Brahmamudi October 5th:బయటపడిన రాజ్ బండారం.. షాక్‌లో కావ్య... ఏం జరగనుంది?

బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో పూజ చేసేందుకు జంటలు పోటీ పడుతుంటాయి. ఇక రాహుల్, స్వప్న.. ఆర్చరీ గేమ్ లో పాల్గొంటారు. కానీ కొట్టలేకపోతారు. ఇక స్వప్న చిరాకు పడుతుంది. నువ్వు కదలడం వల్లే కొట్టలేకపోయాను అని రాహుల్ చెప్తాడు. నేను ఎక్కడ కదిలాను అని స్వప్నఅంటుంది. ఇక నెక్ట్స్ ఎవరు అంటే నేను అని కల్యాణ్ అంటాడు. ఇక కల్యాణ్ అప్పుతో కలిసి ఆడాలి అనుకుంటాడు. కానీ అనామిక జలాసీ ఫీల్ అయి... మనం కదా జంట మనం ఆడుదాం అని చెప్తుంది. ఇక అప్పు తప్పుకుని కల్యాణ్ తో అనామిక ఆడుతుంది.

కాబోయే వైఫ్ ను పక్కన పెట్టుకుని మీ ఫ్రెండును పిలుస్తారా అని అనామిక అంటుంది. కల్యాణ్ అప్పుడే జలాసీ మొదలైందా అని మాట్లాడుతుండగా... ఆడండి అంటూ సీతారామయ్య అంటాడు. ఇక అనామిక, కల్యాణ్ ఆర్చరీ గేమ్ లో కొట్టలేకపోతారు. ఇక అనామిక తెగ ఫీల్ అవుతుంది. సీతారామయ్య ఒక్కరు కొట్టలేరా అని అంటాడు. తాతాయ్య నీ వారసుడిగా నేను కొడతాను అంటూ రాజ్ కావ్య ముందుకు వస్తారు. అన్యయ్య గెలవాలి అని కల్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. మనం గెలిచి ఉంటే మనమే పూజ చేసే వాళ్లం కదా అంటే.. అన్నయ్య గెలిస్తే నేను గెలిచినట్లే అంటాడు.

Kavya Shocked in October 5th 2023 Episode number 219 in Brahmamudi Telugu Serial

ఇక రాజ్, కావ్య మధ్య కాసేపు టాప్ అండ్ జెర్రీలా మాట్లాడుకుంటారు. కావ్య రాజ్ మధ్య కాసేపు రొమాన్స్ కూడా జరుగుతుంది. అది చూసి కనకం మురిసిపోతుంది. ఆ బోర్డ్ మధ్యలో ఉన్న పక్షి కన్నును కొట్టాలని చెప్తాడు. చూస్తూ చూస్తూ పక్షికన్నును ఎలా కొట్టాలి అని కావ్య అనగా.. రోజు నా రక్తం తాగుతావ్ కదనే.. నా కన్ను అనుకుని కొట్టు అని రాజ్ అంటాడు. అయితే దాన్ని గట్టిగా కొడతాను అని కావ్య అంటుంది. ఏంటి అని రాజ్ అనగా... కావ్య మనం గెలవాలి అని చెప్తుంది. ఇక ఇద్దరు కలిసి ఆ గేమ్ లో గెలుస్తారు. సంతోషంలో కావ్య రాజ్ ను హగ్ చేసుకుంటుంది కావ్య.

Kavya Shocked in October 5th 2023 Episode number 219 in Brahmamudi Telugu Serial

ఇక మీరే పూజ చేయండి అని రాజ్ కావ్యకు సీతారామయ్య చెప్తాడు. ఇక కావ్య ఆ చీటీని కొట్టేయాలని తెగ ప్రయత్నం చేస్తుంది. ఆ టైంకు ఇందిరాదేవి పిలుస్తుంది. ఆ చీటీని కొంగుకు కట్టుకుని వెళ్తుంది. ఇక అప్పు సీరియస్ గా ఉంటుంది. ధాన్య లక్ష్మి వచ్చి.. ఈ పూలు గుమ్మానికి కట్టు అని అప్పుకు చెప్తుంది. సరే అని అప్పు పూలను తీసుకుని పోతుంది. అప్పుడే కల్యాణ్ వచ్చి.. అప్పుతో మాట్లాడుతాడు. అనామిక గురించి చెప్తాం అంటే.. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని అడుగుతాడు.

Kavya Shocked in October 5th 2023 Episode number 219 in Brahmamudi Telugu Serial

దానికి అప్పు సీరియస్ అవుతుంది. నేనేం నీ అసిస్టెంట్ కాదు... అని చెప్తుంది. నీ అనామికతో హ్యాపీగా ఉండు అని చెప్తుంది. మెల్లగా మాట్లాడు బ్రో అంటాడు కల్యాణ్. అప్పు మరింత సీరియస్ అవుతుంది. నేను అనామికను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అంటే.. ఎవరినైనా చేసుకో నాకేందుకు అని అంటుంది అప్పు. మరోవైపు అనామిక పిలుస్తూ ఉంటుంది. ఇక కల్యాణ్ అక్కడి నుంచి వెళ్తాడు.

Kavya Shocked in October 5th 2023 Episode number 219 in Brahmamudi Telugu Serial

ఇక రాజ్, కావ్య కలిసి పూజ చేస్తారు. అనామిక జలాస్ ఫీల్ అవుతు ఉంటే నెక్ట్స్ ట్రై చేద్దాం అంటాడు కల్యాణ్. ఇక కావ్య పూజ పూర్తి చేసి అందరికి హారతి ఇస్తుంది. కావ్య డాక్యూమెంట్స్ తీసుకువచ్చి రాజ్ చేతుల మీదుగా ఇప్పించాలని అనుకుంటుంది. అదే విషయం రాజ్ కు చెప్తే ఇంత మంది ముందు ఎందుకు అంటాడు. ఇక ధాన్య లక్ష్మి మీ ముచ్చట్లు ఆగవా అంటే.. అదేం లేదని విషయం చెప్తాడు. ఇక సీతారామయ్య ఇవ్వు రాజ్ అంటాడు. ఇక కనకం, మూర్తిలను పిలిచి రాజ్ ఆ డాక్యూమెంట్స్ ఇస్తాడు.

Kavya Shocked in October 5th 2023 Episode number 219 in Brahmamudi Telugu Serial

మీకు ఇకపై ఏ సమస్యలు రాకూడదని ఆ దేవుడిని కోరుకుంటూ మీ ఇంటి పేపర్లు మీ చేతిలో పెడుతున్నాను అని రాజ్ చెప్తాడు. ఇక మూర్తి మీరు అండగా ఉండగా మాకు ఏ సమస్యలు రావని చెప్తాడు. ఇది చూసి రాహుల్, స్వప్న కుల్లుకుంటారు. మూర్తి సంబురపడిపోతాడు. కనకం కూడా ఎమోషన్ అవుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో అందరూ కలిసి డ్యాన్సులు చేస్తారు. చివర్లో ఆ చీటీని చదివి కావ్య షాక్ అవుతుంది. కన్నీటి పర్యంతం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X