లవ్ లెటర్ గురించి చెప్పిన హీరోయిన్ కీర్తి సురేష్...
Recommended Video

రానా హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'నెం.1 యారి'కి మంచి స్పందన వస్తోంది. సెలబ్రిటీల నుంచి ఆసక్తికర విషయాలు రాబడుతూ వినోదాత్మకంగా ఈ షోను రన్ చేయడంలో రానా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
తాజాగా 'నెం.1 యారి' కార్యక్రమంలో 'నేను లోకల్' స్టార్స్ కీర్తి సురేష్, నాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా రానా ఈ ఇద్దరి నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టారు. హీరోయిన్ కీర్తి సురేష్ తన లవ్ లెటర్ గురించి వెల్లడించారు.

నాకు ఎదురైన క్రేజీ పర్సన్ అతడే
మీ జీవితంలో ఎదురైన క్రేజీ పర్సన్ ఎవరు? అనే ప్రశ్నకు కీర్తి సురేష్ స్పందిస్తూ.... ‘‘ఓసాకరి నాకు లవ్ లెటర్ వచ్చింది. జ్యువెలరీ షోరూం ఓపెనింగుకు వెళ్లినపుడు ఒకరు నాకు పెద్ద బుక్ గిఫ్టుగా ఇచ్చారు. అందులో నా ఫోటోలు చాలా ఉన్నాయి. అందులో ఓ లెటర్ కూడా ఉంది. దాంట్లో నన్ను ప్రపోజ్ చేస్తూ ఓ లెటర్ ఉంది... అని కీర్తి సురేష్ తెలిపారు.

అదే నా ఫస్ట్ లవ్ లెటర్
ఆ లెటర్లో నన్ను ప్రేమిస్తున్నట్లు ప్రపోజ్ చేయడంతో పాటు... పెళ్లి చేసుకుంటాను అని రాసి ఉంది. అతడి వివరాలు ఫోటోతో సహా ఉన్నాయి. అదే నాకు వచ్చిన మొదటి లవ్ లెటర్. కాలేజ్ రోజుల్లో కూడా ఎప్పుడూ లవ్ లెటర్ రాలేదు... అని కీర్తి సురేష్ అన్నారు.

నానికి ఎదురైన క్రేజీ పర్సన్
అప్పటికీ ‘అష్ట చెమ్మా' సినిమా రిలీజ్ అవ్వలేదు. సినిమా ఫంక్షన్లో ఓ వ్యక్తి నావద్దకు వచ్చాడు. అతడిని ఫ్యాన్ అనొచ్చోలేదో... కానీ అతడి బాడీ లాంగ్వేజ్ నన్ను ఆకట్టుకుంది. క్రౌడ్ లో నుంచి వచ్చి సార్ నేను మీ ఫ్యాన్... మహేష్ బాబును అడిగాను అని చెప్పండి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు. నువ్వు ఎవరు? అనే తెలుసుకునే సమయం కూడా ఇవ్వలేదు అని నాని గుర్తు చేసుకున్నాడు.

నేను టెన్త్ ఫెయిల్ అయ్యా
టెన్త్ పేపర్ లీక్ అయింది. టెలిబ్రాండింగ్ విధానంలో నువ్వు పేపర్ అమ్మాలి అటూ నానికి ఒక టాస్క్ ఇచ్చాడు రానా. తనదైన శైలిలో లీకైన పేపర్ అమ్మి పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు రానా. నీకు తెలుసో లేదో నేను టెన్త్ ఫెయిల్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా రానా అసలు విషయం తెలిపాడు.

మనం అందరం అదే బ్యాచ్
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... మన యాక్టర్లందరూ మార్కెటింగ్ బ్యాచే... మనం స్కిప్టును సినిమా రూపంలో మన పెర్ఫార్మెన్స్‌తో సహా అమ్ముతున్నామని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











