Brahmamudi October 3rd: రాజ్ చీటీలో రాసింది కావ్య చూస్తుందా... ఆ విషయం బయటపడనుందా.. ఉత్కంఠగా ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ లో కావ్య ప్లానింగ్ తో అపర్ణతోనే కనకాన్ని ఇంటికి పిలిపించుకుంటుంది. అలా పండక్కి అపర్ణ స్వయంగా కనకంకు ఫోన్ చేసేలా చేస్తుంది. వినాయక చవితి సందర్భంగా ఇంట్లో విగ్రహం పెట్టి.. అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక వారి కోరికలను చీటిల్లో రాసి.. ఒక దాంట్లో వేస్తారు. ఇక రాజ్ ఏం కోరికలు రాశారా అని... కావ్య తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ రాజ్ ఏం రాశాడు.. ఆమె ఆ చీటి చదివిందా.. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వినాయక చవితికి ఇంటికి రమ్మని కనకానికి కావ్య చెబుతుంది. కానీ నేను రాను అంటుంది. మీ అత్తయ్య మొహం తిప్పుకుంటుందని చెబుతుంది. ఇక మా అత్తయ్యతోనే నిన్ను పిలిపిస్తాను అని కావ్య చెబుతుంది. ఇక కావ్య దానికి ఓ అద్భతమైన ప్లాన్ వేస్తుంది. అందరూ డైనింగ్ హాల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు కావ్య రివర్స్ ప్లాన్ వేస్తుంది.

రాజ్ తో రేపు పుట్టింటికి వెళ్తాను అత్తయ్య అంటూ కావ్య డ్రామా ప్లే చేస్తుంది. దానికి ఎందుకు అంటూ అపర్ణ అనగా.. మా అమ్మనాన్నలకు ఇంటి పేపర్లు మా ఆయనతో ఇప్పిస్తాను అంటూ చెప్పుకువస్తుంది కావ్య. దీంతో వాళ్లను ఇక్కడికే రమ్మను మీరు వెళ్లడం దేని అంటుంది అపర్ణ. మా అమ్మ మొండిది.. ఎవరు పిలిచినా రాదు అంటూ రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది కావ్య. ఎందుకు రాదో నేను చూస్తాను అంటూ కనకానికి అపర్ణ కాల్ చేసి రావాలని అర్డర్ వేస్తుంది. ఇది చూసిన అక్కడి వాళ్లంతా షాక్ అవుతారు. ఇక రుద్రాణి మా వదిన ఓ తింగరిది అనుకుంటూ ఉంటుంది.
ఇక మరుసటి రోజు అందరూ రెడి అయి వినాయకుడి విగ్రహ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు చేస్తారు. రాజ్, కావ్య, కల్యాణ్, రాహుల్ అంతా వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్టస్తారు. ఇక ఆ తర్వాత కావ్య బొట్టు పెట్టుకోలేదని అపర్ణ ఫైర్ అవుతుంది. నేను పెట్టుకున్నాను అత్తయ్య ఎక్కడో పడిపోయిందని చెబుతుంది. పెట్టుకుని వస్తాను అత్తయ్య అని కావ్య చెబుతుండగా... ఇందిరాదేవి కల్పించుకుని రాజ్ పెట్టు అని చెప్తుంది. ఇక రాజ్, కావ్య నుదుట కుంకుమ పెడుతాడు. ఇక్కడ వారి మధ్య లవ్ ఫీల్ వచ్చేలా ఓ లవ్ సాంగ్ ప్లే అవుతుంది.

విగ్రహాన్ని ప్రతిష్టించేసాం కాబట్టి కోరికల చిట్టి కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని ఇందిరా దేవి అంటుంది. అదేంటి అని స్వప్న అడగ్గా.. మన మనసులో ఉన్న కోరికలను వినాయకుడి దగ్గర పెట్టుకోవాలని చెబుతుంది. మన కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతుంది. ఇక అందరూ కలిసి ఒక్కో కోరిక రాస్తూ ఉంటారు. ఇక స్వప్న అయితే.. రాహుల్ తో సంసారం బాగుండాలని... ఇంట్లో పెత్తనం తనదే ఉండాలని రాస్తుంది. ఇక రుద్రాణి, రాహుల్... స్వప్న, కావ్య పీడ వదిలి.. ఈ వంశానికి రాహుల్ యువరాజు కావాలని రాస్తారు.

మరోవైపు ధాన్య లక్ష్మి బంగారం కావాలని రాస్తుంది. అపర్ణ.. తన కొడుకు రాజ్ సంతోషంగా ఉండాలని రాస్తుంది. సుభాష్.. కావ్య, రాజ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మరోవైపు ఇందిరాదేవి తను సుమంగలిగా తన బావ చేతిలో చావాలని కోరుకుంటుంది. ఇక సీతారామయ్య మాత్రం తను మునిమనవడిని ఎత్తుకుని చనిపోవాలంటూ రాసుకువస్తారు.

మరోవైపు రాజ్ మాత్రం తను కేవలం తాతయ్య కోసం కావ్యతో ప్రేమగా ఉంటున్నాని.. దీనికి ముగింపు పలుకు దేవుడా అంటూ రాసుకువస్తాడు. అయితే కావ్య అదేంటో తెలుసుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తుంది కానీ తెలుసుకోలేకపోతుంది. ఇక కావ్య మాత్రం మా ఆయన ఏం రాస్తాడో అది నేరవెర్చు అంటూ కోరుకుంటుంది. ఇక ఆ చీటీలన్నీ ఓ హుండీలో వేస్తారు. ఇక కావ్య.. రాజ్ ఏం రాశాడు తెలుసుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తుంది. ఇంతలో వాళ్ల అమ్మనాన్నలు వచ్చారని వెళ్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో అందరూ పూజ చేస్తారు. ఆటలు కూడా ఆడుతారు. టగ్ అండ్ వార్ ఆడగా... ఆ ఆటలో కావ్య రాజ్ పై పడుతుంది. అది చూసిన అపర్ణ రగిలిపోతుంది. మరి కావ్య.. రాజ్ చీటీలో ఏం రాశాడో తెలుసుకుంటాడా.. అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











