Brahmamudi July 28th: యాడ్ బయటకు రాకుండా చేసిన రాజ్... అక్కా, చెల్లెళ్ల మధ్య వార్!

ఈరోజు బ్రహ్మముడి సీరియల్.. స్వప్న యాడ్ గురించి దుగ్గిరాల ఇంట్లో గొడవ జరుగుతుండటం నుంచి ప్రారంభం అవుతుంది. ఇంట్లో అందరినీ ఎదిరించి మాట్లాడుతుంటే కనకం వచ్చి కూతురి మీద చెయ్యి ఎత్తుతుంది. ఆది దంపతుల ముందు నిలబడి నువ్వు చేసిన ఘనకార్యం సమర్థించుకుంటున్నావా? అంటూ కనకం ఫైర్ అవుతుంది. ఇంకొక మాట మాట్లాడిన నరికి పారేస్తాను. సీతారామయ్య దంపతుల దగ్గరకి వెళ్ళి చేతులెత్తి దణ్ణం పెట్టి క్షమించమని అంటుంది కనకం.

తన పెంపకం వల్లే ఇలా తయారైంది అంటూ.. వాళ్లకి సర్ధి చెబుతుంది. మీ సంస్కారానికి నమస్కారం చేయడం తప్ప ఏమి చేయలేను. నన్ను క్షమించండి అంటూ కనకం ప్రాదేయ పడుతుంది. ఇక సీతరామయ్య.. ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయటకి పంపించేలా ఈ కుటుంబం ఎప్పుడు చేయదు అంటాడు. ఇక వెళ్లిపోదాం అని కనకంతో కృష్ణమూర్తి అనగా... ఏదో పని మీద వచ్చి మాట్లాడకుండా వెళ్తున్నారని శుభాష్ అంటాడు.

Kavya warns swapna about her life in July 28th 2023 Episode number 160 in Brahmamudi Telugu Serial

సంప్రదాయం ప్రకారం కూతురు కడుపుతో ఉందని చీర, సారె తీసుకొచ్చాము అని కనకం చెబుతుంది. సూడిదలు తెచ్చారా? ఇవ్వకుండానే వెళ్తున్నారే. నీ కూతురు ఒడి నువ్వే నింపాలి అని ఇంద్రాదేవి చెబుతుంది. లేని కడుపు కోసం ఇంత ఆర్భాటం చేయాలా అని స్వప్న తిట్టుకుంటుంది. ఇక కనకం కూతురికి చీర, సారె పెట్టి దీవిస్తారు. తల్లీకొడుకులు తమ ప్లాన్ ఫెయిల్ అయినందుకు రగిలిపోతూ ఉంటారు. కనకం వచ్చి ప్లాన్ మొత్తం పాడు చేసిందని తిట్టుకుంటారు.

ఇక ఇంటికి వచ్చిన కనకం స్వప్న చేసిన పని గురించి తన అక్కతో చెప్పి బాధపడుతుంది. అప్పుని చూసి ఇక నుంచి మగరాయుడు మాదిరిగా డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదని తిడుతుంది. కానీ అప్పు మాత్రం తన వల్ల కాదని పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటానని చెప్తుంది. పద్ధతి మార్చుకోమని తిడుతుంటే కృష్ణమూర్తి అడ్డుపడతాడు. అప్పు ఎవరికోసం మారదని తేల్చి చెప్తాడు.

Kavya warns swapna about her life in July 28th 2023 Episode number 160 in Brahmamudi Telugu Serial

తన అక్క చేసిన పనికి కావ్య రాజ్ కి సోరి చెప్తుంది. స్వప్న ఏదో ఘనకార్యం సాధించినట్టు తాపీగా కూర్చుని తింటూ ఉంటే కావ్య కోపంగా వెళ్తుంది. ఏం చేయాలని అనుకుంటున్నావ్? దాని ద్వారా ఏం కావాలని అనుకుంటున్నావ్? అని కావ్య అడుగుతుంది. నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని స్వప్న అంటుంది.

Kavya warns swapna about her life in July 28th 2023 Episode number 160 in Brahmamudi Telugu Serial

దానికి కావ్య... ఇవి నీతులు కాదు నిజాలు. నీ బండారం బయట పడిన రోజు రోడ్డున పడతావ్. పుట్టిల్లు రానివ్వదు, అత్తిల్లు రానివ్వదు. తప్పు చేసిన కూడా నీకు మంచి జీవితం వచ్చిందని సంతోషపడితే దాన్ని నిలబెట్టుకోవడం లేదని భయంగా ఉంది. నువ్వు కడుపుతో ఉన్నావని అందరూ అనుకుంటున్నారు. దుగ్గిరాల ఇంటి సభ్యురాలివి అయ్యావు. అందరితో బాగుండాలని ఆశిస్తున్నారు ఇకనైనా బుద్ధిగా ఉండు అని చెబుతుంది.

Kavya warns swapna about her life in July 28th 2023 Episode number 160 in Brahmamudi Telugu Serial

కాసేపు వీరి మధ్య వార్ జరుగుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో రాజ్ కావ్య యాడ్ ను 30 లక్షలు కంపెనీకి ఇచ్చి.. తీసేయిస్తాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబుతుండగా స్వప్న వింటుంది. రాజ్ అంటూ కోపంగా వచ్చి.. రాజ్ పై విరుచుకుపడుతుంది. దీంతో కావ్య.. కలుగజేసుకుని.. నా మొగుడిని నువ్వేది అనేది పళ్లు రాలగొడుతా అని వార్నింగ్ ఇస్తుంది. ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X