టీవీ రియాల్టీ షో : రూ. కోటి గెలుచుకున్న పోర్టరు భార్య

By Bojja Kumar

Kerala woman wins Rs.1 crore prize money
తిరువనంతపురం : ఒక పోర్టరు(సామాన్లు మోసే వ్యక్తి) భార్య టీవీ రియాల్టీ షోలో రూ. కోటి గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె పేరు సనూజా రాజన్. వయస్సు 38. నటుడు సురేష్ గోపీ వ్యాఖ్యాతగా మళయాళం ఛానల్ ఏసియా నెట్‌లో ప్రసారం అయిన "Ningalkkumaakam Kodeeswaran" అనే కౌనబనేగా కరోడ్ పతి తరహా రియాల్టీ షోలో ఆమె 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి కోటి రూపాయలు గెలచుకుంది.

దీంతో కష్టాల కడలిలో ఈదుతున్న సనూజ ఊహించని రీతిలో అందులో నుంచి బయట పడ్డట్లయింది. కేరళకు చెందిన సనూజ ప్రేమించిన వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. దీంతో వీరిని ఇరు కుటుంబాల వారు దూరంగా పెట్టారు. అయితే ఆమె భర్త ఆమెను చదువకోమని ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేలా ప్రిపేర్ చేయించాడు.

ఏడాది క్రితం ఆమెకు తిరువనంతపురంలోని కలెక్టర్ ఆఫీసులో అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. అయినా వారి కష్టాలు తీరలేదు. ఇద్దరు పిల్లలు, వారి చదువులకు తోడు ఇటీవల అంతా అనారోగ్యం కారణంగా అప్పుల పాలై ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రియాల్టీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. ఈ షోలో కోటి రూపాయలు గెలిచిన తొలి వ్యక్తి కూడా ఆమెనే. కోటి గెలుచుకున్న సనూజా రాజన్ తన కష్టాలు తీరిపోవడం ఆనందం వ్యక్తం చేసింది. తన భర్తచే పోర్టరు పని మాన్పించి టాక్సీ కారు కొనిస్తానని అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X