Bigg Boss Telugu 7: శివాజికి హింట్స్ ఇచ్చిన కొడుకు.. వేళ్లతో సైగలు చేసి.. ఏంటీ విన్నర్ పేరు లీకైందా?

దాదాపు ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు అసలైన మజాను రుచి చూపించడంతో పాటు తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన దీనికి అన్ని భాషల కంటే మన దగ్గరే ఎక్కువ స్పందన వస్తోంది. అందుకే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ సైతం సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. ఇందులో పదో వారంలో ఫ్యామిలీ వీక్ జరుగుతోంది. ఇందులో భాగంగా హౌస్‌లోకి వచ్చిన శివాజి కొడుకు కెన్నీ కొన్ని హింట్స్ ఇచ్చాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఉల్టా పుల్టా రుచి చూపిస్తూనే:పోయిన సీజన్లతో పోలిస్తే ఏడో దానిలో బిగ్ బాస్ నిర్వహకులు సరికొత్త వ్యూహాలతో ముందుకు వచ్చారని షో చూసే వారికి అర్థం అవుతోంది. దీనికి కారణం దీన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు రావడమే. వినోదాన్ని పంచేందుకే షో నిర్వహకులు ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రేక్షకులకు నచ్చే కంటెంట్‌నే ఎక్కువగా హైలైట్ చేస్తూ రేటింగ్‌ను రాబడుతున్నారు.

 Kenny Gives Hints to Sivaji in Bigg Boss Telugu 7 Family Week Episode

ఫ్యామిలీ వీక్ మొదలైందిగా:ప్రతి సీజన్‌లోనూ చివర్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. అయితే, ఏడో సీజన్‌లో ఇది ముందుగానే ప్రారంభం అయింది. పదో వారంలోనే నిర్వహకులు ఫ్యామిలీ వీక్‌ను తీసుకొచ్చారు. ఇదంతా ఎంతో ఎమోషనల్‌గా ప్లాన్ చేసేశారు.

డాక్టర్‌లా శివాజి కొడుకు కెన్నీ:ఏడో సీజన్‌లో ఫ్యామిలీ వీక్‌ను మంగళవారం ఎపిసోడ్ నుంచే ప్రారంభించారు. ఇందులో ముందుగా శివాజి పెద్ద కొడుకు కెన్నీ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. తండ్రే గుర్తు పట్టని విధంగా అతడు డాక్టర్ గెటప్‌లో మెడికల్ రూమ్‌లో ప్రత్యక్షం అయ్యాడు. అంతేకాదు, ఏమాత్రం డౌట్ రాకుండా చేయి గురించి అడిగి వివరాలు తెలుసుకున్నాడు. చివర్లో నాన్న అంటూ మేటర్ రివీల్ చేశాడు.

 Kenny Gives Hints to Sivaji in Bigg Boss Telugu 7 Family Week Episode

గర్వంగా లోపలికి తీసుకొచ్చి:మెడికల్ రూమ్‌లో తన కొడుకును చూసిన శివాజి కన్నీటి పర్యంతం అయ్యాడు. అతడిని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. తర్వాత హౌస్‌ లోపలికి తీసుకొచ్చి 'నా కొడుకు కెన్నీ' అంటూ గర్వంగా అందరికీ పరిచయం చేశాడు. కెన్నీ కూడా అందరితో మర్యాదగా మాట్లాడుతూ కనిపించాడు. అనంతరం అతడిని శివాజి పక్కకు తీసుకుని వెళ్లి మనసు విప్పి మాట్లాడాడు.

వాళ్లిద్దరికీ థ్యాంక్స్ చెప్పాడు:శివాజి - కెన్నీ బాల్కనీలో మాట్లాడుతుండగా పల్లవి ప్రశాంత్ వెళ్లాడు. అప్పుడు అతడికి కెన్నీ థ్యాంక్స్ చెప్పాడు. అనంతరం 'యావర్ అన్న ఇంకా అలిగే ఉన్నాడా' అని తండ్రిని అడగ్గా.. 'లేదు. వాడు మాట్లాడాడు' అంటూ శివాజి.. ప్రిన్స్‌ను పిలిచాడు. వాళ్లిద్దరితో కెన్నీ 'మీ ఇద్దరికీ థ్యాంక్స్ అన్నా.. మేము చూసుకున్నట్లే నాన్నను చూసుకుంటున్నారు' అని చెప్పాడు.

 Kenny Gives Hints to Sivaji in Bigg Boss Telugu 7 Family Week Episode

శివాజికి హింట్స్ ఇచ్చాడు:శివాజితో మాట్లాడుతున్న సమయంలోనే కెన్నీ 'ఒక్కటేంటంటే హౌస్‌లో అందరినీ నమ్మకు డాడీ. యావర్, ప్రశాంత్ గురించి చెప్పడం లేదు అర్థం అవుతుంది కదా. మిగిలిన వాళ్లు నిన్ను ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు' అని చెప్పాడు. అప్పుడు శివాజి 'మీరు చెప్తేనే ఆడుతున్నానా? ఒక్కటి చెప్తా.. నేను వచ్చేటప్పుడు అందరూ చప్పట్లు కొడతారు' అని వెల్లడించాడు.

వేళ్లతో సైగలు చేసేశాడా?:ఇక, శివాజితో మాట్లాడుతున్నప్పుడు కెన్నీ ఏవో సైగలు చేసినట్లు అర్థం వచ్చేలా బిగ్ బాస్ హౌస్‌లోని కెమెరాలు వర్క్ చేశాయి. పదే పదే వాళ్ల చేతులను చూపించడంతో కొడుకు తొడలపై శివాజి ఏదో రాసినట్లుగా.. దానికి కెన్నీ మరేదో రాసి బదులిచ్చినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. కొందరైతే విన్నర్ నువ్వే అన్నట్లు కెన్నీ చెప్పాడని కూడా అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X