Brahmamudi July 29th: స్వప్నకు నూరిపోస్తున్న రాహుల్... కావ్య ఇంటి సమస్య తెలుసుకున్న రాజ్
బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ కల్యాణ్, అప్పు జాగింగ్ చేస్తుండగా ప్రారంభం అవుతుంది. ఇక అక్కడికి అప్పు ఫ్రెండు ఒకడు వచ్చి.. స్వప్న యాడ్ లో నటించడం గురించి తప్పుగా మాట్లాడుతాడు. దీంతో కోపంతో అప్పు వాడిని కొట్టబోతుంటే.. కల్యాణ్ ఆపుతాడు. ఇక సీన్ కట్ చేస్తే... ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మౌనంగా ఉంటారు. దానికి రుద్రాణి ఏంటి ఇది సంతాప సభలా ఉన్నట్లు ఉందని అంటుంది.
దానికి అపర్ణ.. నీ కోడలు చేసిన దానికి మాటలు కూడా రావడం లేదులే అని సమాధానం చెబుతుంది. రుద్రాణి మాట్లాడుతూ... నా కోడలు అంత పెద్ద తప్పు చేస్తే ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు. నేనేమైనా బతిమలాడుకున్నాన అని అంటుంది. తప్పు చేసే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించే పనైతే ముందు నిన్నే పంపించాలని అపర్ణ కౌంటర్ ఇస్తుంది. ఇంద్రాదేవి కల్పించుకుని... అపర్ణ చెప్పిన దాంట్లో తప్పు అనలేదు. కోడలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకుని మందలించాలి. అంతే కానీ ఇంట్లో నుంచి పంపించి కొడుకు జీవితాన్ని నాశనం చేయడం కాదు అని అంటుంది.

ఇక అక్కడి వచ్చిన రాజ్... ఆ టాపిక్ ఈ పూటతో ముగింపు పలకండి. ఇక మీరెవరూ ఇబ్బందిగా ఫీల్ అవాల్సిన పని లేదు. ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఆ యాడ్ తీసిన వాళ్ళకి రూ.30 లక్షలు ఇచ్చి టెలికాస్ట్ కాకుండా బ్యాన్ చేయించాను.. అని చెప్తాడు. అయితే ఇక ఆ యాడ్ ఎందులోనూ రాదా? అని ఇంద్రాదేవి అంటుంది. రాదు నానమ్మ అంటాడు రాజ్. ఇది విన్న స్వప్న.. కోపంగా రాజ్ మీద విరుచుకుపడుతుంది. ఆ యాడ్ ని బ్యాన్ చేయించావా? ఎవరిని అడిగి చేశావ్ అని ఫైర్ అవుతుంది. నువ్వు ఎవరిని అడిగి చేశావ్ అని రాజ్ అడగ్గా... అది నా పర్సనల్ అని సమాధానం చెబుతుంది.

నీ పర్సనల్ ఈ ఇంటి పరువు తీసేలా ఉండకూడదని రాజ్ అనగా... నీకు అంత కష్టంగా ఉంటే చూడకు. అంతే కానీ నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు అని స్వప్న అంటుంది. ఇక కావ్య కల్పించుకుని... ఏంటే మాట్లాడుతున్నావ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఆయన నా భర్త తనని ఏమైనా అంటే మర్యాదగా ఉండదు. పళ్ళు రాలగొడతాను. నువ్వు ఒక ఆడదానివని, ఈ ఇంటి కోడలివని అన్నీ మర్చిపోయి వెళ్ళి పది మంది పది రకాలుగా మాట్లాడుకునేలా చేస్తే నా భర్త దాన్ని సరి చేసి నీ పరువు నిలబెట్టాడు. అలాంటి మనిషిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నాలుక కోసేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది.

ఇక స్వప్న, కావ్యల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. స్వప్నతో రాజ్ కు సారీ చెప్పించుకుంది కావ్య. ఇక కావ్య మాటలకు స్వప్న కోపంగా ఇంట్లోని వస్తువులను విసిరిపారేస్తుంది. ఇదే రైట్ టైమ్ రాజ్, కావ్య మీద కోపంతో రగిలిపోతుంది.. తనకి మరింత నూరిపోసి రెచ్చగొట్టమని రాహుల్ ని రుద్రాణి పంపిస్తుంది. కావ్య రాజ్ దగ్గరకి వచ్చి యాడ్ బ్యాన్ చేయించినందుకు థాంక్స్ చెప్తుంది. ఫ్యామిలీ పరువు కోసం యాడ్ తీయించేశానని థాంక్స్ ఏమీ వద్దని అంటాడు. సరే అయితే నా థాంక్స్ నాకు ఇచ్చేయమని అంటుంది. అది ఎలా కుదురుతుందని అంటాడు. మళ్ళీ సాటి మనిషి దగ్గరకి వచ్చి కాసేపు రాజ్ ని ఆడుకుంటుంది.

స్వప్న గాజులు తీసుకొచ్చి రాహుల్ కి ఇచ్చి వేసుకుని తిరగమని దెప్పిపొడుస్తుంది. నేను నీ భార్యని. నేను నటించిన యాడ్ రాజ్ తీసేయిస్తుంటే చూస్తూ కూర్చున్నావ్. ఊరికే ఎందుకు ఈ గాజులు వేసుకుని కూర్చో. అంతకమించి ఇంకేం చేయగలవు. నీకు కనీసం ఇంట్లో మాట్లాడే స్వాతంత్ర్యం కూడా లేదు. అందుకే రాజ్ నా ఆశలని సర్వనాశనం చేశాడు.. అని స్వప్న ఫైర్ అవుతుంది. రాహుల్ మాట్లాడుతూ... రాజ్ ని మాత్రమే ఎందుకు అంటున్నావ్ మీ అక్క కూడా అందిగా. రాజ్ కి యాడ్ బ్యాన్ చేయించమని సలహా ఇచ్చింది కావ్య. తను నీ ఆశలకు అడ్డుగోడ కడుతుంది అని లేనిపోనివి నూరిపోస్తాడు.
అది నాకు ఇంటి గౌరవం పేరుతో అడ్డు పడుతుంది. నేను ఎక్కడ సెలెబ్రెటీ అవుతానని కుళ్ళుతో ఈ పని చేయించింది. నేను ఏంటో చూపిస్తా అంటూ స్వప్న కోపంగా ఊగిపోతుంది. ఇక కావ్య ఈ ఇంట్లో ఉన్నంత కాలం మనం బానిసలుగా బతకాలి అంటాడు రాహుల్. నా వరకు వస్తే నా చెల్లి అని కూడా చూడను అని కావ్య అంటుంది. ఇక మరోవైపు కనకం ఇంటికి చంపక్ లాల్ తన అప్పు తీర్చమని.. 6నెలలు గడువు ఇస్తాడు. రేపటికల్లా 50వేల వడ్డీ కట్టాలని వార్నింగ్ ఇస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమోలో.. కావ్యకు.. ఇంటి అప్పు గురించి కల్యాణ్ చెబుతాడు. ఇక అది విన్న రాజ్... కావ్య సమస్యలు తెలుసుకుంటాడు.


Click it and Unblock the Notifications











