం తేడా జరిగినా ముగ్గురం అవుతాం. ఎలాగైనా గదిలోకి కావ్యను రాకుండా ఆపాలి అనుకుంటాడు. గది డోర్ దగ్గర అడ్డంగా నిలబడతాడు. హల్లోకి వెళ్ళి పడుకోమని చెప్తాడు. కానీ కావ్య మాత్రం కుదరదని చెప్పి రాజ్ ని తోసేసి లోపలికి వెళ్తుంది. కాసేపు ఇద్దరూ వాదించుకుంటారు. ఇక చేసేది లేక రాజ్ బెడ్ మీద పడుకుంటాడు.
బయటకు తీసుకువస్తా...:ఇంటికి వెళ్లమని అప్పు తండ్రికి చెప్తుంది. కావ్య అక్కలాగా ఎప్పుడూ నీకు సాయం చేయలేదు. ఇప్పుడు ఒకడి తల పగలగొట్టి స్టేషన్ లోకి వచ్చాను నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది. లేదు నిన్ను చూస్తే గర్వంగా ఉంది. స్వప్న అంటే నీకు అసలు ఇష్టం లేదు కానీ తనని బయట వాళ్ళు ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేక కొట్టావని అంటాడు. నీకు ఇంత కష్టం వచ్చినా చేతకాని వాడిలా అయిపోయానని బాధపడతాడు. ఏదో ఒకటి చేసి నిన్ను బయటకి తీసుకొస్తానని ధైర్యం చెప్పేసి వెళ్ళిపోతాడు.

బైక్ పై ఆసుపత్రికి...:రాజ్ కి నిద్రలో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటాడు. కావ్యని పిలవలేక తన మీదకి దిండు విసిరేసరికి కావ్య లేచి చూస్తుంది. కంగారుగా ఏమైందని వెంటనే ఇన్ హెల్లర్ కోసం వెతుకుతుంది. కానీ దానిలో మందు అయిపోతుంది. కంగారుగా హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి పైకి లేపుతుంది. వాచ్ మెన్ ని పిలిచి కారు తీయమని చెప్తుంది. కానీ తనకి కారు డ్రైవింగ్ రాదని అనేసరికి వాచ్ మెన్ బైక్ తీసుకుని రాజ్ ని వెనుక కూర్చోబెట్టుకుని చీర కొంగుతో తను కింద పడి పోకుండా వీపుకి కట్టుకుని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది.

ట్రీట్మెంట్ కోసం 25వేలు...:ఆసుపత్రికి తీసుకెళ్లిన కావ్య... ఊపిరి ఆడటం లేదు ఆస్తమాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని డాక్టర్ కి చెప్తుంది. జాయిన్ చేసుకున్నందుకు అడ్వాన్స్ గా 25 వేలు కట్టమని రిసెప్షన్ లో అడుగుతారు. కంగారులో డబ్బులు తీసుకురాలేదని ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని కావ్య బతిమలాడుతుంది. కానీ హాస్పిటల్ రూల్స్ ప్రకారం డబ్బు కట్టిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ చెప్తాడు. ఆయన దుగ్గిరాల వంశానికి వారసుడు తర్వాత ఎంత అయిన కడతాడని కావ్య ఏడుస్తూ చెప్తుంది. కానీ హాస్పిటల్ వాళ్ళు మాత్రం కుదరదని చెప్తారు.

కల్యాణ్ కు కావ్య ఫోన్:వెంటనే కల్యాణ్ గుర్తుకు వస్తాడు. అప్పుడు కల్యాణ్ కు కావ్య కాల్ చేసి మీ అన్నయ్యకు బాలేదు.. అని చెప్తుంది.ఈలోపు ఎపిసోడ్ ముగుస్తోంది. ఇక రేపటి ఎపిసోడ్ లో కానిస్టేబుల్.. కనకం, కృష్ణమూర్తికి ఓ సలహా ఇస్తుంది. పెద్దవాళ్లు ఎవరినైనా తీసుకువచ్చి ఈ కేసు వెనక్కి తీసుకునేలా చూడండి.. లేదంటే మీ అమ్మాయిని ఎవరూ కాపాడలేరు.. అంటుంది. నేను వెళ్లి సీతారామయ్య గారి కాళ్లు పట్టుకొని అయినా అప్పును విడిపిస్తా.. అని కనకం అంటుంది.

ఇంట్లో పంచాయితీ...:మరోవైపు దుగ్గిరాల ఇంట్లో పెద్ద పంచాయితీ జరుగుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా కొడుక్కి ఇంత ప్రమాదం జరిగినా కూడా మాలో ఏ ఒక్కరికి ఫోన్ చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావు.. వాడికి అన్ని జాగ్రత్తలు తెలుసు.. నువ్వే అజాగ్రత్తగా ఉండి ఉంటావ్.. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది.. మీ కుటుంబమే ఇంత.. నీ వల్ల మాకు ఏనాడు మనఃశాంతి లేదు.. క్షమించి ఇంట్లో ఉండనిస్తే నా కొడుకు ప్రాణాల మీదకి తెచ్చింది ఈ అమ్మాయి.. అంటూ కావ్యను నానా మాటలు అంటుంది అపర్ణ. సరిగ్గా అదే టైమ్‌కి కనకం, కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటి గుమ్మం ముందు నిల్చొని ఇదంతా వింటూ ఉంటారు.


Click it and Unblock the Notifications











