twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు: తీవ్రమైన నొప్పితో కూడా...

    కౌన్‌బనేగా కరోడ్‌పతి సీజన్ 9 ఈ ఆదివారంతో ముగియనుంది. ఈ షో సమయంలో బిగ్ బి తీవ్రమైన గొంతు నొప్పికి గురయ్యారు.

    By Bojja Kumar
    |

    సినిమా ఇండస్ట్రీలో ఎందరో స్టార్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అయ్యారంటే.... దానికి కారణం వృత్తి పట్ల వారికి ఉన్న అంకిత భావం, కమిట్మెంటే కారణం.

    ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హిందీ చిత్ర సీమలో అడుగు పెట్టి సాధారణ స్థాయి నుండి బాలీవుడ్ షెహన్ షాగా, మెగాస్టార్‌గా ఎదిగారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. 75 ఏళ్ల వయసులోనూ అలుపు లేకుండా సినిమాలు, టీవీ షోలు చేస్తూ అదరగొడుతున్నారు.

     తీవ్రమైన గొంతు నొప్పితో ముద్ద మింగలేని స్థితిలో

    తీవ్రమైన గొంతు నొప్పితో ముద్ద మింగలేని స్థితిలో

    ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 9 హోస్ట్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ నెల రోజుల పాటు కంటిన్యూగా మాట్లాడుతూ షో చేయడంతో తీవ్రమైన గొంతు నొప్పికి గురయ్యారు. ముద్ద మింగలేని పరిస్థితికి వచ్చారు. ఆ నొప్పిని భరిస్తూ కూడా ఆయన ఈ సీజన్ చివరి ఎపిసోడ్ పూర్తి చేశారు.

     ప్రజలకు దగ్గరవ్వడంతో పాటు అనారోగ్యం కూడా

    ప్రజలకు దగ్గరవ్వడంతో పాటు అనారోగ్యం కూడా

    'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం తనను ప్రజలకు మరింత దగ్గర చేసిందని... ఇదే సమయంలో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనేలా చేసిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

    పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్ వాడుతూ

    పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్ వాడుతూ

    ఈ షో కోసం దాదాపు నెల రోజుల పాటు తాను కంటిన్యూగా మాట్లాడానని... దీంతో, తన స్వరపేటిక దెబ్బతిందని బిగ్ బీ తెలిపారు. తీవ్రమైన గొంతు నొప్పితో ఆహారాన్ని మింగలేక పోతున్నానని చెప్పారు. రోజంతా యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఫైనల్ ఎపిసోడ్ పూర్తి చేయాల్సి వచ్చిందని అమితాబ్ తెలిపారు.

    చాలా బాధాకరమైన వార్తే...

    చాలా బాధాకరమైన వార్తే...

    రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారని, తన ఆనారోగ్య సమస్య కారనంగా నెక్ట్స్ సీజన్ మొదలవ్వడానికి బహుశా కొన్ని నెలల బ్రేక్ ఇవ్వక తప్పడం లేదు. అభిమానులకు, ఈ షో కోసం పనిచేస్తున్న ఎంతో మందికి ఇది బాధాకరమైన వార్తే అని చెప్పారు. ఈ షో కోసం 24 గంటలూ కష్టపడుతున్న 450 మంది సభ్యులకు తన అభినందనలు అని అమితాబ్ తెలిపారు.

    ఆదివారం ప్రసారం కానున్న ఫైనల్ ఎపిసోడ్

    ఆదివారం ప్రసారం కానున్న ఫైనల్ ఎపిసోడ్

    ‘కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం ఫైనల్ ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కాబోతోంది. ఈ ఫైనల్ ఎపిసోడ్‌తో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 9 ముగియబోతోంది.

    English summary
    Amitabh Bachchan writes, “A peculiar sadness descends upon all those that have connected with us on this season’s KBC, including those that took part in its production and broadcast. But for today it shall have to be ‘packers’ now. The constant talking for the past month for KBC has infected my vocal chords and now with throat pain and swallowing problems. I am on antibiotics and pain killers to be able to work tomorrow the entire day for the finale of the KBC season 9.” The finale episode will be aired on Sunday but there is no reason to be upset about that. AB has confirmed that it will return “after a break of some months hopefully.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X