Brahmamudi August 11th: కావ్య చేసిన పనికి ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న అపర్ణ.. షాక్‌లో రాజ్
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు కూడా మరింత ఆసక్తిగా సాగింది. ఇక ఈరోజు ధారావాహికలో కావ్య పుట్టింటి కోసం చేసిన పని మీడియాలో వార్తలు వస్తాయి. అయితే వీటికి కావ్య ప్రెస్ మీట్ పెట్టి.. మీడియా వాళ్లను ప్రశ్నిస్తుంది. మరోవైపు రాహుల్ మాటలను నమ్మిన రాజ్.. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయిస్తాడు. ఇక అపర్ణ.. కనకం ఇంటికి వచ్చి రచ్చ చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
కావ్య పుట్టింటికి చేసిన పని గురించి మీడియా వాళ్లు న్యూస్ వేసి రచ్చ రచ్చ చేస్తారు. దుగ్గిరాల వారి కోడలు దయనీయ పరిస్థితిలో ఉందని చెబుతారు. దీంతో కావ్య... వారికి క్లారిటీ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెడుతుంది. మీడియా ముందుకు వచ్చి... మీడియాను ప్రశ్నిస్తుంది. మరోవైపు ఇంట్లోకి వచ్చి.. కల్యాణ్ టీవీ ఆన్ చేసి.. కావ్య మాట్లాడే ఛానల్ పెడతాడు. కావ్య మాటలు విని ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. తను చేసే పని గురించి మీడియాకు క్లారిటీ ఇస్తుంది కావ్య.

కావ్య మాట్లాడుతూ... నేన మా అత్తారింటి పరువు, ప్రతిష్టలతో ముడిపెట్టే హక్కు మీకు ఎక్కడ ఉందని అడుగుతుంది. ఆ ఇంట్లో నాకు విలువే లేనట్టు మీ ఇష్టం వచ్చినట్టుగా రాసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తుంది. ఏదో ఒకటి రాయాలని, మీరు రాసిందే నిజమని జనాలు నమ్ముతారని, అత్తవారు అంటే.. టార్చర్ పెట్టేవారని, కోడలు అంటే సాధింపులకు గురయ్యే.. వారని మీరు రాయడం వలన ఇవాళ ఓ ఉన్నత భావాలు ఉన్న కుటుంబానికి అప్రతిష్ట వచ్చిందని సీరియస్ అవుతుంది కావ్య.
దుగ్గిరాల ఇంట్లో ఇదంతా చూశాక, రుద్రాణి తన నాటకం మెుదలపెడుతుంది. కావ్య మాటలను వక్రీకరించి.. వారికి చెబుతుంది. నిన్నటి వరకూ కావ్య పని చేస్తుందని కొంత మందికే.. తెలుసు కానీ ఈ ప్రెస్ మీట్ తో అందరికీ తెలిసిందని లేనిపోనివి చెబుతుంది. ఆ కనకం వాళ్లే ఇదంతా దగ్గర ఉండి చేయిస్తున్నారేమోనని అనుమానం పెరిగేలా చేస్తుంది రుద్రాణి. ఇలా చేస్తే.. వాళ్ల ఆస్తులు, అప్పుల గురించి తెలిసి మనం డబ్బులు ఇస్తామని అనుకుంటున్నారో ఏమోనని ఎక్కిస్తుంది. దీంతో అపర్ణ ఆలోచనల్లో పడుతుంది.

మరోవైపు.. రాజ్ ఆఫీసులో ఉద్యోగుల మీద ఫైర్ అవుతాడు. అప్పుడే ఓ వ్యక్తి.. సర్.. సర్ అనుకుంటూ వస్తాడు. మీరు అర్జంట్ గా ఒక న్యూస్ చూడాలి సర్ అని టీవీ ఆన్ చేస్తాడు. కావ్య మాట్లాడిన న్యూస్ చూపిస్తాడు. అక్కడే ఉన్న రాహుల్.. అబ్బో ప్రెస్ మీట్ పెట్టిందా, ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటానని అనుకుంటాడు రాహుల్. ఓ వ్యక్తికి మెసేజ్ చేస్తాడు. వెంటనే రాజ్ కు ఫోన్ చేసి.. నేను చెప్పినట్టుగా మాట్లాడమని సందేశం పంపిస్తాడు. అప్పుడే రాజ్ కు ఫోన్ వస్తుంది. హలో రాజ్ నీది మామూలు బ్రెయిన్ కాదు రాజ్, ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూయించేసవని అవతలి వ్యక్తి అంటాడు.నీ భార్యతో ప్రెస్ మీట్ పెట్టించావని అంటాడు. దీంతో రాజ్ సీరియస్ అవుతాడు.
అప్పుడే రాహుల్ వస్తాడు. నువ్ సైలెంట్ గా ఉంటే.. ఇలానే జరుగుతుందని చెబుతాడు. ఆడవాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ మన ఇంటి పరువును బయటపెట్టేంత కాదని రాజ్ కు వివరిస్తాడు. తనకు వచ్చిన కంట్రాక్ట్ గానుక దూరమైతే.. కావ్యకు మరో మార్గం లేక.. నిన్నే వచ్చి హెల్ప్ అడుగుతుందని అంటాడు. మన ఫ్యామిలీ కూడా ఎటువంటి అవసరాలు ఫేస్ చేయాల్సిన అవసరం లేదని వివరిస్తాడు.కావ్య మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని మండిపడిపోతుంటాడు రాజ్. మేనేజర్ కు కాల్ చేసి.. ఓ పని చేయాలని వివరిస్తాడు.

ఇంకోవైపు కనకం ఇంట్లో మూర్తి హడావుడి చేస్తాడు. ఈలోపు అపర్ణ కనకం ఇంటికి వస్తుంది. మీ కూతురు మా పరువు తీస్తుంటే.. మీరు ఇంట్లో మార్యాద చేస్తున్నారా అని మండిపడుతుంది. మట్టికి రంగులు వేయడంపై మండిపడుతుంది అపర్ణ. మీరు అందరూ ఒప్పుకున్నారని మా అమ్మాయి చెప్పిందని మూర్తి వివరిస్తుండగా.. మట్టికి రంగులు వేస్తానంటే మాలాంటి కోటీశ్వరులు ఒప్పుకుంటారా అని అపర్ణ ఎదురుప్రశ్నిస్తుంది. అది మాకు ఎంత చిన్నతనంగా ఉంటుందని మరోసారి అంటుంది. మీ అమ్మాయికి బుద్ధి లేదు.. ఇంత వయసు వచ్చింది మీకు కూడా లేదా అని అంటుంది. అక్కడ కాసేపు రచ్చ జరుగుతుంది.

ఇలాంటివి జరుగుతాయనే.. పెళ్లి తర్వాత.. మీతో సంబంధం ఉండొద్దని కండీషన్ పెట్టానని అంటుంది అపర్ణ. కానీ నా మాటకు విలువ ఇవ్వకుండా.. మీ కూతురితోపాటు, నా కొడుకును దగ్గర చేసుకోవాలని చూశారని ఫైర్ అవుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో నువ్ ఇక్కడ ఉండాలంటే.. అందరికీ నచ్చినట్టుగా నడుచుకోవాలని చెబుతుంది అపర్ణ. నేను ఇంటి పరువు కాపాడనని చెబుతుంది కావ్య. నా నిర్ణయాన్ని మార్చుకోనని చెబుతుంది. దీంతో అపర్ణ సీరియస్ అవుతుంది. నీ నిర్ణయాన్ని మార్చుకోనప్పుడు నీకు ఈ ఇంటికి సంబంధం లేదని, ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని అంటుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు.


Click it and Unblock the Notifications











