Brahmamudi October 4th: అనామిక, కల్యాణ్ పెళ్లి ఫిక్స్... కావ్యకు తెలిసిపోయిన రాజ్ ప్రేమనాటకం
కావ్య తల్లిదండ్రులు దుగ్గిరాల ఇంటికి వస్తారు. అక్కడ రుద్రాణి అవమానించేలా మాట్లాడుతారు. ఇక రాజ్ కు థ్యాంక్స్ చెబుతాడు మూర్తి. దానికి రాజ్.. మీరు కావ్యకు తల్లిదండ్రులు అయితే నాక్కూడా అలాంటి వారే కదా అంటాడు. ఇక సీతారామయ్య పెంపకం గురించి మూర్తి గొప్పగా మాట్లాడుతాడు. ఇక అంతలోనే అనామికా తన పేరెంట్స్ తో కలిసి వస్తుంది. అది చూసిన కల్యాణ్, కావ్య వెళ్లి వారిని రిసీవ్ చేసుకుంటారు.
అనామిక రాగానే సీతారామయ్య, ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక ఇంట్లోవాళ్లను పరిచయం చేసుకుంటుంది. ఇక కల్యాణ్, అనామికను కూర్చొబెట్టి ఫ్యామిలీ మొత్తం మాట్లాడుతుంది. ఇక ఎవరో ఒకరు మాట్లాడండి అంటే... నువ్వే చెప్పు... నువ్వే చెప్పు అంటూ కాసేపు వాదించుకుంటారు. ఇక మీరేం చెప్పనవసరం లేదు అని కావ్య అంటుంది. ఎందుకంటే మీ ప్రేమాయణం అందరికీ తెలిసిపోయిందని చెబుతుంది.

అది విన్న అందరూ నవ్వుకుంటారు. మా తమ్ముడు అర్థం కాని కవితలే రాస్తాడు అనుకున్న ఆ కవితల్లో ఇంత ప్రేమాయణం నడుపుతాడని తెలీదు అంటాడు రాజ్. ఇక అనామిక పేరెంట్స్ కల్యాణ్, అనామిక ప్రేమ గురించి మాట్లాడుతారు. వారు ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేయాలని నిర్ణయించామి చెబుతారు. ఇంట్లో పెద్దలం మేమే అయినా... కల్యాణ్ పేరెంట్స్ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది వారికి అంటూ ఇందిరాదేవి చెప్పుకు వస్తుంది.
ఇక ధాన్యలక్ష్మి... వాళ్ల ఆయన మొహం చూస్తుంది. నీ ఇష్టమే నా ఇష్టమని చెబుతాడు. ధాన్య లక్ష్మి అపర్ణ, సుభాష్ నిర్ణయం అడగ్గా... వాళ్లు కూడా నీ ఇష్టమే అని చెబుతారు. ఇక కల్యాణ్ ఇష్డపడ్డాక మేం ఏనాడు వద్దు అనము అంటూ ధాన్య లక్ష్మి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇదంతా చూసిన అప్పు మాత్రం కోపంతో మూతి తిప్పుకుంటుంది.

మరోవైపు రుద్రాణి మీకేం అర్హతలు ఉన్నాయని అంటుంది. మాకు ఆస్తులు లేకపోయినా... మీరు ఏమి లేని కుటుంబం నుంచి అమ్మాయిని తీసుకువచ్చారని ఆ ఆదర్శం చూసి మేము ధైర్యంతో వచ్చామి చెబుతాడు అనామిక ఫాదర్. ఇక రుద్రాణి అవును... మట్టిబొమ్మలకు రంగులు వేసే వాళ్లే మా వియ్యంకులు అంటూ చెప్తుంది. దానికి సుభాష్... రంగులు మాత్రమే వేస్తారు... మొహనికి రంగులు వేయరు అంటూ చెప్తాడు. రాజ్ కూడా సపోర్టింగ్ మాట్లాడుతాడు.
ఇక అనామిక తల్లిదండ్రులు పెళ్లి గురించి మాట్లాడుతారు. ఇక అంతా ఒప్పుకుంటారు. ఇక పూజకు సిద్ధం చేయండని అడిగితే అపర్ణ దానికి మేం 3 గంటలకే లేచి సిద్ధం చేశామి చెబుతుంది. ఇక అనామిక మా ఆడవాళ్లు సిద్ధం చేస్తే... మీరు వచ్చి పూజ చేస్తారా అని అడుగుతుంది. ఆడవాళ్లకు అన్యాయం జరుగుతుందని అంటే... దానికి అపర్ణ కూడా అవును అంటుంది. ఇక రాజ్ ఏంటి మమ్మీ నువ్వు కూడా ప్లేట్ ఫీరాయించావా అంటే.. ఆడవాళ్లు అంటే తప్పదు అని చెబుతుంది.

ఇక ఆడవాళ్లు, మగవాళ్లు అంటూ ఇంట్లో కాసేపు వాదన జరుగుతుంది. దానికి పరిష్కరం ఒక్కటే అని... సీతారామయ్య అందరిని గార్డెన్ కు తీసుకువెళ్తారు. ఇక కావ్య రాజ్ రాసిన చీటీని కొట్టేద్దామని ట్రై చేస్తుంది. ఇక కనకం వచ్చి... ఏం చేస్తున్నావ్ అనగా.. చెప్తుంది కావ్య. వద్దు అలా చేయొద్దని చెప్పి తీసుకువెళ్తుంది.
ఇక గార్డెన్ ఏరియాలో ఆడవాళ్లకు, మగవాళ్లకు పోటీ పెడుతాడు సీతారామయ్య. వారికి టగ్ అండ్ వార్ పెట్టగా... అందులో కావ్య వెళ్లి... రాజ్ మీద పడుతుంది. అది చూసిన అంతా నవ్వుకుంటారు. ఇక కాసేపు వారి మధ్య లవ్ ట్రాక్ వచ్చేలా మ్యూజిక్ వస్తుంది. ఇక మేమే గెలిచామని మగవాళ్లు అంటారు. ఇక మేము ఒప్పుకోమని చెబుతుంది కావ్య. ఎందుకు ఒప్పుకోరు అంటాడు... మగవాళ్లకు ఎక్కువ బలం ఉంటుందని చెబుతుంది. తెలివితో ఉండాలి గేమ్ అంటుంది.

యుగాల నుంచి ఈ పోటీకి ఫలితాలు లేవని చెబుతాడు సీతారామయ్య. జంటలుగా పోటీ పెడుతాం.. ఎవరు గెలిస్తే... వారే పూజ చేస్తారు. మరో గేమ్ కు సిద్ధం అవుతారు. ఏ జంట అయితే టార్గెట్ కు గురిచేసి మధ్యలో కొడతారో వాళ్లే విన్నర్ అవుతారు. అని చెబుతాడు సీతారామయ్య. మొదట వచ్చే జంట ఎవరు అంటే నేను రాహుల్ వస్తామని చెబుతుంది స్వప్న. అది విని షాక్ అవుతారు. ఇక అక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో అంతా డ్యాన్సులు చేస్తారు. రాజ్ కూడా కావ్యతో డ్యాన్స్ చేస్తారు. ఇక కావ్య రాజ్ రాసిన చీటీని తెచ్చుకుంటుంది. ఎవరు లేని చోట ఓపెన్ చేసి చదివి షాక్ అవుతుంది. అందులో రాజ్ రాసిన ప్రేమ నాటకం గురించి కావ్యకు తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











