వాడి జీతం 12 వేలే.. బాయ్‌ఫ్రెండ్‌తో కార్తీకదీపం సీరియల్ నటి బ్రేకప్

బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయినవారిలో కీర్తి భట్ ఒకరు. అంతకుముందే సీరియల్స్ ద్వారా ఆదరణ పొందినప్పటికీ బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కీర్తి భట్. ఈమె జీవితమంతా విషాదాలమయం. అయినప్పటికీ పట్టుదలతో నటిగా మారి, ఈ స్థాయికి చేరుకున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్, వ్యక్తిగత జీవితంలోని సమస్యలపై సంచలన విషయాలు బయటపెట్టారు కీర్తి భట్.

కర్ణాటకకు చెందిన కీర్తి భట్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుని చదువు పూర్తి చేసిన వెంటనే కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి భట్‌కు తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి. మనసిచ్చి చూడుతో తెలుగువారిని పలకరించిన కీర్తి భట్ కెరీర్‌ను బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీక దీపం మలుపు తిప్పింది. ఇందులో హిమ క్యారెక్టర్‌లో కీర్తి భట్ నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు.

keerthi bhat Breakup bigg boss contestant reveals about her ex boyfriend

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కీర్తి భట్ తన అన్నయ్య, వదిన, తల్లిదండ్రులను కోల్పోయింది. అదే ప్రమాదంలో ఆమె కూడా తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయి అనాథగా మారిన కీర్తి ప్రస్తుతం ఓ పాపని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. మనసిచ్చి చూడు సీరియల్‌లో తనకు తండ్రిగా నటించిన ఛత్రపతి శేఖర్ తనకు తండ్రి లేని లోటు తీరుస్తున్నారని.. సొంత కూతురిలా చూసుకుంటున్నారని కీర్తి భట్ తెలిపింది.

బిగ్‌బాస్ తర్వాత కీర్తి భట్‌కు సినిమాలు, సీరియల్స్‌తో పాటు పలు షోలలో అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే పర్సనల్ లైఫ్‌లో చోటు చేసుకున్న విషయాలను వివరించింది. గతేడాది విజయ్ కార్తీక్ అనే వ్యక్తితో నిశ్చితార్ధం చేసుకుని తన జీవితంలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయాలని అనుకుంది. అమ్మాయిలకు పిల్లలు పుట్టారంటే వారిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరని, కానీ విజయ్ మాత్రం తన గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని కీర్తి భట్ తెలిపింది. ఇదే ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడు తనను చేసిన మోసం, తనను టార్చర్ చేసిన విధానం గురించి చెప్పింది.

నా మాజీ ప్రియుడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనని కీర్తి భట్ తెలిపింది. తప్పుడు దారిలో వెళ్తూ నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడింది. నేను పెంచుకున్న పాప నాకే పుట్టిందని అనుమానిస్తూ డీఎన్ఏ టెస్ట్ చేయిస్తానని కొంతమందితో చెప్పాడని .. ఈ విషయం ఇటీవలే నాకు తెలిసి బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నేను అతనిని డబ్బుల కోసం వేధించానని చెప్పుకుంటున్నాడని.. కానీ నెలకు లక్షల్లో సంపాదించే నేను, 12 వేలు సంపాదించే వ్యక్తిని డబ్బులు అడుగుతానా? అడగాల్సిన అవసరం ఏమైనా ఉందా? అని కీర్తి భట్ ప్రశ్నించింది.

బ్రేకప్ తర్వాత నా జీవితంలోకి వచ్చిన విజయ్ కార్తీక్‌కు కూడా నా మాజీ ప్రియుడి గురించి చెడుగా చెప్పలేదని ఆమె పేర్కొంది. బ్రేకప్ అయ్యాక ఎవరి జీవితం వాళ్లది .. నేను నా ఆయన గురించి పట్టించుకోవడం లేదని తెలిపింది. ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదని.. నన్ను ఎలా చేశారో వారికి కూడా అదే గతి వస్తుందని కీర్తి భట్ చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: keerthi bhat bigg boss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X