Brahmamudi December 2nd: అరుణ్ అడ్రస్ తెలుసుకున్న కావ్య... అందరి ముందు పెళ్లాం కొంగు పట్టుకుని తిరిగిన రాజ్
ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో (డిసెంబర్ 2వ తేదీ) మీ ఆఫీసులో పనిచేసే శృతికి మీకు ఏంటి సంబంధం అని రాజ్ ను కావ్య అడుగుతుంది. తను ఎంప్లాయి.. నేను బాస్ అని రాజ్ చెప్తాడు. అంతేనా ఆ పరిచయం, అంతటితోనే ఆగిందా... అని కావ్య నిలదీస్తుంది. అడిగేదేదో సూటిగా అడుగు అంటాడు రాజ్. మీకు శృతికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో నాకు తెలసిపోయిందని కావ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని రాజ్ సీరియస్ అవుతాడు.
నిజం మాట్లాడుతున్నాను. మీకు శృతికి మధ్య గ్రంథం నడుస్తుందని నాకు పూర్తిగా అర్థం అయిపోయిందని కావ్య అంటుంది. షటప్ పిచ్చెక్కిందా? నాకు తనకు మధ్య ఛీ.. మీ అక్క డ్రామాకు ఒక కామా పెడితే నువ్వో కొత్త డ్రామా మొదలుపెడతావా? పిచ్చిపిచ్చిగా ఉందా? తనతో నాకు సంబంధం ఉండటం ఏంటని ప్రశ్నిస్తాడు రాజ్. ఉందని కావ్య చెప్తుంది. నీ దగ్గర సాక్ష్యం ఉందా అని రాజ్ అడుగుతాడు.

ఉంది అని రాజ్, శృతి క్లోజ్‌గా ఉన్న ఫోటోను చూపిస్తుంది కావ్య. ఆ ఫోటో చూసిన రాజ్ ఆఫీసు ఎంప్లాయితో క్లోజ్ గా ఉంటే సంబంధం ఉన్నట్లా అని రాజ్ అడుగుతాడు. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందనడానికి ఈ ఫోటోనే ప్రూప్ అంటుంది కావ్య. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే దానికి సాక్ష్యం చూపించమని అడుగుతుంది కావ్య. నా దగ్గర అటువంటి సాక్ష్యం లేదని నమ్మితే నమ్ము లేకపోతే లేదు అంటాడు రాజ్. మరి మా అక్క విషయంలో మాత్రం సాక్ష్యాలు ఎలా అడుగుతారు అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. రాజ్ ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు.
కిచెన్‌లో టీ పెడుతున్న కావ్య దగ్గరకు వచ్చి ధాన్యలక్ష్మీ స్వప్న విషయంలో బాధపడుతుంది. నెల రోజుల టైం ఉన్నా ఆ రుద్రాణి అప్పుడే స్వప్నను టార్చర్ పెడుతుందని ఫీలవుతుంది. ఇంతలో కావ్యకు ఫోన్ వస్తుంది. ఫోన్‌లో వ్యక్తి డాక్టర్ అరుణ్ ఇంటి అడ్రస్ పెట్టానని చెప్తాడు. కావ్య వెంటనే రూంలోకి వెళ్లి.. ఏవండి మనం త్వరగా బయటికి వెళ్లాలని రాజ్ కు చెప్తుంది. నాకు ఆఫీసులో పనుంది నేను రాను అని రాజ్ అంటాడు.
అయ్యో అది కాదండి ఇది చాలా ఇంపార్టెంట్.. ఆ అరుణ్ గాడి అడ్రస్ దొరికిందండి. ఆలస్యం చేస్తే మొన్నటిలా వాడు తప్పించుకోవచ్చు.. అని కావ్య అంటుంది. నేను రానంటే రాను నాకు ముంబై నుంచి క్లయింట్స్ వచ్చారని రాజ్ అంటాడు. చూడండి నెల వరకు ఆగితే ప్రతిరోజు మీ అత్తయ్య, రాహుల్ మా అక్కను టార్చర్ పెడుతున్నారని కావ్య అంటుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరిద్దామనుకుంటే మీరేమో ఇలా ఉన్నారని చెప్తుంది. నేను చేసేదంతా మన ఫ్యామిలీ సంతోషం కోసమేగా అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.
కావ్య వెళ్లిపోగానే నిజమే ఈ కళావతి చెప్పినట్లు నెల రోజులు ఆగడం కన్నా ఇప్పుడే వెళ్లడం బెటర్ అనుకుని కిందకు వస్తాడు రాజ్. హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటారు. ఇంతలో రాజ్ కిందకి వచ్చి కావ్య కోసం కిచెన్‌లోకి వెళ్లడం చూసి షాక్ అవుతారు. రాజ్‌ను చూసి చూడనట్లు ఉన్న.. ఏం కావాలండీ. అని కావ్య అడుగుతుంది. నువ్వే కావాలి అని రాజ్ అంటాడు.
ఏంటి ఏమన్నారు నిజమా? ఎన్నాళ్లకీ మీలో వీణ తీగలు మీటగలిగాయండని కావ్య అంటుంది. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. అనగానే కావ్య నేను విననంటే వినను.. అంటూ టీ తీసుకుని హాల్లోకి వస్తుంది. రాజ్ కూడా కావ్య వెనకాలే తిరగుతాడు. రాజ్ పరిస్థితి చూసి అందరూ నవ్వుకుంటారు. కావ్య మళ్లీ కిచెన్ లోకి వెళ్లగానే బయటికి వెళ్దాం అన్నావుగా పద అని కావ్య చేయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్తాడు రాజ్. ఇదంతా చూస్తున్న ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోతారు.
కనకం, అప్పు .. స్వప్న కోసం వంటకాలు తీసుకుపోయేందుకు సర్ధుకుంటారు. ఇంతలో మూర్తి అక్కడకు వచ్చి అంటే నేను వద్దనా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నావన్నమాట అని మూర్తి అంటాడు. మీరు కోపంతో కుదరదని తప్పుకోవచ్చు కానీ తల్లిగా నేను చేయాల్సింది చేసి తీరాలి కదయ్య. కూతురు తల్లి అవుతుందని నీకు సంబరంగా ఉందేమో..కానీ స్వప్నకు అలాంటివేం ఉండవు తన జీవితమా.. చెల్లెలి జీవితమా అనే మాటొస్తే.. క్షణం కూడా ఆలోచించకుండా కావ్యను బలిపశువును చేసింది. అలాంటిది నిన్నేం చేస్తుందో ఊహించుకో.. అని మూర్తి అంటాడు.
కనకం ఆలోచనలో పడిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో కనకం దుగ్గిరాల ఇంటికి వస్తుంది. సంతోషంగా స్వప్నతో మాట్లాడుతుంది. రుద్రాణి ఎంటర్ అయి.. మీ కూతురుని తీసుకెళ్లడానికి వచ్చావా అంటుంది. ఇప్పుడెందుకు అని అంటుంది కనకం. మీ కూతురు తల్లి కాబోతుంది.. నా కొడుకు తండ్రి కాదు.. ఇంకెవడో తండ్రి అవుతున్నాడు అని చెప్తుంది రుద్రాణి. ఆ మాటలకు ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











