KBC13లో అమితాబ్‌ను కలువాలనుకొంటున్నారా? అయితే ఈ సింపుల్ ప్రశ్నకు జవాబివ్వండి!

ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ గేమ్ షో సీజన్ 13కు రంగం సిద్ధమైంది. ఈ షోకు సంబంధించిన నిర్వాహకులు తాజా సీజన్‌ కోసం డిజిటల్ సెలక్షన్, స్రీనింగ్ పద్దతి ద్వారా ఎంపిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 10వ తేదీ నుంచి ఈ షోలో ఔత్సాహికులు ప్రవేశించడానికి ప్రశ్నలను అడగడం ప్రారంభించారు. మే 11 తేదీ మంగళవారం రాత్రి రెండో ప్రశ్నను అడిగారు.

సోని ఎంటర్‌టైన్‌మెంట్, సోని లివ్ ఛానెల్‌లో అడిగిన రెండో ప్రశ్న ఏమిటంటే..

కోవిడ్19 కోసం రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ పేరు ఏమిటి?
a) Aura
b) Sputnik V
c) Vostok
d) Phobos

పై ప్రశ్నకు సమాధానం B) Sputinik V

కేబీసీ 13 పాల్గొనడానికి పై ప్రశ్నకు జవాబు పంపించేందుకు Sony Liv యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ప్రశ్నకు జవాబును సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్‌ను నొక్కాలి. లేదా SMS ద్వారా సమాధానాన్ని పంపించాలి. పై ప్రశ్నకు సమాధానం బుధవారం అంటే మే 12 తేదీ రోజు సాయంత్రం 9pm లోపు పంపించాల్సి ఉంటుంది.

KBC 13: Amitabh Bachchan Shoots Second question Sony Liv app

SMS ద్వారా సమాధానం పంపడానికి...
KBCYour answerAgeGender' గురించిన వివరాలు రాసి 509093కు SMS చేయాలి.

బ్రిటన్‌లో హూ వాంట్స్ టూ బీ ఏ మిలియనీర్ అనే కార్యక్రమం ఆధారంగా తెలుగులో కౌన్ బనేగా కరోడ్‌పతి షో ప్రారంభించారు. 2000 సంవత్సరం నుంచి ఏకధాటిగా ఈ షోకు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X