Brahmamudi August 12th: రాజ్ ఆ పని చేశాడని తెలుసుకున్న కావ్య... దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి కళావతి ఔట్?

ఈరోజు బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు కావ్య దుగ్గిరాల కుటుంబం పరువు తీస్తుందని కనకం ఇంటికి వచ్చిన అపర్ణ మండిపడుతుంది. మరోవైపు మూర్తికి వచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయిస్తాడు రాజ్. దీంతో కోపంగా ఇంటికి వెళ్తుంది కావ్య. పూర్తి వివరాల్లోకి వెళితే...

కావ్య పుట్టింటి కోసం మట్టి పనిచేయడంతో... దుగ్గిరాల వారి ఇంట్లో రచ్చ రచ్చ అవుతుంది. వెంటనే కనకం ఇంటికి వచ్చేస్తుంది అపర్ణ. ఇలాంటివి జరుగుతాయనే.. పెళ్లి తర్వాత మీరు మా ఇంటిలో అడుగుపెట్టొద్దని చెప్పానని అంటుంది అపర్ణ. మూర్తి, కనకం వాళ్లను నానా మాటలు అంటుంది అపర్ణ. ఘోరంగా అవమానిస్తుంది. కావ్య తన తప్పును సరిచేసుకుంటానని వెళ్లి మీడియా ముందు మా పరువు తీసిందని మండిపడుతుంది.

Kavya out in duggirala Family in August 12th 2023 Episode number 173 in Brahmamudi Telugu Serial

దుగ్గిరాల ఇంటి కోడలిగా ఉండాలంటే.. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా.. మీ కూతురిని మీరే అడ్డుకోండని చెబుతుంది అపర్ణ. లేదంటే.. మీ కూతురిని శాశ్వతంగా నా కొడుకుతో బంధం తెంచుకుని మీ ఇంటికి తీసుకోచ్చుకోండని బెదిరిస్తుంది. బ్లాంక్ చెక్ చూపించి.. నచ్చినంత రాసుకోండని అంటుంది. మాకు పూటకు గడవకపోవచ్చు గానీ.. పక్కవాళ్ల సొమ్ముకు ఆశపడమని అంటుంది కనకం. మీకు చెప్పే వచ్చామందని రానిచ్చామని, లేకుంటే రానించే వాళ్లం కాదని అంటుంది. ఇకపై కావ్య మీ పరువు తీసే పని ఏదీ చేయదని క్లారిటీ ఇస్తుంది. చెక్ తీసి అపర్ణ చేతిలో పెడుతుంది కనకం.

మరోవైపు రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటారు. రాజ్ ఎంత తెలివైనవాడైనా.. ఎమోషనల్ ఫుల్ మమ్మీ అంటాడు రాహుల్. రాజ్ లో ఉన్న బలహీనతనే.. నేను బలంగా మార్చుకున్నానని, ప్రెస్ మీట్ పెట్టి మన పరువు తీసిందని రెచ్చగొట్టానని వివరిస్తాడు. కావ్య చేస్తున్న పని వల్లే ఇంత అహంకారం పెరిగిందని చెప్పగా.. కావ్య కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాడని చెబుతాడు. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. రాజ్ అంత పని చేశాడా అనగా.. నా కళ్లతో నేను చూశాను మమ్మీ అంటాడు రాహుల్. కావ్యకు ఆ విషయం తెలియగానే.. దుగ్గిరాల వారి ఇంటి మీదకు కోపంగా వస్తుందని చెబుతాడు.

కృష్ణ మూర్తి బాధలో ఉంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. మీకోసం పని దగ్గర వెయిట్ చేస్తున్నానని చెబుతుంది. మీ ఇంటికి వెళ్లిపోమని చెబుతాడు. ఏంటి నాన్న అని కావ్య అడగ్గా.. రేపటి నుంచి మా దగ్గర పని చేసేందుకు రావొద్దని అంటాడు. ఎందుకు అని కావ్య అడుగుతుంది. కనకం కావ్యకు జరిగిందంతా చెబుతుంది. ఇక కాంట్రక్టర్ వచ్చి... పని ఆపమని చెప్తాడు. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నానని, ఎందుకు అని అడగొద్దని కాంట్రాక్టర్ చెబుతాడు. ఎందుకు చెప్పల్సిందేనని కావ్య అంటుంది. మధ్యలో ఆపేస్తే.. మేం ఎలా సమాధానం చెప్పాలని కావ్య చెబుతుంది.

కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునేందుకు కారణమేంటని గట్టిగా అడుగుతుంది కావ్య. ఎవరు ఆ పెద్దవాళ్లు అని కావ్య ప్రశ్నించగా.. మీ ఆయన రాజ్ అని సమాధానమిస్తాడు కాంట్రాక్టర్. మీ ఆయనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోమని బెదిరించాడని, అందుకే క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. కోపంగా వెళ్తుంది కావ్య. మరోవైపు దుగ్గిరాల వారి ఇంట్లో అందరూ గరం గరంగా ఉంటారు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్య మన పరవు ఎందుకు తీస్తుందని అపర్ణ మండిపడుతుంది. అందుకేనా మీరు మా అమ్మవాళ్లను బెదిరించారని కావ్య ఎదురుప్రశ్నిస్తుంది. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నన్ను అక్కడకు వెళ్లొద్దని అవమానించారని అడుగుతుంది.

నేను నాలుగు గోడల మధ్య మాట్లాడితే అవమానంగా అనిపిస్తే.. పబ్లిక్ గా మా పరువు తీశావని, మరి మాకు ఎంత అవమానంగా ఉండాలని అపర్ణ అడుగుతుంది. అయినా ఇవన్నీ అనవసరం వదినా.. నాకు బయటకు వెళ్లాలంటే.. చాలా అవమానంగా ఉందని రుద్రాణి మంట పెడుతుంది. నీ కోడలు పద్ధతి మార్చుకుంటుందో లేదో అడమని చెబుతుంది. నేను ఒక్కరితో చెప్పించుకోనని, తప్పు చేసే పని నేను చేయనని ఖరాఖండిగా చెప్పేస్తుంది కావ్య. అంటే నీ ప్రవర్తన మార్చుకోవా.. అని రుద్రాణి అడగ్గా.. లేదని క్లారిటీగా ఇస్తుంది. అపర్ణ సీరియస్ అవుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X