ఆ రిలేషన్ నచ్చలేదు... రిటర్న్ ఇచ్చేస్తానంటూ బుల్లితెర నటి కావ్యశ్రీ షాకింగ్‌గా!
బుల్లితెర నటులు నిఖిల్ మలియాక్కల్, కావ్యశ్రీలు ఒకప్పుడు ప్రేమికులుగా హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ జంట విడిపోయింది. పెళ్లి చేసుకుని గుడ్‌న్యూస్ చెబుతారు అనుకుంటే విడిపోయి అభిమానులకు షాకిచ్చారు కావ్య- నిఖిల్. కనీసం ఒకరి పేరు మరొకరు ఎత్తడానికి కూడా ఇద్దరూ ఒప్పుకోవడం లేదు. పలు ఈవెంట్స్‌లో వీరి ప్రవర్తన చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా కావ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వివరాల్లోకి వెళితే..
అలా తెలుగు ఇండస్ట్రీలోకి
బెంగళూరులో పుట్టి పెరిగిన కావ్య శ్రీ తొలుత కన్నడ టెలివిజన్ రంగంలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. నీలి, నాయకి, మహాకాళి తదితర సీరియల్స్‌తో సొంత రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఫేమ్‌తో తెలుగులోనూ కావ్యకి అవకాశాలు వచ్చాయి. 2019లో స్టార్ మాలో ప్రసారమైన గోరింటాకు సీరియల్‌తో తెలుగు ఇండస్ట్రీలో ఆమె అడుగుపెట్టారు. ఆ తర్వాత కోయిలమ్మ, గువ్వా గోరింకా తదితర సీరియల్స్‌తో తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యారు.

నిఖిల్‌తో ప్రేమాయణం, బ్రేకప్
గోరింటాకు సీరియల్‌లో తన సహ నటుడు, బిగ్‌బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ మలియాక్కల్‌తో కావ్యకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. షూటింగ్స్‌లో పాల్గొంటూనే చాటుగా తమ ప్రేమాయణం సాగించారు. కొద్దిరోజుల అనంతరం తమ బంధాన్ని బహిరంగంగానే తెలియజేశారు. ఆ తర్వాత పలు టీవీ షోలు, ఈవెంట్స్‌లలో కావ్య, నిఖిల్‌లు జంటగా పార్టిసిపేట్ అయ్యారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ నిఖిల్- కావ్యలు విడిపోయారు. ఒకే కార్యక్రమంలో కలిసి పాల్గొంటున్నా ఒకరి ముఖం మరొకరు తిప్పుకుని వెళ్లిపోవడంతో బుల్లితెర వర్గాలు, ప్రేక్షకులు షాక్ అయ్యారు.
నిఖిల్‌తో ఎడముఖం పెడముఖంగా
ప్రేమికుల మధ్య గొడవలు, మనస్పర్థలు సహజమేనని ఇప్పుడు విడిపోయినా ఏదో ఒకరోజు నిఖిల్ - కావ్యలు మళ్లీ కలుస్తారని అంతా అనకున్నారు. ఈ నేపథ్యంలో నిఖిల్ షాకిచ్చాడు. కావ్యతో రిలేషన్‌పై ఆమె పేరెత్తకుండా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఎవరి జీవితాలు వారివేనని .. తనను ఎవరితోనూ కలపొద్దని, ఎవరి పోస్టులకు తనను ట్యాగ్ చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
సోలో లైఫే సో బెటర్
అటు కావ్యశ్రీ కూడా నిఖిల్ పట్ల ఇదే వైఖరితో ఉన్నట్లుగా తెలుస్తోంది. నీకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అని అడగ్గా.. అసలు ఈ జన్మకి పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోవాలని ఉందని పలుమార్లు వ్యాఖ్యానించింది. ఆ తర్వాత మరో షోలో నేను ఎక్కడికి వెళ్లినా ఓ వ్యక్తి గురించి అడుగుతున్నారు.. అలా అడుగుతున్న వారికి కూడా నాలాంటి గతి పడుతుందని కావ్యశ్రీ సీరియస్ అయ్యారు. తాజాగా మరోసారి తన ప్రేమ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కావ్య. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం ఈసారి న్యూఇయర్ థీమ్‌తో సిద్ధమైంది.
కొత్త సంవత్సరంలో కొత్త ప్రేమకథ
ఒక మెషిన్‌ను తీసుకొచ్చిన శ్రీముఖి.. ఆ మెషిన్‌లో ఒక కాయిన్ వేస్తే.. 2026లో ఎలా ఉండబోతుందో మీకు బయటకు చీటీ రూపంలో వస్తుందని చెబుతుంది. ముందుగా అంబటి అర్జున్ మెషిన్ దగ్గరికి వచ్చి కాయిన్ వేయగా... 2026లో అంబర్‌పేటలో జరిగే బాడీ బిల్డింగ్ పోటీలలో మీరు విజేతగా నిలుస్తారని వస్తుంది. ఆ తర్వాత కావ్యశ్రీ వచ్చిన కాయిన్ వేయగా.. ఒక చీటి వస్తుంది. ఈ 2026లో మళ్లీ మీ జీవితంలోకి కొత్త అందమైన ప్రేమకథ మొదలవబోతుందని శ్రీముఖి చదివి వినిపిస్తుంది. అది నాకొద్దంటూ కావ్యశ్రీ చేతులు అడ్డంగా ఊపుతుంది.
నాకు ఆ రిలేషన్ వద్దంటూ
అటు ఈ మాటలు వినగానే కంటెస్టెంట్స్ అరుపులు కేకలతో గోల చేస్తారు. ఆమె లైఫ్‌లోకి కొత్త అతను వస్తే.. నీ ఎగ్జయిట్‌మెంట్ ఏంటీ అంటూ శ్రీముఖి కౌంటర్ వేస్తుంది. దాంతో నాకిది నచ్చలేదు.. నేనే రిటర్న్ ఇచ్చేస్తున్నానని కావ్య వాటిని మెషిన్‌లో తిరిగి వేస్తుంది. అయితే మెషిన్‌లో నుంచి ఈసారి ఏకంగా నాలుగైదు చీటిలు రావడంతో కావ్యశ్రీ షాక్ అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. కావ్యశ్రీ ఎలాంటి కామెంట్స్ చేసిందో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











