Brahmamudi October 7th: రాజ్ బండారం తెలిసి ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య.. అల్లుడిని నిలదీసిన కనకం
బ్రహ్మముడి వీకెండ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఓ వైపు అనామిక, కల్యాణ్ ప్రేమను చూసి అప్పు బాధపడుతుంది. ఇక కల్యాణ్ ప్రేమలో అప్పు పడినట్లే అని అర్థం అవుతుంది. మరోవైపు రాజ్ రాసిన చీటీని చదివిన కావ్య.. ఇంట్లోంచి వెళ్లిపోతుంది. కావ్య కోసం రాజ్ వెతికితే.. అసలు విషయం బయట పడుతుంది. ఇక కనకం వచ్చి నా కూతురు నాకు కావాలి అంటుంది. అసలు కావ్య దొరికిందా.. ఎందుకు బయటకు వెళ్లిందనే విషయాలు తెలుసుకోవాలంటే.. ఈరోజు ఎపిసోడ్ చదవాల్సిందే.
అప్పు కోసం కనకం వెతుకుతూ ఉంటుంది. అప్పు బయట కూర్చొని ఉంటుంది. ఇక్కడ కూర్చున్నావ్ పదా అని అప్పు అనగా.. నాకు ఆకలిగా లేదు అని చెప్తుంది. నేను ఇంటికి వెళ్లి తింటాను...వాళ్లకు నచ్చినట్లు ఉండలేను అని చెప్పి వెల్తుంది. మరోవైపు ఇంట్లో వాళ్లకు భోజనం వడ్డిస్తుంది కావ్య. అప్పు ఏది అని ధాన్యం అడిగితే... ఇంటికి వెళ్లిపోయిందని కనకం చెబుతుంది. అపర్ణ అదేంటి పండగపూట ఇంటికి వచ్చిన వాళ్లు అలా తినకుండా పోకూడదని తెలియదా అని అంటుంది.

ఆ తర్వాత కావ్య అన్నం వడ్డిస్తుంటే.. మీ ఆయన పక్కన కూర్చో అని ధాన్యం పంపిస్తుంది. ఇక కావ్యకు కూడా ఆకు వేసి భోజనం పెడతారు. ఇక రాజ్, కావ్య కాసేపు టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటారు. అది చూసిన రుద్రాణి రాజ్ చాలా మారిపోయావ్ అంటుంది దానికి సీతారామయ్య.. భార్య సంతోషం కోసం మారితే తప్పులేదని చెబుతాడు. ఇక ఇంట్లో వాళ్లను చూసి సీతారామయ్య ఆనంద భాష్పాలు పెట్టుకుంటాడు. ఇలా ఈరోజు అందరం కలిసి తింటుంటే చాలా ఆనందంగా ఉందని అంటాడు.
ఇక రాజ్ రూమ్ కు వచ్చాక.. కావ్యతో కాసేపు మాట్లాడుకుంటాడు. ఎందుకు బయట అలా చేస్తున్నావ్ అని రాజ్ ప్రశ్నిస్తాడు. ఏం చేశాను అని అంటుంది కావ్య. అందరి ముందు మనం అలా ఉంటే మనం కలిసిపోయామని అనుకుంటే.. అంటాడు రాజ్. అదేంటి అని కావ్య అంటుంది. ఏమి లేదంటూ తాతాయ్య అంటూ కవర్ చేస్తాడు. ఇక కావ్య రాజ్ రాసిన ఆ చీటీని చదవాలని అనుకుంటుంది.

ఇక ఆ చీటీని చదివేందుకు బయటకు వెళ్తుంది. ఆ చీటీ ఓపెన్ చేసి చదువుతుంది. ఇక అందులో రాజ్ రాసిన ప్రేమ నాటకం గురించి కావ్య తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. జ్ఞాపకాలను తలుచుకుని కావ్య బాధపడుతుంది. మరోవైపు కనకం ఎలా జరిగిందని ఇంట్లో అప్పు పెద్దమ్మ అంటుంది. బాగా జరిగిందని అంటుంది. ఇక అప్పు వచ్చి ఆకలి వేస్తుందని చెబుతుంది. అక్కడ తినమంటే తినలేదు.. ఇప్పుడు ఆకలి ఏంటి అంటే.. వండావా అని అప్పు అంటుంది. ఇక అప్పు విచిత్రంగా చేస్తుందని కనకం అంటుంది. అప్పు ఆకలి వేస్తే అరుస్తుంది కదా వండి పెట్టు అని మూర్తి చెప్తాడు.
అప్పు రూమ్ లోకి వెళ్లి కల్యాణ్ గురించి తలుచుకుంటుంది. అనామిక, కల్యాణ్ కలిసి ఉండటం చూసి బాధ పడుతుంది. ఇక పెద్దమ్మ వస్తుంది. ఆమెపై కూడా అప్పు అరుస్తుంది. కల్యాణ్ గురించి నాకు చెప్పకు అని అంటుంది కావ్య. నువ్వు ఆలోచిస్తూ... నా మీద అరవడం దేనికి అంటుంది. నువ్వు కల్యాణ్ ను ప్రేమిస్తున్నావ్ అని అర్థం చేసుకో... కావ్య, స్వప్నలు అనుకోకుండా ఆ ఇంటికి కోడలు అయ్యారు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నీ ప్రేమ గురించి బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించు అని చెప్తుంది.

కావ్యనే తన చెల్లెలిని కల్యాణ్ కు దగ్గరయ్యేలా చేసిందని అంటారు. కావ్యను ఎంతలా అవమానిస్తారో ఆలోచించు. మీ అమ్మ డబ్బు కోసమే పెళ్లి చేసింది. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి కోడలిగా పోతే.. మీ అమ్మను కూడా అంటారు. మరోవైపు బెడ్ రూంకి వచ్చిన రాజ్... కావ్య రాలేదంటి అనుకుంటాడు. టైం చూస్తే 11.15 నిమిషాలు అవుతున్నా.. ఇంకా రాలేందేంటి అనుకుంటాడు. కిందకి వచ్చి చూస్తాడు. ఎవరు కనిపించరు.అక్కడ ధాన్యలక్ష్మి కనిపిస్తే... కావ్య ఏది అని అడుగుతాడు. తను నాక్కూడా కనిపించలేదు అని చెప్తుంది.

బయట చూస్తాను అంటే.. బయట ఎవరు లేరు అని ధాన్యలక్ష్మి భర్త చెప్తాడు. ఇక తాతయ్య గదిలో ఉండొచ్చని ధాన్యలక్ష్మి చెబుతుంది. ఇక తాతాయ్య గదిలో చూస్తాను అని రాజ్ వెళ్తాడు. తాతయ్య అంటూ రాజ్ వెళ్తే.. అక్కడ కూడా కావ్య కనిపించదు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో కావ్య కనిపించడం లేదని తెలుసుకుని కనకం ఇంటికి వస్తుంది. వదినగారు కావ్య కనిపించడం లేదట.. ఏమైంది అంటే తెలీదు అంటుంది. నిజం చెప్పు బాబు నా కూతురిని ఏం చేశావ్ అంటుంది కనకం. నాకు నా కూతురు కావాలి అంటుంది కనకం. మరోవైపు కావ్య రోడ్డుపై నడుచుకుంటూ పోతుంది. ఇంట్లో వాళ్లంతా నైట్ వెతుకడానికి బయటకు వెళ్తారు.


Click it and Unblock the Notifications











