Brahmamudi November 11th: రుద్రాణి, రాహుల్ ప్లాన్ అట్టర్ ప్లాప్... రాజ్‌కు ముద్దు ఇచ్చిన కావ్య!
ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య.. రాజ్ ను అన్నం తినమని అడుగుతుంది. నేను తినను అని చెప్తాడు. గాయం చేసి మందు రాస్తా అంటే.. రాయించుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు అని రాజ్ అంటాడు. పోనీలే పాపం అన్నం తినిపిద్దామంటే.. మాట వినడం లేదు.. మీరు అన్న ఆ మోసమే చేసి తినిపిస్తాను అని కావ్య మనసులో అనుకుంటుంది. ఇక ధాన్య లక్ష్మి, కావ్య వాళ్ల ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. అపర్ణను రెచ్చగొట్టేలా మాట్లాడి.. రాజ్ కు అన్నం తినిపించే విధంగా మాట్లాడుకుంటారు. ఇక అపర్ణ మాట రాజ్ వినడు చిన్నత్తయ్య అంటూ ప్లాన్ అమలు చేస్తాడు.
ఇక అపర్ణ ఎంటర్ అయి... ఏమైంది అని అడుగుతుంది. రాజ్ అన్నం తినడం లేదు.. ఎవరి మాట వినడం లేదని కావ్య చెప్తుందని ధాన్య లక్ష్మి చెప్తుంది. రాజ్ తన మాట అయితే వినకపోవచ్చు కానీ... నా మాట అయితే వింటాడు కదా అంటే ఎవరి మాట వినడు అంటుందని ధాన్యలక్ష్మి చెప్తుంది. ఇక రాజ్ ఎవరి మాట వినడు.. ఒక్క నా మాటతప్ప అని అపర్ణ చెప్తుంది. అపర్ణ రాజ్ కోసం భోజనం తీసుకుని వెళ్లిపోతుంది. ఇక కావ్య, ధాన్య లక్ష్మి ప్లాన్ సక్సెస్ కావడంతో.. ఇద్దరు మురిసిపోతారు.

ఇక రాజ్ గదిలో ఆకలితో అలమటిస్తుంటాడు. లేదు తినకూడదు.. అది చేసింది నేను తినడం ఏంటని అనుకుంటాడు. ఇంతలో అపర్ణ భోజనం ప్లేట్ పట్టుకుని వస్తుంది. ఆ కళావతి.. నీకు ఇచ్చి పంపిందా అంటాడు రాజ్. ఆ కళవతి మొహం చూస్తేనే తినాలనిపించడం లేదని రాజ్ అంటాడు. డోర్ దగ్గర సీక్రెట్ గా చూస్తున్న కావ్యకు కోపం వస్తుంది కానీ ధాన్య లక్ష్మి ఆపుతుంది. ఇక కళవతి మొహం ఎవరు చూడమన్నారు.. అని అపర్ణ అంటుంది.
ఆ కళవతే కదా చేసింది అని రాజ్ అనగా.. అపర్ణ లేదు నేనే చేశాను అని అబద్ధం చెప్తుంది. ఇక ధాన్య లక్ష్మి.. నువ్వు చేస్తే.. క్రెడిట్ ఆమె కొట్టేస్తుందని అంటుంది. రాజ్ కు గోరు ముద్దులు పెడుతుంది అపర్ణ. ఇక అపర్ణ తినిపించడం చూసి.. ధాన్యలక్ష్మి, కావ్య సంతోషపడిపోతారు. నీలాంటి మంచి మనసు ఉన్న మనిషికి ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడో దేవుడు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక అపర్ణ వచ్చి నా కొడుకు నా మాట విన్నాడు అని చెప్పి వెళ్తుంది.
ఇక గదిలోకి వెళ్లిన కావ్యతో రాజ్.. నువ్వు మా అమ్మతో పంపించినా తిన్నాను అంటే.. అది మా అమ్మ కోసమే అని చెప్తాడు. ఇక కావ్య కూడా సంబరపడిపోతుంది. ఇక మరుసటి రోజు ఇంట్లో అందరూ కూర్చొంటారు. లాయర్ వీలునామా రాసుకుని వస్తాడు. ఇప్పుడు ఈ వీలునామా అవసరమా అని సుభాష్ అంటాడు. ఇదంతా ఆపేశాయ్ అని ఇందిరాదేవి అంటుంది. ఎలాగూ లాయర్ గారు వీలునామా రాసుకువచ్చారు కదా.. చదవనివ్వండి అని అంటుంది.
ఇక ధాన్యలక్ష్మి సెటైర్ వేయగా.. సీతారామయ్య అందరికీ నా మీద అనుమానమే ఉంది.. ఆస్తులు తర్వాతి తరం కోసం పెరిగేలా ఉండాలి అని చెప్తుంటాడు. ఇక రుద్రాణి ఈ ముసలోడు సోది చెప్తున్నాడు ఏంటి అని మనసులో అనుకుంటుంది. ఇక సీతారామయ్యతో ఇందిరాదేవి మాట్లాడుతుంది. దాన్ని లాకర్ లో దాచి పెడుతాను అంటే.. అందరూ అదే కరెక్ట్ అంటారు. ఇక లాయర్ వీలునామా చదవండి అని సీతారామయ్య చెప్తాడు. ఇక లాయర్ చదువుతున్న సమయంలో రాజ్ ఎంటర్ అయి.. ఆ పేపర్స్ ను తీసుకుంటాడు.
ఈ వాటిని ముక్కలుగా చింపివేస్తాడు రాజ్. అది చూసి ఇంట్లో వాళ్లు సంతోషిస్తారు. ఇక రుద్రాణి, రాహుల్, స్వప్న మాత్రం కోపంగా చూస్తారు. తాతాయ్య మీ నిర్ణయాన్నిధిక్కరించి ఈ పని చేయలేదు.. ఇది కరెక్ట్ కాదని చేశాను అని రాజ్ అంటాడు. ఇంటి పెద్ద మనిషికి ఓ కష్టం వస్తే ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని రాజ్ అంటాడు. మేం మనుషులం తాతాయ్య... బండరాళ్లం కాదు అని చెప్తాడు రాజ్. ఇక శభాష్ రాజ్ అంటూ ఇందిరా దేవి అంటుంది. దుగ్గిరాల వారుసుడు అంటే రాజ్ మాత్రమే అని చెప్తుంది. ఇక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక తదుపరి ఎపిసోడ్ లో మన సమస్యకు మనమే పరిష్కారం వెతుక్కుని నిజంగా సంతోషంగా ఉంటేనే.. తాతాయ్య తృప్తిగా ఉంటారు. ఈ సందర్భాన్ని అడ్వాంటైజ్ తీసుకుని ఒక్కటై పోవాలని చూస్తున్నావా.. నీతో కలిసి కాపురం చేయాలని కల్లో కూడా ఒప్పుకోలేను అంటాడు రాజ్. మీది కూడా నాటకమే అని కావ్య అంటే.. అవసరం అయితే ముందుకు కూడా నటిస్తుస్తాను అని రాజ్ అంటాడు. నేను కూడా నటించడం మొదలు పెడితే.. ఎలా ఉంటుందో ముందు ముందు చూస్తారు అని కావ్య అంటుంది. ఎవండి అంటూ ఓ ఫ్లైయింగ్ కిస్ ఇస్తుంది కావ్య.


Click it and Unblock the Notifications











