Brahmamudi August 17th: అపర్ణకు గట్టి కౌంటర్ ఇచ్చిన కావ్య... భార్యపై చేయిచేసుకోబోయిన రాజ్
మా టీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ తో దూసుకుపోతున్న ధారావాహిక బ్రహ్మముడి. ఇక ఈ సీరియల్ ఈరోజు కూడా ఆసక్తికరంగా సాగింది. ఈరోజు ఎపిసోడ్ లో రాజ్ దూరం చేసిన బొమ్మల కాంట్రాక్ట్‌ను తిరిగి అతడి చేతే సొంతం చేసుకుంటుంది కావ్య. ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌పై రాజ్ చేత సాక్షి సంతకం చేయిస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
కావ్యను పుట్టింటిలో దించే బాధ్యతను రాజ్‌కు అప్పగిస్తారు దుగ్గిరాల సీతరామయ్య. తనకు ఇష్టం లేకపోయినా తాతయ్య మాటలకు కట్టుబడి కావ్యను పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తాడు రాజ్. కావ్య బ్యాగుతో సహా కారులో నుంచి దిగడంతో అత్తింటివారు ఆమెను శాశ్వతంగా పుట్టింటికి పంపించారని అపోహపడి కన్నీళ్లు పెట్టుకుంటారు కనకం, కృష్ణమూర్తి. కాంట్రాక్ట్ తో పాటు కావ్య కాపురం కూడా ముక్కలైపోయిందని కనకం, కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతారు.

రాజ్ దగ్గరకు వచ్చి... మాదే తప్పు... మా అమ్మాయిని వదిలేయకండి అంటూ బతిమిలాడుతారు కనకం, మూర్తి. వాళ్లు ఏం మాట్లాడుతున్నారో రాజ్‌కు అర్థం కాదు. తల్లిదండ్రులను మాటల్ని ఆపడానికి కావ్య ఎంత ప్రయత్నించిన వారి మాటల ప్రవాహం ఆగదు. తాను శాశ్వతంగా పుట్టింటికి రాలేదని, తాతయ్య గారే తనను విగ్రహాలు తయారు చేయడానికి పుట్టింటికి పంపించారని తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరిస్తుంది కావ్య. రాజ్ తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాడని తల్లిదండ్రుల భయాల్ని తొలగిస్తుంది కావ్య. బొమ్మల కాంట్రాక్ తిరిగి మీకే ఇవ్వమని కాంట్రాక్టర్‌తో చెప్పానని రాజ్ అంటాడు. అతడి మాటలతో కనకం, కృష్ణమూర్తి సంతోషంలో మునిగిపోతారు.

రాజ్‌ను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కనకం. కానీ రాజ్ మాత్రం అర్జెంట్ పని ఉందని రానని అంటాడు. కావ్య కిందపడేలా రాజ్ ప్లాన్ చేసిన వీడియోను అతడికి చూపించి బెదిరిస్తుంది కావ్య. ఆ వీడియో కారణంగా కావ్య చెప్పినట్లుగానే ఆమె ఇంట్లోకి వస్తాడు రాజ్. టిఫిన్ చేయడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు సీతారామయ్య, ఇందిరాదేవి దగ్గరకు అపర్ణ వస్తుంది. కావ్యను ఎక్కువగా సపోర్ట్ చేస్తూ తప్పు చేస్తున్నారని వారితో అంటుంది. వారి మధ్య అనుబంధం బాగుండాలనే కావ్యతో రాజ్ ను పంపించాను అని చెప్తారు.అపర్ణకు కాస్ ఇస్తాడు సీతారామయ్య.

మరోవైపు అపర్ణ... కావ్య గురించి ఆలోచిస్తుంటే.. రుద్రాణి వచ్చి... లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొడుతుంది. కావ్యతో పాటు కనకం కలిసి రాజ్ మనసును తప్పకుండా మార్చేస్తారని అపర్ణతో అంటుంది రుద్రాణి. ఆమె మాటలతో అపర్ణ టెన్షన్ మరింత పెరుగుతుంది. రాజ్ కోసం కావ్య ఉప్మా చేస్తుంది. ఉప్మా తినడం ఇష్టం లేకపోవడంతో సెటైర్స్ వేస్తాడు రాజ్. కావ్యను కూడా తినమని అంటాడు. రాజ్ తన కోసం పెట్టిన ఉప్మాను బలవంతంగా తానే కావ్యకు తినిపిస్తాడు. కూతురిపై భర్త కురిపిస్తున్నది ప్రేమ అనుకొని కనకం సంతోషపడుతుంది. వాళ్లకు నిజం చెప్పాలని రాజ్ అనుకుంటాడు. కానీ వాళ్లు మాత్రం రాజ్ మాట వినకుండా లోపలికి వెళ్లిపోతారు.

కావ్యకు తిరిగి కాంట్రాక్ట్ ఇవ్వడానికి కాంట్రాక్టర్ వస్తాడు. కానీ మీ కాంట్రాక్ట్ మాకు వద్దని అతడితో అంటుంది కావ్య. కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు అది మాకే ఉంటుందని, ఎలాంటి వాళ్లు ఫోన్ చేసి చెడగొట్టిన సరే కాంట్రాక్ట్‌ను వదిలిపెట్టనని అగ్రిమెంట్‌ను రాసివ్వమని అంటుంది. విగ్రహాలు చాలా అవసరం ఉండటంతో కావ్య చెప్పినట్లుగానే కాంట్రాక్టర్ అందుకు ఒప్పుకుంటాడు. ఆ అగ్రిమెంట్‌పై రాజ్ చేతనే సాక్షి సంతకం చేయిస్తుంది. తనను సాక్షిని చేసిన కావ్యపై కోపంతో రగిలిపోతాడు రాజ్. కానీ విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు.

ఆ తర్వాత ఉప్మా తినమని రాజ్ వెంటపడుతుంది కావ్య. కానీ రాజ్ తాను ఉప్మా ఎట్టి పరిస్థితుల్లో తిననని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ ప్రోమోలో.... తన కొడుకును నీ కుటుంబంలో కలుపుకొని కూలీ వాడిగా మార్చితే ఊరుకునేది లేదని కావ్యకు వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. నేను డిజైన్స్ వేసి ఆ డబ్బును పుట్టింటికి ఇస్తే నచ్చదు. మా ఆయన నన్ను సమర్థించినా తట్టుకోలేరు. ఎక్కడ తనను రాజ్ భార్యగా ఒప్పేసుకుంటాడో అని మీరు భయపడుతున్నారు. నిజంగా మీరు రాజ్‌కు కన్నతల్లేనా అని అపర్ణను ప్రశ్నిస్తుంది కావ్య. ఆ మాట విని కావ్యపై చేయి ఎత్తుతాడు రాజ్. ఏం జరిగిందో తెలియాంటే.. రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











