Brahmamudi August 29th: స్వప్న కొంపముంచిన బిర్యానీ.. అపర్ణ నిర్వాహకం బయపెట్టిన ఇందిరా దేవి

బ్రహ్మముడి సీరియల్ మొదట్లో నెమ్మదిగా సాగినా... ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. కావ్య ఇంట్లోకి వచ్చినా తనతో ఎవరూ మాట్లాడరు. దీనితో ధాన్యలక్ష్మితో కలిసి ఓ ప్లాన్ వేస్తుంది. మరోవైపు కావ్య పొట్ట పెంచుకునేందుకు బిర్యానీ తింటుంది. ఆ తర్వాత వాంతులు చేసుకుంటుంది. అది చూసిన ఇందిరా దేవి.. అపర్ణ, రాహుల్ కు తనను ఆసుపత్రిలో చూపించమంటూ చెబుతుంది. ఇక తనకు కడుపు లేదనే విషయం తెలిపోతుందా అని స్వప్న టెన్షన్ పడుతుంది. ఇక పూర్తి ఈరోజు ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...

పొట్ట పెంచుకునేందుకు జంబో ప్యాక్ లాంటి బిర్యానిని తింటుంది స్వప్న. అది చూసిన ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. ఏంటీ స్వప్న ఇంత పెద్ద గుట్ట తింటున్నావ్ అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆకలి వేస్తుంది అని స్వప్న చెబితే.. కడుపుతో ఉంటే ఆకలి వేస్తుందని తెలుసు. కానీ, మరి ఇంతలానా. ఏదో దెయ్యం పట్టినదానిలా తింటున్నావ్.. ఎప్పుడూ డైట్ పేరుతో పొగరుతో మాట్లాడే నువ్వు ఇలా తినడం ఏంటి అని ధాన్యలక్ష్మి అంటుంది. కంట్రోల్ చేసుకోలేకపోయా అని స్వప్న అంటే.. అలా ఏది పడితే అలా తినకు. కడుపులో ఉన్న బిడ్డకు ప్లేస్ ఉంచూ... లేదా ఏం తినాలని ఉందో కావ్యకు చెప్పు. ఓపికగా చేసి పెడుతుంది అని చెప్పి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మి.

Kavya Plan With Dhanya Laxmi in August 29th 2023 Episode number 187 in Brahmamudi Telugu Serial

స్వప్న... ఇక్కడ కూడా కావ్య పేరేనా. నాకు కావ్యపై కసి కన్నా. పొట్ట పెంచుకోవడం ఇంపార్టెంట్ అని మళ్లీ తినడం మొదలు పెడుతుంది. మరోవైపు కావ్య ఇంట్లో పరిస్థితి గురించి కృష్ణమూర్తి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. ఫోన్ తీసుకుని కల్యాణ్‍కు కాల్ చేస్తుంది కనకం. అక్కడ కావ్యకు ఏమైనా సమస్య ఉందా అని అడిగితే.. అదేం లేదు. ఇంట్లో గొడవను అంతా ఎప్పుడో మరిచిపోయారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే చెప్పడానికి, తీర్చడానికి నేను ఉన్నాను కదా అని కల్యాణ్ అంటాడు. కల్యాణ్ చెప్పిన మాటలకు కృష్ణమూర్తి, కనకం ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు.

Kavya Plan With Dhanya Laxmi in August 29th 2023 Episode number 187 in Brahmamudi Telugu Serial

రాత్రి ఎక్కువగా తినడంతో స్వప్న వాంతులు చేసుకుంటుంది. అది చూసి ఇందిరా దేవి హాస్పిటల్‌కు తీసుకెళ్లమని రుద్రాణి, రాహుల్‍కు చెబుతుంది. అనవసరంగా దొరికిపోయేలా ఉన్నాను అని స్వప్న అనుకుంటుంది. మమ్మీ నాకు ఒక ఐడియా వచ్చింది అని రాహుల్ అంటే.. ఏంటీ.. ఆసుపత్రిలోనే స్వప్నకు అబార్షన్ చేపిద్దామా. దాన్ని ఇంట్లో వాళ్లు నమ్మినా. కావ్య నమ్మదు. ఆలోచించి ప్లాన్ వేయాలి. అలాంటి పిచ్చి పనులు చేయకు అని రుద్రాణి అంటుంది.

Kavya Plan With Dhanya Laxmi in August 29th 2023 Episode number 187 in Brahmamudi Telugu Serial

మరోవైపు రాజ్ బాత్రూమ్‍లో స్నానం చేయడం గమనిస్తుంది కావ్య. రాజ్ వేసిన పెయింటింగ్స్ కోసం వెతుకుతుంటుంది. కొద్దిసేపటికి దొరికిన పెయింటింగ్స్ ను కావ్య చూస్తుండగా.. అంతలోనే రాజ్ వస్తాడు. వాటిని తీసుకుని లోపల పెడతాడు. తన బట్టలను కావ్య ఇస్త్రీ చేయడం చూసి ఎందుకు చేస్తున్నావ్ అంటూ మండిపడతాడు. కళాపతి, కళావతి అంటూ పిలుపుపై పోట్లాడుకున్న తర్వాత నేను నీ భర్తను అని రాజ్ అనడంతో కావ్య తెగ సంబరపడిపోతుంది.

ఈరోజు ఎంత శుభదినం. నా భర్త అని అన్నారు. నాతో మౌనవ్రతం పక్కన పెట్టి మాట్లాడారు అని కావ్య అంటుంది. దీంతో మళ్లీ బయటకు పంపిస్తాడు రాజ్. మొత్తానికి ఆయన నాతో మాట్లాడారు. ఇలా ఇంట్లో అందరు మాట్లాడేలా చేయాలి అని కావ్య ప్లాన్ వేస్తుంది. ఒక్కొక్కరితో మాట్లాడదాం అని ధాన్యలక్ష్మితో గేమ్ మొదలు పెట్టాలని కావ్య అనుకుంటుంది. వంటింట్లో ధాన్యలక్ష్మీ ఒక్కరే కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది. పాపం ఇంట్లో అందరికీ చిన్నత్తయ్య ఒక్కరే వంట చేస్తున్నారు అని మనసులో అనుకున్న కావ్య వంటింట్లోకి వెళ్తుంది. తాను కూరయగాయలు కట్ చేస్తానన్నట్లుగా కత్తి తీసుకుంటుంది కావ్య. కానీ, ధాన్యలక్ష్మీ తీసుకోనివ్వదు.

Kavya Plan With Dhanya Laxmi in August 29th 2023 Episode number 187 in Brahmamudi Telugu Serial

నాకు తెలుసు చిన్నత్తయ్య అత్తయ్య కోసం మీ అభిమానాన్ని ఆపుకుంటున్నారు కదా. మీ మనసు కూడా కఠినంగా మారిపోయిందా. నన్ను ఒంటరిని చేశారు కదా అని ఎమోషనల్ డైలాగ్స్ కావ్య చెప్పడంతో ధాన్యలక్ష్మి కరిగిపోతుంది. నాకు సపోర్ట్ చేస్తే ఇంట్లో వాళ్లు నాతో మాట్లాడేలా చేస్తాను అని కావ్య అంటుంది. దానికి ఏంటీ అని మెల్లిగా అడుగుతుంది ధాన్యలక్ష్మి. మీ వేలు కట్ అయిందని చెప్పండి. వంట అంతా నేనే చేస్తాను అని కావ్య అనడంతో ధాన్యలక్ష్మి వేలికి కట్టు కట్టుకోడానికి వెళ్తుంది.

Kavya Plan With Dhanya Laxmi in August 29th 2023 Episode number 187 in Brahmamudi Telugu Serial

వంటింట్లో కావ్యను చూసి అపర్ణ చాలా సీరియస్ అవుతుంది. ధాన్యలక్ష్మి అని కోపంగా అరిచిన అపర్ణ వేరే ప్రజలు ఎందుకు వంట చేస్తున్నారు. నువ్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతుంది. వేలు కట్ అయిందని వేలు చూపిస్తుంది ధాన్యలక్ష్మి. అంతా నా కర్మకే జరుగుతుంది అని కోపంగా వెళ్లిపోతుంది అపర్ణ. దీంతో ప్లాన్ సక్సెస్ అనుకుని కావ్య దగ్గరికి వెళ్లి ధాన్యలక్ష్మీ హైఫై ఇస్తుంది.

Kavya Plan With Dhanya Laxmi in August 29th 2023 Episode number 187 in Brahmamudi Telugu Serial

ఇంట్లో అందరికీ వంట చేస్తుంది కావ్య. డైనింగ్ టేబుల్‍ పై ఫుడ్ పెట్టి అందరికీ వినిపించేలా గంట కొడుతుంది. అలాగే టేబుల్‍ పై ఏమేం ఫుడ్ చేసిందో బోండాం, దోశ అంటూ రాసి పెడుతుంది. కావ్య గంట కొట్టడం చూసి అంతా కిందకు దిగి వస్తారు. ఏంటమ్మా హోటల్‍లో లాగా నేమ్ బోర్డ్స్ పెట్టావ్. ఏమేం చేశావో చెబితే సరిపోతుంది కదమ్మా అని రాజ్ తండ్రి అంటాడు. దీంతో కావ్య మౌనంగా ఉండిపోతుంది. మీ మావయ్య ఏదో అడుగుతున్నాడు. సమాధానం చెప్పాలి కదా. మౌన వ్రతమా అని తాతయ్య అంటాడు. దానికి అత్త వ్రతం అని ఇందిరా దేవి అంటుంది. దీంతో అంతా షాక్ అవుతారు.

అదేం వ్రతం అమ్మా అని రాజ్ తండ్రి ఆశ్చర్యంగా అడుగుతాడు. నీ భార్య.. నీ కోడలితో ఇంట్లో వాళ్లు ఎవరితో మాట్లాడటం వీల్లేదని శాసనం చేసింది అని ఇందిరా దేవి అసలు విషయం చెబుతుంది. దీంతో సుభాష్ సీరియస్‍ గా అపర్ణ వైపు చూస్తాడు. రాజ్ మిగతా అంతా ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు. చూస్తుంటే ఈ విషయం మీద తన భార్య అపర్ణపై సుభాష్ చాలా కోపంగా ఉంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X