Brahmamudi August 8th : రాహుల్‌తో అనుకున్నది చేసిన స్వప్న.. మట్టిపని చేస్తున్న కావ్య.. మీడియాలో వార్తలు

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రారంభంలో రాహుల్ బాగా తాగి వస్తాడు. ఇదే మంచి ఛాన్స్ అనుకుని స్వప్న మురిసిపోతుంది. రాహుల్ మంచి మూడ్ లో ఉన్నాడు.. ఈ అవకాశాన్ని వాడుకోవాలి అని అనుకుంటుంది. రాహుల్ తాగిన మత్తులో నీకు ఏం కావాలో చెప్పు.. ఏదైనా ఇస్తాను అని చెబుతాడు. అప్పడు స్వప్న.. రాహుల్ తో బిడ్డను కంటే.. పర్మినెంట్ కోడలు అయిపోవచ్చు అని అనుకుంటుంది. ఇక రాహుల్ దగ్గరకు అవ్వాలని... స్వప్న రాహుల్ మీద పడుతుంది. మొత్తానికి వీళ్లిద్దరు ఒక్కటై పోతారు.

కట్ చేస్తే.. తెల్లారి లేసేసరికి రాహుల్ ను కౌగిలించుకుని స్వప్న పడుకుని ఉంటుంది. నైట్ మత్తులో ఉన్న రాహుల్ లేచే సరికి.. చూసి షాక్ అవుతాడు. ఇక రాత్రి ఏం జరిగిందని అడుగుతాడు.. స్వప్న.. సిగ్గు పడుతూ.. మనకు సెకండ్ టైం ఫస్ట్ నైట్ జరిగిందని అంటుంది. మరి ఉద్యోగం ఎవడు చేస్తాడని చిరాకుగా వెళ్లిపోతాడు రాహుల్. హమ్మయ్య అనుకున్నది సాధించానని స్వప్న మురిసిపోతుంది.

Kavya Works For Her Father Murthy in August 8th 2023 Episode number 169 in Brahmamudi Telugu Serial

మరోవైపు రాజ్ పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే కావ్య.. తన అమ్మవాళ్లింటికి వెళ్లేందుకు వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని అడిగితేే.. మా అమ్మవాళ్ల ఇంటికి అని చెబుతుంది. కానీ మీ డబ్బులు ఏం తీసుకుపోవట్లేదు.. కావాలంటే చెక్ చేసుకోండి అని చెబుతుంది. కాసేపు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు. చివరకు కావ్య.. తన నాన్న వాళ్ల షాపులో పనిచేయడానికి అని చెప్తుంది. రాజ్ షాక్ అవుతాడు. ఈ విషయాన్ని గమనించిన రాహుల్.. అబ్బో.. పుట్టింటికి మళ్లీ వెళ్లదు అనుకుంటే.. ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకుందని, అత్తకు తగ్గ కోడలు అని అనుకుంటాడు.

Kavya Works For Her Father Murthy in August 8th 2023 Episode number 169 in Brahmamudi Telugu Serial

దుగ్గిరాల ఇంటి కోడలిగా వచ్చి.. అక్కడ ఎలా పని చేస్తావ్ అని రాజ్ ప్రశ్నిస్తాడు. నేను కంపెనీలో జాబ్ ఆఫర్ చేసినా.. వెళ్లడం ఎందుకని అంటాడు. నేను కంపెనీలో పని చేయలేను. మీ దగ్గర రూపాయి కూడా తీసుకోనని అంటుంది కావ్య. వెళ్లకు అని చెప్పను, కానీ నువ్ వెళ్లడం నాకు ఇష్టం లేదని అంటాడు. వెళ్లడం నాకు కూడా ఇష్టం లేదని, కానీ వెళ్లక తప్పడం లేదని చెబుతుంది కావ్య. ఇక కనకం ఇంటికి కాంట్రక్టర్ శ్రీను వచ్చి అడ్వాన్స్ ఇస్తాడు. కానీ వాళ్లు తీసుకోవడానికి ఇష్టపడరు. కావ్య పనిచేయడం ఇష్టం లేదని మూర్తి అంటాడు. అప్పుడు కావ్య వచ్చి.. డబ్బులు తీసుకోండి అని నచ్చచెబుతుంది.

Kavya Works For Her Father Murthy in August 8th 2023 Episode number 169 in Brahmamudi Telugu Serial

అత్తారింటిలో సమస్యలు వస్తే.. ఈ పని ఆపేయాలంటూ మూర్తి.. కావ్యకు కండిషన్ పెడతాడు. దానికి ఒప్పుకుని.. కావ్య మట్టిపని చేస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. పని మనిషి భోజనం వడ్డిస్తుంటే.., నువ్ ఎందుకు వడ్డిస్తున్నావని అపర్ణ అడుగుతుంది. కావ్య వడ్డిస్తే కానీ తినవా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అలా కాసేపు అక్కడ వాళ్లు గొడవపడతారు. ఇంద్రా దేవి కల్పించుకుని.. ఎందుకు గొడవ అని సర్ది చెబుతుంది. ఎటు వెళ్లిందని... అడగ్గా.. రాజ్ తెలివిగా కావ్య పుట్టింటికి వెళ్తున్నట్టుగా చెప్పిందని వెల్లడిస్తాడు.

Kavya Works For Her Father Murthy in August 8th 2023 Episode number 169 in Brahmamudi Telugu Serial

నిన్న అంత గొడవ జరిగినా ఎందుకు వెళ్లిందని అపర్ణ అడుగుతుంది. వాళ్ల అమ్మగారికి హెల్త్ బాగా లేదని వెళ్లింది అంటాడు రాజ్. చెప్పి వెళ్లాలి కదా అనగా.. రాజ్ కు చెప్పి వెళ్లింది కదా అని సుభాష్ అంటాడు. ఈ కళావతి చేసే పనులు, నాకు రోజుకో పరీక్షలాగా తయారయ్యాయని అనుకుంటాడు రాజ్. కావ్య మట్టి తొక్కుతూ ఉంటుంది. అప్పు, కావ్య కలిసి సంతోషంగా పని చేస్తారు. కనకాన్ని కూడా మట్టి తొక్కేందుకు లాగుతారు. అందరూ కలిసి హ్యాపీగా పని చేస్తూ ఉంటారు. కనకానికి మూర్తి సంతోషం చూసి ఆనందభాష్పాలు వస్తాయి. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో కావ్య మట్టి పని చేస్తున్న విషయం మీడియాలో వస్తుంది. దుగ్గిరాల వారి ఇంటి కోడలు మట్టి పని చేస్తుందని, అక్కడ పట్టించుకోవడం లేదా అని వార్తల్లో వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X